కారులో షికారుకెళ్ళే

చాలా మంది జీవితాల్లో కార్లు నిత్య భాగమైపోయినాయి.

అమెరికాలో, అందునా డెట్రాయిట్ లాంటి పబ్లిక్ ట్రన్స్పోర్టు లేని ప్రాంతాల్లో కారు లేక పోతే కాళ్ళు లేనట్టే.

చమురు ధరలు, తద్వారా పెట్రోలు ధరలు కనీ వినీ ఎరుగని గరిష్ఠ స్థాయిలో తచ్చట్లాడుతుంటే, చాలామంది కొనుగోలు దారులు హెచ్చు ఎఫిషియెన్సీ తో నడిచే ఖార్ల కోసం వెతుకుతున్నారు. హైబ్రిడ్ ఇంజన్లతో నడిచే కార్లమీద మోజు చూపిస్తున్నారు.

ఐతే అందరికీ ఉన్నపళంగా కొత్త కారు కొనుక్కోవడం సాధ్యం కాదు.
ఉన్నంతలో, మన డ్రవింగ్ అలవాట్లని కొద్దిగా మార్చుకోవడం ద్వారా, మన కారు యొక్క ఎఫిషియెన్సీని పెంచవచ్చు.

కొన్ని సూచనలు:

 • కారులో అనవసరమైన బరువు ఉంచుకుని తిరగవద్దు.
 • మీ కారుకి అత్యధిక ఎఫిషియెన్సీ వచ్చే వేగ పరిమితి ఏమిటో తెలుసుకొని ఆ పరిమిత్లో నడపడానికి ప్రయత్నించండి. పెట్రోలుతో నడిచే చాలా కార్లు 45 – 60 mph స్పీడులో అత్యధిక ఎఫిషియెన్సీ కలిగి ఉంటాయి. 60 మైళ్ళ స్పీడు దాటిన కొద్దీ ప్రతి 5 మైళ్ళ ఎక్కువ స్పీడుకీ ఎఫిషియెన్సీ 5 % తగ్గుతుందని అంచనా.
 • ఒక సారి ఇంట్లో బయలు దేరినాక ఒకటి కన్నా ఎక్కువ పనులు చేసుకుని రావడానికి ప్రయత్నించండి. 4 పనులు చేసుకు రావడానికి వేర్వేరు ట్రిప్పులు వేస్తే, ప్రతి సారీ ఇంజను స్టార్ట్ చెయ్యడంలో కొంత ఇంధనం వృధా అవుతుంది.
 • హైవే మీద వెళ్తున్నప్పుడు క్రూయిజ్ కంట్రోలు (cruise control) ఉపయోగించండి.</
 • li>

 • అకస్మాత్తుగా వేగం పెంచడం, బ్రేకు వెయ్యడం చెయ్య వద్దు. సాధ్యమైనంత వరకూ ఒకే స్పీడులో వెళ్ళడం మంచిది.</
 • ul>

  మరిన్ని వివరాలు ఇక్కడ.

  Advertisements

నేను సైతం పాటించేందుకు “నెటిజన” సూత్రాలు

మన సమాజంలోని విపరీతపు పోకడలను గమనిస్తూ, చురుకైన వ్యాఖ్యలతో మనల్ని అప్రమత్తంగా ఉంచడానికి నెటిజెన్ గారి బ్లాగు మారు పేరు. ఇక్కడ బత్తీబంద్ సందర్భంగా జరుగుతున్న సందోహానికి ప్రేరేపితులై .. తన పరిశోధనల్లో తెలుసుకున్న విషయాల్ని మనతో పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరమూ “నేను సైతం” అని భూతాప నివారణకి మనవంతు ఏం చెయ్యగలమో సూచనలిస్తున్నారు.
*** *** ***

 • ఫ్రిడ్జ్‌లోంచి తీసి వెమ్మటే స్టవ్ మీద పెట్టడంకంటే ఒక రెండూ నిముషాలు బయటి వాతవరణంలోని శీతోష్ణస్థితికి వచ్చింతరువాత వేడి చేసుకోవడం వలన కొంత ఇంధనం అదావుతుంది.
 • భానుడి ప్రతాపం కొంచెం ఎక్కువ ఉన్న రోజులలో ఒవెర్‌హెడ్ టాంకులో నీళ్ళు వేడిగానే ఉంటాయి. వాటితోనే స్నానాలు చెయ్యవచ్చు. మరిగే నిళ్ళు అఖర్లేదు. .
 • ద్విచక్రవాహనం మీద కూర్చుని కిక్ స్తార్ట్ చేసి బండిని వెనక్కి ముందుకి తిప్పడంకంటే, మనకి కావలిసిన దారిలోకి బండిని పెట్టుకుని ఈంజిని స్టార్ట్ చెయ్యడం మూలంగా కొంత ఇంధనాన్ని అదా చేసుకోవచ్చు.
 • సిగ్నల్స్ దగ్గిర కూడా ఎర్ర లైటు పడేదాకా, ఇంజన్ని ఆపేసి కూడ కొంత ఇంధనాన్ని అదా జేసుకోవడమే కాదు, కాలుష్యాన్ని తగ్గించినవారు కూడా అవుతారు.
 • అవకాశం ఉన్నప్పుడు తోటివారితో కలిసి షాపింగ్‌కి మీ వాహనంతో వెళ్ళడం ద్వారా “నేను సైతం” లెవల్లో ఇంకొకరికి సహయం చేసాను అని మన భుజం మనం చరుచుకోవచ్చు.
 • రోడ్డు మీద చెట్లు నాటి వాటిని పెద్దవయ్యేదాకా చూడగలిగితే సంతోషమే. అలా కాని పరిస్థితులఓ చిన్న చిన్న కుండీలలో మీ ఇంట్లోనే చిన్న మొక్కలు పెంచడం ద్వారా కూడా భూ తాపాన్ని తగ్గించడానికి మీరు సహాయం చేసిన వారవుతారు.
 • స్వంత ఇళ్ళు కట్టుకునేటప్పుడు eco-friendly సరుకు సరంజామతో ఇల్లు కట్టుకోవచ్చు. ఎత్తైన సీలింగ్స్ మూలంగా ఇల్లు చల్లగావుంటుంది. ఆ మేరకు ఏ.సీ / ఫాన్ వాడకం తగ్గుతుంది.
 • విశాలమైన కిటికీలు బిగించడంవల్ల వెలుతురు ఉంటుంది. లైట్ల వాడకం తగ్గుతుంది.
 • “వాటర్ హార్వెస్టింగ్” సూత్రాలు అనుసరించడంవల్ల భూతాపాన్ని మీరు అరికట్టి వారవుతారు.
 • ఈ eco-friendly ఇళ్ళ వివరాలకు – Laurie Baker (లారి బేకరి) ని చూడండి.
 • పైన వెప్పినవాని కూడా “డబ్బు ” ని అదా చేసేవే. ఆ డబ్బు మీ దగ్గిరే ఉంటుంది. అదే మీకు లాభం.
 • ఇవన్ని కా్కుండా మీరు ఇంకొక పని కూడా చెయ్యవచ్చు — కనీసం ఇంకొక ఇద్దర్ని ఈ విషయంలో చైతన్యవంతులని చేసి, కనీసం ఒక్ఖ సూ్త్రానైనా పాటింప చేస్తే మీరు నిజంగా ఛాంపియనే!

నిరంజనోపాఖ్యానం

దంచెద ఊక యని ఢంకా బజాయించి మరీ బ్లాగ్ప్రవేశం చేసిన ఊకదంపుడు, అటు ఛందోబద్ధ కవిత్వాన్నీ, ఇటు మందుబాబు తూగులయ్య పదాల్నీ, సరే ఇహ ఇంగ్లీషు యు లివ్ లాంగా అంటూ పైనా కిందా ఎడాపెడా వాయించే ఈ పెద్దమనిషికి మొన్నొకరోజున ఊహించని ఎదురు దెబ్బ తగిలిందిట.
*** *** ***
గత వారాంతం లో అనుకోకుండా నిరంజన్ దగ్గరకి వెళ్లాను. వాడిది నాది పదిహేనేళ్ల స్నేహం.
కాలేజీ లో చేరిన కొత్తల్లో పరిచయం, ఇద్దరం ఒకే క్లాసు, తనూ నాలాగే రూం వెతుక్కుంటున్నాడు, మొత్తానికి మాయాబజార్ లో ఓ పోర్షను దొరికితే, ఇద్దరం కలిసి ఉండాలని తీర్మానించుకొని అద్దెకి దిగాం.

చేరిన పదిరోజులకనుకుంటా , ఓ ఆదివారం నాడు పొద్దున పదింటికి నిద్రలేవగానే,
ఏంటి రాత్రి లైటాపకుండానే పడుకున్నావ్? అన్నాడు..
చాలాసేపు ఏదో చదువుతున్నాను, అలానే నాకు తెలియకుండా నిద్రపోయాను అన్నాను..
ఆదే రోజు సాయంత్రం, వాడు ఎక్కడికో వెళ్ళాడు, వాడు అడుగు బయట పెట్టీపెట్టగానే కరంటు పోయింది.కాసేపటికి ఏమిచేయాలో తెలియక నేను సినిమాకెళ్ళాను.
తిరిగి వచ్చిన తరువాత వాడు అడిగిన మొదటి ప్రశ్న:
లైటార్పేయకుండా బయటకు వెళ్లావ్?
కరంటు పోయినప్పుడు బయటకు వెళ్ళాను, అనుకోకుండా అటునుంచి సినిమాకి వెళ్ళాను అన్నాను
నీకు డబ్బులెక్కువైతే కరన్సీ తగలెట్టు కానీ కరంటు తగలబెట్టద్దు అన్నాడు.

కరంటు షాకు కొట్టినట్టైంది…

ఇంకో సారి, సందర్భం గుర్తు లేదు, ఎదో బేరం అనుకుంటాను, కొట్టువాడు, ౧౦ రూపాయలు చెప్పిన వస్తువు, కాసేపు బేరం జరిగిన తరువాత వీడు తొమ్మిది రూపాయలకు అడిగాడు..
రూపాయిమాత్రానికి ఏముంది తీసుకో అన్నాను…
విసా విసా బయటకు వచ్చేసాడు..

రోడ్డుపైకొచ్చిన వచ్చినతరువాత,
౯ రూపాయలు ౧౦ రూపయలు అవ్వాలంటే బాంకులో ఓ సంవత్సరం పాటు నిల్వ ఉంచాలి తెలుసా అన్నాడు.. తొమ్మిది రూపాలకు నేను కొనదల్చుకున్న వస్తువు పదిరూపాయలు కొమ్టున్నాను అంటే పదకొండు శాతం ఎక్కువ ఖర్చు పెడుతున్నాను అని అర్ధం, ఇవాళ బ్యాంకు వడ్డీ కూడా అంతలేదు అన్నాడు.

ఇంత క్రమశిక్షణ ఇంత కచ్చితత్వమూ, ఉన్న నిక్కచ్చి మనిషితో రూమ్మేట్ గా ఉండటం నా వల్లకాదని ౩ నెలలకల్ల తెలిసిపోయింది.మెల్లగా మకాం మార్చాను. ఐతే మాసవారి పరీక్షలు, అసైన్‍మెంట్లు, ఆఖరివారపు ఆర్ధికకటకట ఇత్యాది నా అవసరాలవల్ల ‘స్నేహం’ మాత్రం బానే నడిచింది.

డిగ్రీ అయిన తరువాత కలపలేదు, అమెరికా వెళ్ళి ఓ పుష్కరం ఉండీ పుష్కలంగా సంపాదిచ్చుకొని ఈ మధ్యనే స్వదేశం లో స్థిరపడదామని వచ్చాడు. ఇప్పుడు పదిహేనుయేళ్ల తరువాత మళ్లీవాడిని కలవటానికి వాళ్లింటికి వెళ్ళాను. నిజానికి నాకు వెళ్ళాలని అంత ఆసక్తి కానీ లేదు వాడి భార్య, నా భార్యస్నేహితురాలవటంచేత, ఆవిడ గత పదిరోజులలో చాలమార్లు ఈమెకి ఫొన్ చేసి రమ్మంటం వల్ల, ఈవిడ ఇవాళ వస్తున్నట్టు చెప్పటం వల్ల తప్పలేదు.
నే వెళ్లేసరికి ఏడుముప్పావయ్యింది. విశాలమైన టౌన్‍షిప్పులో ఆఫీస్ వాళ్లిచ్చిన ఫ్లాట్ లో ఉంటున్నాడు. వాడి ఫ్లాట్ ఎంట్రన్స్ దగ్గరకి వెళ్లేసరికి అంతా చీకటి. తలుపు తీసే ఉండటం తో అరే నిరంజన్ అని పిలిచాను.
పిలిచిన వెంటనే వచ్చాడు ఓ కొవ్వొత్తి పట్టుకొని..

ఎంట్రా నీ ఒక్కఫ్లాట్ లోనే కరంటు పోయినట్టుంది అంటూ లోపలికి వెళ్లాను..
కాసేపాగి వస్తుందిలే అని అంటుండగా వాళ్లవిడ పెద్దకొవ్వొత్తి తెచ్చి టీపాయి మీద పెట్టి, నాకో నమస్కారం పెట్టి మా అవిడని,పిల్లవాడిని తనతో లోపలికి తీసుకువెళ్లింది.

సోఫాలో కూర్చుంటూ మీ ఒక్కఫ్లాట్లోనే కరంటుపోయిందేమిటిరా అన్నాను.

ఇప్పుడే వస్తుందిలే కూర్చోరా, సంగతులు చెప్పు ఎట్టా ఉన్నావ్ అన్నాడు.
బానే ఉన్నారా.. ఐనా ఎమర్జెన్సీ లైటన్నా లేకుండా ఈ కాండిల్స్ ఏమిటిరా అన్నాను?
కరంటు పోలేదు రా నేనే అన్ని లైట్లూ ఆపేశాను అన్నాడు..
అపేశావా ఎందుకు
గ్లోబల్ వార్మింగ్ రా అన్నాడు…
అప్పుడెప్పుడే ఆయిల్‍పుల్లింగ్ చుట్టుకున్నట్టు ఈ అంటువ్యాధి నీకూ బట్టుకుందా అన్నాను..ఓ వంకర నవ్వుతో…
అవును అన్నాడు…
ఐనా ఆ టీవీ వాళ్లదయ వల్ల మొన్నే అయిపోయిందిగా, ఇంకా ఇప్పుడేమిటీ అన్నాను

టీవీ వాళ్లు ఆ రోజు మాత్రమే చేశారేమో, నేను రోజూ చేస్తూనే ఉన్నాను అన్నాడు…
బాబ్బాబూ మా అబ్బాయి భయపడతాడు .. లైట్లు వెయ్యరా…
వాడు ఎక్కడ భయపడతాడో అని నువ్వు భయపడక వాడు చక్కగా ఆడుకుంటున్నాడు అన్నాడు..
లోపలికి తొంగి చూశాను, అద్దరు ఆడవాళ్లు తమ బడి ముచ్చట్లలో, ఇద్దరు పిల్లలూ ఆటలలో ఉన్నారు..
నాకు ఏమి చెయ్యాలో తెలియలేదు..
పోనీ అలా బయటకు వెళ్ళి లైటులో కూర్చొని మాట్లాడుకుందాం రారా అన్నాను..

నేను కావాలని చీకటిని కోరుకొని, లైట్లు ఆర్పేశాను రా.. నా ఇంట్లో ఆపేసి వెరే లైటు దగ్గరో , జనరేటర్ వాడాటానికో, షాపింగ్‍మాల్‍కివెళ్ళటానికో కాదు అన్నాడు.

అసలు నువ్వు ఓ గంట ఆపెయ్యటం వల్ల ఏమైనా లాభం ఉందా?
ఉంది. ఓ గంటపాటు భూతాపానికి నా పాపం జోడించటంలేదు… …
ఓ గంట, దానివల్ల ఏమిటి ఉపయోగం..
ఈ గంట ఆపివేసి కూర్చోవటం వల్ల, నేను – ఈ భూతాప సమస్యని రోజంతా నేను మర్చిపోను..
అందువల్ల ఒరిగేదేముందిట?
అందువల్ల నా జీవనవిధానం లో నే మార్పువచ్చింది…
ఏమిటో..

కాంటీన్ కో లైబ్రరీకో వెళ్లినపుడు నాకోసం ప్రత్యేకం లైటు, ఫాను వేసుకోకుండా అవి ఉన్న చోట ఇతరులతో పాటే కూర్చోవటం.బండిని పదే పదే బయటికి తీయకుండా.. బండి మీద వెళ్ళాల్సిన పనులన్నీ రోజుకి ఒకేసారి చేయటం..

నీ పిసినారి తననానికి పెద్ద పెద్ద పేర్లు ఎందుకు పెడతావ్ చెప్పు…

కరంటు విషయం లో నాది పినిసిగొట్టు అనటం అవివేకం.. కాలేజీ రోజుల్లో ఊళ్లలో రోజుకి పది గంటలుదాక కరంటు కోత ఉండేది.. పంటలకుఉ నీళ్లు పెట్టుకోలేక రైతులు అల్లాడేవారు.. నీబొటి వాళ్లేమో కరంటు ను దుబారా చేసావారు… ఇప్పుడు అదే పరిస్థితి తోడు ఈ గ్లోబల్ వార్మింగు కూడాను..

నా దగ్గర డబ్బులున్నాయి నేను దుబారా చేస్తాను….

నీ డబ్బులని నువ్వు దుబారా చేసుకో, కానీ, భూమి, నీరు, విద్యుత్ శక్తి.. ఇవి జాతీయ వనరులు… మన భారతదేశం లో నీటీ కొరత , విద్యుత్ శక్తి కొరత ఎంతవుందో తెలియకుండా ,ఈ రెంటీనీ దుబారా చేశావాడు సంఘ ద్రోహే నాదృష్టిలో.
డబ్బు దుబారా సేస్తే తిరిగి సంపాదింకుంటావేమో ,ఇవి ఓ సారి ఖర్చు సేసిన తరువాత దక్కనుకూడా దక్కవు.
ఎందుకు దక్కవు డబ్బులుపడేస్తే దక్కుతాయి…
వందేళ్ల క్రితం భాగ్యనగరానికి ఆనుకొని ‘మూసీ’ అనే మంచినీటి నది ఉంది…ఆ నదిని మళ్లీ తీసుకురావటానికి ఎన్ని డబ్బులు పడేస్తావ్?
….
రాయలసీమ ఎడారిగా మారకుండా ఉండటానికి ఎన్నిడబ్బులు విసిరేస్తావ్?
అవన్నీ గవర్నమెంటు చూడాలిరా..
గవర్నమెంటు చూడాలి.. చూడాకపొతే వాళ్లని ఐదేళ్ల తరువాత దింపేయాలి.. ఇంకోపనికిమాలిన వాళ్లని ఎక్కించాలి.. అంతే గాని ఇంకేంచేయనంటావ్…
చస్… చేయకపోవటం ఎందిరహే.. హాపీ గా చేశావాడిని.. మా తాతయ్య వందెకరం జల్సాలకి తగలెట్టాడు.. లేకపోతే.. అందులో హాపీగా పంటలుపండిచ్చుకుంటూ మా ఊళ్లో కాలుష్యం లేని చోట హాపీగా బతికి,.. మీ ఆహారకొరతకూడా తీర్చేవాడిని…
మీ తాతయ్య నీకన్నాచాలామంచి వాడు తెలుసా..
పేకాటికి, తిరుగుళ్లకి తగలేసి కొడుకులకి మనవళ్లకి డబ్బులు లేకుండా జేసినవాడు మంచోడారా నీకు?…
ఆయన డబ్బులు లేకుండా చేశాడేమో గానీ, మంచినీరు, మంచి గాలీ.. ఇచ్చాడు.. భూమి మీద మనుషులు నివసించలేని పరిస్థితి కల్పించలేదు…
కానీ ఇవాళ నీ జీవన విధానం వల్ల… రెండు తరలా తరువాత … మంచినీళ్లకి పెట్రోలుకన్నా కష్టపడాలిసివస్తే, ఇవాళ మంచి నీళ్లు కొనుక్కుంటునట్టు మంచి గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తే.. నీవు భూమి మీద వదిలే అధిక వ్యర్ధాలవల్ల…వాళ్లకి పుట్టకతోనే జబ్బులొస్తే, వాళ్లు నిన్ను ఎంత తిట్టూకోవాలీ….
ఏమి బదులు చెప్పాలో తెలియక బిక్కమొహం వేసి ఆలోచిస్తుంటే.. ఆదుకోవటానికా అన్నట్టు అర్ధాంగి వచ్చింది..
ఏమండీ రెండు వీధులవతల మా ఫ్రెండు అనూరాధ ఉంటుందిట, అడ్రస్ తీసుకున్నాను వెల్దాంరండి, చిన్నప్పుడు దానికి కన్నా నాకు అందగాడు దొరుకుతాడాని పందెం వేశాను…
వెళ్లొస్తాం రా అని చెప్పి లేచాను…
నేను చెప్పిన దాని గురించి సీరియస్ గా అలోచించు అన్నాడు…
కారు రోడ్డుక్కుతుంటే, ఇంటి దగ్గర స్విచ్ ఆఫ్ చేయకుండ వచ్చిన కంఫ్యూటర్, ఆ గదిలో లైటు, హాల్లోనూ , కిచన్ లోనూ వెలుగుతున్న లైట్లు, బోర్డ్ దగ్గర ఆఫ్‍చేయకూండా రిమోట్ తో ఆఫ్‍చేసిన టీవీ,వీసిడిప్లేయర్ పొద్దున సతీమణి బట్టలు వాషింగ్ మెషీన్ డ్రయర్ లో వేయటం కళ్లముందు కదిలాడాయి..

మీ ఫ్రెండింటికి మరెప్పుడన్నా వెళ్దాం .. ముందు ఇంటికి వెళ్లాలి అన్నాను…

మీ ఫ్రెండు మీకు ఏదో బ్రెయిన్ వాష్ చేసినట్టున్నాడు అంది…
బ్రెయిన్ వాష్ కాదు ‘బగ్ ఫిక్స్’ చేశాడు అన్న మాటలు నా పెదవులమీదే అగిపోయాయి…

‘నేను సైతం’

మానస వీణని శ్రుతి చేసి మధురరాగాలు పలికిస్తూ అనంత సౌరభాలు వెదజల్లే నిషిగంధ ఈ గ్లోబోళ జంభపై తనదైన శైలిలో యుద్ధం ప్రకటిస్తున్నారు చూడండి.
*** *** ***

అదొక బద్దకపు వారాంతపు సాయంకాలం..
చెయ్యాల్సిన పనులెన్నో ఉన్నా .. అసలు ఉండాల్సిన మూడ్ లేక, లాప్ టాప్ ముందేసుకుని యూట్యూబ్ లో ఏవేవో పాటల కోసం వెతుకుతున్నా..
అనుకోకుండా నాకు చాలా ఇష్టమైన ‘అమృత’ తమిళ్ సినిమాలో సత్తెన ననైదదు
ఆ వీడియో చూస్తూ ఎక్సైట్ అయిపోయి, పక్కనే టివి చూస్తున్న మావారిని ఒక పోటు పొడిచి “చూడండి మీరు అచ్చు ఇలానే మీ అక్క ముందు నన్ను..” అంటుండగానే శంకరాభరణం శాస్త్రి గారు “శారదా” అని అరిచినట్లు “ష్ష్ ష్ష్” అని గట్టిగా విసుక్కున్నారు. అంత ముఖ్యమైన ప్రోగ్రాం టివిలో ఏమొస్తోందా అని నేనూ తల తిప్పి చూశాను. National Geographic channel లో గ్రీన్ లాండ్ లో ఉన్న ఐస్ ఇదివరికటి కంటే వేగంగా కరిగిపోతుందని, కారణం గ్లోబల్ వార్మింగ్ అనీ చూపిస్తున్నారు.

ఎంత కోపమొచ్చిందనీ!! ‘ఎక్కడో ఐస్ ముక్కలవుతుందని పక్కనే ఉన్న నన్ను కసురుకుంటారా.. కాసేపట్లో “డిన్నర్ ఏంటోయ్” అని కొంగు పట్టుకుంటారుగా అప్పుడు చెప్తాను ‘ అని కచ్చిగా అనుకున్నా.

కానీ, ఒక్క క్షణం పాటే చూసినా, టివిలోని దృశ్యం నన్ను నిలువనీయలేదు. నేనూ వెళ్ళి టివి చూడటం మొదలుపెట్టాను. మైళ్ళకి మైళ్ళు విస్తరించి ఉన్న ఐస్ పెళ్ళలు పెళ్ళలుగా విరిగి సముద్రంలో కలిసిపోతుంది.. ఇంత వేగంగా కరగడం వలన సముద్రంలో నీటిమట్టం అనూహ్యంగా పెరిగిపోతుందని చెప్తున్నాడు.

ప్రోగ్రాం అవ్వగానే ప్చ్ అని పెద్దగా నిట్టూర్చడంతో నా కర్తవ్యం ముగించి ఇంకో ఛానెల్ కి మార్చుకున్నాను.

మనలో చాలా మందికి ఇలాంటి పర్యావరణ సమస్యల మీద పెద్ద అవగాహన ఉండదు. ఉన్నా దాని తీవ్రతని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించం. కారణం మన దైనందిన కార్యక్రమాలు. ఏదో తప్పనిసరై ఈ సమస్యల గురించి వినాల్సి వస్తే వెంటనే బాధేస్తుంది.. ఆ క్షణంలో నవనాగరిక పౌరులుగా ఈ సమస్యా నివారణకి మనం కూడా ఏదో చేయాలి అన్న ఆవేశం వస్తుంది.. వెంటనే ఎప్పటినించో వాయిదా వేస్తున్న పని ఒకటి ఠక్కున గుర్తుకొస్తుంది.. ఉన్నట్టుండి అదెంతో ముఖ్యమనిపిస్తుంది.. ముందది పూర్తి చేసేసి తర్వాత మనసంతా పూర్తిగా ఈ సమస్య మీద పెడదాం’ అనుకుని ఆ పనివైపుకి మళ్ళుతాం! అలాగే అన్నం తింటాం, పడుకుంటాం.. లేచేసరికి ఆవేశం పోతుంది.. ‘ఆ మన ఒక్కళ్ళం ఎంత చేసి ఏం ప్రయోజనం.. జరగాల్సింది జరగక మానదు.. అయినా ఎప్పుడో జరగబోయేదానికి మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు.. అప్పటికి మనం ఉండొచ్చామా.. చూడొచ్చామా!!’ వేదాంత ధోరణి.. నేనూ ఇంతే! ఎప్పటినించో తెలుసు ఉష్ణోగ్రతలలో పెరుగుదల, వాతావరణంలో జరుగుతున్న అవాంఛిత మార్పులు.. అయినా ఆ సమస్యపై దృష్టి పెట్టింది లేదు!

టివి లో ప్రోగ్రాం చూస్తున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఆ రాత్రి పడుకునేప్పుడు, కరిగి నీరవుతూ సముద్రంలో కలిసిపోతున్న మంచు గురించి ఆలోచిస్తుంటే మన వెండి కొండలు హిమాలయాలు గుర్తొచ్చాయి. భవిష్యత్తులో మన తరువాతి తరాలవారు పైనించీ కిందవరకూ మాస్క్ లు ధరించి (ఆదిత్య 369 చివర్లో చూపించినట్లుగా) ఆ పర్వతాల వైపు చూస్తూ ‘ఒకప్పుడు ఇవి మంచుతో కప్పబడి ఉండేవంటా!’ అని మనం ఇప్పుడు గుప్తుల స్వర్ణయుగం గురించి మాట్లాడుకున్నట్లు అనుకుంటారేమో అనిపించింది! వెంటనే అదో రకమైన భయం!! పచ్చదనం, సెలయేర్లు ఇవన్నీ కేవలం పుస్తకాల్లో మాత్రమే చూసే రోజు రాదు కదా!! ఇంకా భయం వేసింది!! అప్పుడు మొదలుపెట్టింది నా మనసు సరిగ్గా ఆలోచించడం..

ఈ పర్యావరణ సమస్య మీద మన వాళ్ళకి, మన చుట్టూ ఉన్నవాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవాలి.. వారికి సమస్య తీవ్రతని తెలియజేయాలి.. దానికి ‘బత్తీ బంద్ ‘ లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి.. అప్పుడు కూడా ఊరికే దీపాలార్పేసి కూర్చోకుండా పిల్లలకి, తెలియని వాళ్ళకి ‘గ్రీన్ హౌస్ వాయువులు’ లాంటి విషయాల గురించి చెప్తూ చర్చ చేయాలి. మొన్నొకరోజు వర్క్ లో మా గ్రూప్ అంతా లంచ్ కి వెళ్ళినప్పుడు ఈ సమస్యకి వాళ్ళే విధంగా స్పందిస్తున్నారని అడిగాను. ప్రతి ఒక్కళ్ళూ నీళ్ళు నమిలినవాళ్ళే! నెమ్మదిగానే అయినా, ఉత్సాహంగా మా ఇంట్లో మా దైనందిన చర్యలో చేసిన చిన్న చిన్న మార్పుల గురించి చెప్పాను. Energy efficient బల్బులు వాడటం, ఇంట్లో ఉన్న అనవసరమైన ఎలెక్ట్రికల్ వస్తువులను (ఉదాహరణకి టేబుల్ టాప్ వాటర్ ఫౌంటైన్, సీనరీ ఛేంజ్ అయ్యే వాల్ ఫ్రేం, లాంటివి) తీసివేయడం, మావారు 3, 4 పాటలు పాడుకుని గానీ పూర్తిచేయని స్నానాన్ని ఒక్క పాటతో అవజేయడం, టైం సేవ్ చేద్దామంటూ చిన్న చిన్న పనులకు కూడా చెరో కార్లో వెళ్ళడం ఆపేసి ఇద్దరం కలిసి వెళ్ళడం, గార్డెన్ లో మామూలు ఎలెక్టిక్ లైట్స్ తీసేసి సోలార్ లైట్స్ పెట్టడం ఇలా చిన్న చిన్న మార్పులే అయినా మనసులో ‘నేను సైతం’ అన్న సంతృప్తి!! నేను అమ్మకి చెప్పాను ‘లక్ష్మీదేవి తిరుగుతుందని ఇల్లంతా లైట్లు వేసుకుని కూర్చోకూ’ అని. వచ్చే నెలలో హైదరాబాద్ లో జరగబోయే బత్తీబంద్ గురించి చెప్పి మీ అపార్ట్ మెంట్లో కూడా అలాంటివి జరిగేటట్లు చూడమని చెప్పాను.

ఈ సమస్యని ఎదుర్కోవడం ఎప్పుడో కాదు ఇప్పటి నించే, ఎక్కడినించో కాదు ముందు నా ఇంటినించే అని ప్రతి ఒక్కరూ అనుకునే రోజు, అదీ వీలైనంత తొందరగా రావాలి. మంచినీళ్ళు కొనుక్కుని తాగడం మా అమ్మమ్మకి ఇప్పటికీ మింగుడుపడని విషయం. మన ముందు తరాల వారు గాలిని కొనుక్కునే రోజుల్ని మన కళ్ళతోనే చూసే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను.

కొసమెరుపు: నేను ఎంతో ఉత్సాహంగా చూపించబోయిన పాటని ‘ష్ష్’ అని చిరాకుపడుతూ ఆపేసిన మావారికి ఆ తర్వాత నా నించి ఎన్ని ‘ఊహూ’ లు వచ్చుంటాయో ఊహించమని ప్రార్ధన. మరి గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పేటప్పుడు చల్లగా చెప్పాలి కానీ అలా మండిపడితే పనులవుతాయా!!

టి మేడ్, బి. ఓ. ఎస్. ఎఫ్.

నేను ముంబై అన్ ప్లగ్ ని గురించి తెలుసుకోగానే స్ఫూర్తిని పొంది మన హైదరాబాదులో కూడా మనందరం చేస్తే బాగుంటుందని తలచి, టి మేడ్ గుంపులోను, బి. ఓ. ఎస్. ఎఫ్. గుంపులోను మెయిల్ చేసాను. ముందుగా టి మేడ్ సభ్యులే స్పందించారు.