చీకటిలో, చీకటితో నేను – భూమి ఘడియలో నా ప్రహసనం

కొవ్వొత్తులు వెలిగించి, విద్యుత్తు పరికరాలన్నీ ఆపేసాను. ఈ కొవ్వొత్తుల స్టాండులను (తెలుగులో ఏమనవలెను)  కొని చాలా రోజులైనా వాడడం ఆ రోజే. వీటికి ఓ చిన్న కథ ఉంది. వీటిని కార్గిల్ యుధ్ధంలో చిత్రహింసల పాలు బడి వీరమరణం పొందిన కెప్టెన్ సౌరభ్ కాలియా కోసం కొన్నాను. కానీ విమానంలో సామాను బరువుకి కొలబద్దలున్నందున పంపడం వీలు కాలేదు.

తర్వాత ఆకలి వేయడంతో బొప్పాయి పండు కోసాను. అందరూ కొవ్వొత్తుల భోజనం చేస్తే నేను కొవ్వొత్తుల వంట చేసాను. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి, టమాటా కూరకి సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఫోన్ల మీద ఫోన్లు. మా కక్క (బాబాయి) తర్వాత రవి, తర్వాత ఫయాజ్, తర్వాత సురేష్ గారు ఫోన్లు చేసారు.

ఇంతలో మా తమ్ముడు వచ్చాడు. ఇక హింస వాడికి ) ఫోటో తియ్యమని ఒకటే గొడవ.

 eh_prasu2.jpgeh_prasu5.jpgearth-hour_prasu.jpg

అసలు కెమెరా చార్జర్ పోగొట్టుకున్నాను. లేకపోతే కత్తిలాగా వచ్చేవి ఫోటోలు ) జూన్ 15 నాడు చేసే బత్తీ బంద్ లో పథకం ప్రకారం అన్నీ చేస్తాను )

మా కక్క ఫోన్ చేసినప్పుడు విద్యుత్ ఆపేయండి కక్కా అని చెప్తే నేను బస్సులో ఉన్నానమ్మా అన్నారు. తర్వాత విషయం విని, పర్లేదులే మాకు 6 నుంచి 8 వరకు విద్యుత్ కోత ఉండింది. మేము చేసినట్టే లెక్క అన్నారు )

ఫయాజ్ ఏమో వల కార్యాలయంలో ఉన్నాడట మెయిల్స్ చూసుకోవడానికి. నేను చెప్పగానే వాళ్ళ కాలేజీలోని అమ్మాయిలకి, అబ్బాయిలకి ఫోన్ చేసి చెప్పాడట. వాళ్ళు ఆపేసారటా. ఒకమ్మాయి ప్రశ్నలు అడిగిందట. ఎందుకు ఆపేయాలి? ఆపేయడం వలన భూమి వేడెక్కకుండా ఎలా అడ్డుకున్నట్టు అని. తర్వాత చెప్తాను. ముందు ఆపేయండి అన్నాడట. వాళ్ళలో చాలా మంది ఎర్త్ అవర్, భూమి ఘడియని పాటించారట.

మా టిమేడ్ సభ్యులలో రవి, నేను, వాణి భూమి ఘడియని పాటించాము.

నేను బొప్పాయ కాయ (అవును అది పండు కాదు. కాయే ( ) కోసినప్పుడు మిగిలిన గింజలు, అలాగే టమాట కూర చేయడానికి అన్నిటినీ తరిగినప్పుడు మిగిలే చెత్త చూసి చెత్తని నిర్వహించే పధ్ధతి బాగుగా చేస్తే ఎలా ఉంటుందా అనిపించింది. మారాలి అని నిశ్చయించుకుంటే మార్చుకోవలసినవి ఎన్నో కదా !!

Advertisements