ప్రజా విలేఖరి కార్యక్రమం

డిసెంబరు 8, 2007 న రాత్రి 9:30 కి సి ఎన్ ఎన్ – ఐ బి ఎన్ వారి పౌర విలేఖరి (సిటిజెన్ జర్నలిస్టు) కార్యక్రమంలో రాకేష్ రైతుల ఆత్మహత్యలు, నష్టపరిహారాల మీద తీసిన డాక్యుమెంటరీ వస్తుందని చూసాను.

ఆ కార్యక్రమంలోనే సమీర్ మరియు అతని స్నేహితులు హైదరాబాద్ ట్రాఫిక్ గుంపు ద్వారా ప్రజలని ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారిగా మార్చడానికి చేసిన కృషి గురించి కూడా చూపించారు. చాలా సంతోషం వేసింది. ఇద్దరూ తెలియడం వలన మరియు హైదరాబాదు నుంచే రెండు కథనాలను ప్రసారం చేయడం వలన.

ఆ తరువాత ముంబై అన్ ప్లగ్ గురించి చూపించారు. ఆశ్చర్యం వేసింది. సాధారణంగా ఇలాంటి విషయాల పట్ల ప్రజలు స్పందించరు. అలాంటిది వీరు చొరవ తీసుకుని చేయడం చూసి నాకు మనం హైదరాబాదులో కూడా ఇలాంటిదే చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కలిగింది.

బి. ఓ. ఎస్. ఎఫ్. లోను, టి మేడ్ లోను చర్చించి ముందుకు తీసుకెళ్దాము అనుకున్నాము. ఆ చర్చలో భాగంగా గ్లోబల్ వార్మింగ్ గురించి తెలియవచ్చింది. అంతకు ముందు అమితాబ్ మరియు హాలీవుడ్ నటీనటులు దీని గురించి మాట్లాడినా అదేదో మనకి సంబంధించిన వ్యవహారంలా తోచలేదు. కానీ ముంబై అంప్లగ్ చూసిన వెంటనే మాత్రం స్ఫూర్తి కలిగింది.

Advertisements