Confessions of a programming hit-man!

ఆది బ్లాగరుడు కిరణ్ చావా సూర్యుణ్ణి అనుసరించ మంటున్నారు .. ఎంతైనా కిరణుడు కదా!

*** *** *** ***

ముందుగా బత్తీ బంద్ గురించి ఎక్కడ విన్నానో సరిగ్గా గుర్తు లేదు కానీ, విన్నప్పట్నుండి ఈ కాన్సెప్టు నన్ను ఆకర్షించలేదు. కానీ ఆ రోజు నుండి బత్తీ బంద్ గురించి వింటూనే ఉన్నాను. పన్లేని పని అనుకుంటూనే ఉన్నాను. ఆ తరువాత మన మీడియా వాళ్లు కూడా హడావుడి చేసినట్లున్నారు కానీ మన ప్రస్తుత జీవన గమనంలో టీవీకంత సమయం కేటాయించట్లేదు, దొరికిన కాస్త టయమూ రిమోట్ చేతికొస్తే ఏ టాం అండ్ జెర్రీనో, డిస్నీలో అదేదో హోటల్లో ట్విన్ పిల్లల ప్రోగ్రామో జూమ్ టీవీలో పాటలో స్టార్ లో డిష్యుం డిష్యుం సినిమానో, తేజాలో ** నాయుడు అనే దక్షిణ భాషా డబ్బింగ్ సినిమానో లేకపోతే పైవన్నీ ఒకేసారో చూస్తుండటంవల్ల మీడియా హడావుడి పెద్దగా తగల్లేదు.

కానీ తరువాత బత్తీబంద్ బ్లాగ్ మొదలయింది. అప్పటికీ లైట్ తీసుకున్నాను. కానీ ఓ రోజు కొపా గారు నన్ను కూడా ఈ బ్లాగ్ కి ఓ పోస్ట్ వ్రాయమన్నారు. బుక్కయిపొయ్యా అనుకొని నాకీ బత్తీ బంద్ అంటే పడదు అని ఇన్ డైరెక్టుగా చెపుదామని చూశాను కానీ అక్కడ సక్సస్ అయితే ఈ పోస్ట్ వ్రాయవలసిన అవసరమేముంది చెప్పండి!

ఫ్రెండ్ సర్కిల్లో ఓ చిరంజీవి ఫ్యానూ, ఓ నాగార్జున ఫ్యానూ, ఓ బాల కృష్ణ ఫ్యానూ ఉంటే మీరెవ్వరికీ ఫ్యానయినా ముగ్గురి సినిమాలూ చూడక తప్పదు! అలాగే ఏదో ఒకటి వ్రాద్దామంటే హృదయభాను(టీయం) ధర్మరాజు, చక్కర తినడం, పసివాడు అంటూ ఏదో గొడవ చెయ్యసాగింది. సర్లే నాకు బత్తీ బందు ఎందుకు నచ్చలేదో రాద్దామంటే ఆల్రడీ ఆపని మన రానారే చేశాఅడు. దానికి తోడూ మనకీ మధ్య రకరకాల పనుల్తో పనులెక్కువయ్యి మనసుపెట్టే టైం దొరకలేదు. కానీ కొంచెం ఖాలీ దొరికినా హృదయభాను(టీయం) గాడు కొపా, బత్తీ బంద్, ఐ యాం కౌంటింగ్ ఆన్ యూ అంటూ ముల్లుగర్రతో పొడవసాగాడు, దానితో

while (1)
{
ఆలోచించు;
ఆలోచించు;
if($timeout)
break;
}
అనే ప్రోగ్రాం మనసు రన్ చెయ్యడం మొదలుపెట్టింది. ఇలా ప్రోగ్రాం రన్ అవుతుంటే కొన్ని జ్ఞానోదయాలయ్యాయి!

బత్తీ బంద్ మరీ నేననుకునేంత చెత్త ప్రోగ్రాం కాదు. ఎక్కడ మొదలయిందో అక్కడ ఇదో మంచి సృజనాత్మక అవిడియా. దీనిలో ఫన్ ఉంది, సృజనాత్మకత ఉంది, జనాలు తేలిగ్గా ఫాలో అవ్వవచ్చు. ప్రకృతి, పర్యావరణాలపై అవగాహన మాస్ కి తేలిగ్గా ఇవ్వవచ్చు. సెన్సేషన్ ఉంది. మీడియా వాడికి హడావుడి చెయ్యడానికి కావల్సిన ఎలిమెంట్ ఉంది.

ఇన్ని ఉన్నాయి కానీ ఇది ఏ ఆస్ట్రేలియానో అమెరికానో అయితే సరిపోతుంది. ఓ గంట కరంటు పోతే క్యాండిల్లా అంటే ఏమిటి అని అడిగే దేశాఅల్లో బాగుంటుంది. కానీ లెఫ్ట్ అండ్ రైట్ విచక్షణారహితంగా కోతలున్న మన దేశంలో? కావాలని క్రియేట్ చేస్తే తప్ప వచ్చే సెన్సేషన్ లేదు.

ఇలా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చాక బ్యాచ్ లో ప్రోగ్రాం మారింది.

while(1)
{
మంచి ఐడియా కావాలి;
మంచి ఐడియా కావాలి;
if ($timeout)
break;
}

ఇలా ప్రోగ్రామ్ కొత్తది రన్ అవుతూనే ఉంది. కానీ రిజల్ట్ మాత్రం రావట్లేదు. ఓ నాలుగు సూపర్ బ్రెయిన్ లు రన్ చేస్తే కానీ రిజల్ట్ వచ్చేలా లేదు అనుకున్నాను.

అటువంటి రోజు విహారి ఓ పోస్టేశారు – బత్తీ బంద్ బ్లాగులో. బాగుంది, కనీసం ఆ పోస్టుకి గౌరవం ఇస్తూ అన్నా బల్బులు బంజేసి చేతులు దులుపుకుందాం అనుకున్నా.

ఆ తరువాత రోజు బస్సులో ఫుల్లు ఏసీలో ఆఫీసుకెల్తూ కునుకుతీసి బ్యాగు వాటేసుకోని ఓ కల కని లేస్తే స్ర్కీన్ పై సూర్యోదయం అయింది.

ఇదేమిటి? స్లీప్ మోడ్ నుండి బయటకొచ్చాక కూడా స్క్రీన్ సేవర్ పోలేదు!! అని చూస్తే అది స్క్రీన్ సేవర్ కాదు. ప్రోగ్రాం అవుట్ పుట్!!!!!

ఎంత బండ ప్రోగ్రాం అయినా ఒక్కోసారి బగ్గుల్లేకుండా కరక్టు అవుట్ పుట్ ఇస్తుంది కదా అనుకుంటూ స్క్రీన్ వైపు చూస్తే “ఫాలో ద సన్” అని కన్పించింది.

ఇదేమిటి? మ్యాట్రిక్స్ ఫాలో ద వైట్ రాబిట్ లా ఫాలో ద సన్!!! దీన్ని డీక్రిప్ట్ చెయ్యడానికి మరో ప్రోగ్రాం రాయాలా అని
while(1) అని మొదలుపెట్టగానే హృదయభాను గాడు ముల్లుగర్రతో ఓ పోటు పొడిచి

“ఎదవన్నర ఎదవ!
ఆ మాత్రం అర్థం కాలేదూ!!
ఫాలో ద సన్ అంటే పొద్దున్నే సూర్యుని కంటే ముందు అనగా 4AM కి లేచి ఆయనతో పోటీ పడి పనులు చేసుకొని ఆయన అటు పోగానే బబ్బోవాలి అని అర్థం, అంటే 8PM కి బబ్బోవాలి, మళ్లా తరువాత రోజు పొద్దున్నే 4AM కి షురూ మొదలు. ఇలా అయితే కరంటు చాలా పొదుపు, గ్లోబల్ వార్మింగ్ చాలా తగ్గిద్ది, ఆల్ హ్యాపీస్”

అని చెప్పంగనే అవునా? అయితే పరిశీలిస్తా అని మనవి చేసి తరువాత రోజు 9 కి లేచి టిఫెన్ మానేసి బస్ కోసం పరుగు తీసి మిస్సయ్యాను.

అన్నట్టు మీ టైం సైకిల్ ఏమిటి?

4 Responses

  1. ఈ బత్తిబంద్ ఏమిటో నాకర్దముకావట్లేదు. ఏ మొక్కలు నాటే కార్యక్రమమో , చెట్లు సమరక్షణ ఉద్యమమో అయితే బాగుంటుంది కదా? మా వూరిలో రోజుకి 6 గంటలు కరెంటు ఉండదు తెలుసా?

  2. కిరణ్ గారు: మీ ప్రోగ్రాం(అవిడియా) సుపర్. ఎంచక్కా! పొద్దున్నే సూర్యుడి వచ్చే టైం కి ఆయన ప్రసాదించిన సూర్యుడి కిరణాలతో పనులు చేసేసుకొని ఆ కిరణాలు మాయమయ్యెసరికి భలే చాన్సులే, ల లాం, ల లాం లక్కీ చాన్సులే బబ్బోడం. ఆది బ్లాగు కిరణం గారి సూర్య కిరణాల హోరు అదరహొ

  3. @ Shiva – Battibandh campaign is just a tool to bring awareness to people and to encourage them to take an individual action. to learn about the purpose, motivation and thought process behind batti bandh, please see these earlier posts on this blog.

    https://battibandh.wordpress.com/2008/05/12/
    https://battibandh.wordpress.com/2008/05/13/
    https://battibandh.wordpress.com/2008/05/14/

  4. Great…
    యంగ్ టైగర్ ఎన్టీఆర్ -ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ https://bit.ly/2MeuUop

Leave a comment