• Categories

  • Blog Stats

    • 9,939 hits
  • Advertisements

అరికట్టే ప్రావీణ్యం మన చేతల్లోనే

నా మదిలో … అంటూ ప్రవీణ్ గార్లపాటి చెప్పే కబుర్ల బ్లాగు, అతి క్లిష్టమైన కంప్యూటర్ సాంకేతిక విషయాల నుండీ తెలుగు సినిమా హీరోల డాన్సు స్టెప్పుల విశ్లేషణ వరకూ, వైవిధ్య వినోద విజ్ఞాన భరితమైన బ్లాగు. మన చేతిలో ఉన్నది మనమేం చెయ్యొచ్చో తన మదిలో ఆలోచనలు పంచుకుంటున్నారు.
*** *** ***

గ్లోబల్ వార్మింగు ఎందుకు జరుగుతుంది అంటే ఎన్నో కారణాలు, ఇప్పటికే మన బ్లాగర్లు ఎంత మందో ఎంతో విపులంగా ఈ విషయం మీద రాసారు.
దాని వల్ల వచ్చే నష్టాలు కూడా వివరించారు…

ఎన్ని ప్రాణులు దీని వల్ల అవస్థలు పడుతున్నాయో, ఎక్స్టింక్షన్ కి దగ్గరలో ఉన్నాయో ఓ సారి గూగుల్ ని అడిగితే చెబుతుంది.

కాబట్టి దీనిని అరికట్టడం మనుషులుగా మన కర్తవ్యం, అవసరం కూడా.

అలాగని పెద్ద పెద్ద స్లోగన్‌లు అరవనవసరం లేదు. అత్యంత క్లిష్టమయిన పనులు చెయ్యక్కర్లేదు.
మన పరంగా కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. అలాంటివి మచ్చుకి కొన్ని:

– ఠంచనుగా బైకుకి/కారుకి/వాహనానికి పొల్యూషన్ సర్టిఫెకెట్టు చేయించడం.

మన జనాలలో ఒక యాభై శాతం మంది దగ్గర ఇది ఉండదు… ఉన్నా ఏదో మొక్కుబడిగా చేయించడం తప్పితే దీని అవసరం తెలియదు.

ఈ సర్టిఫికెట్టు కేవలం ఒక ట్రాఫిక్ రూలు కోసమే కాదు. అసలు మీ వాహనం ఎంత పొల్యూషను సృష్టిస్తుందో తెలుసుకోవడానికి కూడా. ఒక స్థాయి దాటి ఉండకూడదు. ఎందుకంటే వాహనాలు విడుదల చేసే హానికరమయిన పొగల వల్ల వాతావరణానికి ఎంతో చెడు కలుగుతుంది.

మీ వాహనం అలాంటిదో కాదో తెలుసుకునే మార్గం ఇది. అలాగే పొల్యూషను స్థాయి తగ్గించడానికి అవసరమయిన పనులు చేపట్టేందుకు ఒక మూలం. (సర్వీసింగు చేయించడం మొదలయినవి)

– కంప్యూటరు, లాపుటాపులను అనవసరంగా వాడడం.

అవసరమున్నా లేకపోయినా మన కంప్యూటర్లను ఆన్ చేసే ఉంచుతాము మనం కొన్ని సార్లు. (నా లాంటి కొంత మంది చాలా సార్లు)

ఆఫీసులో ఉండే మీ డెస్కుటాపులను మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు షట్‌డవున్ చేస్తారా ? మనది కాదుగా కరెంటు పోయేది అనే ఆలోచన. కానీ దీని వల్ల ఎంత కరెంటు వృధా అవుతుందో కదూ… అలాగే మీరు లేనప్పుడు డెస్కుటాపు పని చేస్తున్నా మానిటర్ ఆన్ అయి ఉండాల్సిన అవసరం లేదు. దానిని అయినా కట్టెయ్యవచ్చు.

కొంత మంది పడుకునేటప్పుడు లాపుటాపు మీద చదువుతూ అలాగే నిద్రపోతారు దానిని ఆపకుండా. రాత్రంతా అలాగే నడుస్తుంటుంది అది అవసరం లేకపోయినా. కొంత శ్రమ తీసుకుని సరిగా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి.

పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కంప్యూటరు ముందే ఉండకుండా కాసేపు మన కుటుంబంతో కలిసి మాట్లాడడం చెయ్యవచ్చు.

– నీటిని వృధాగా పోనివ్వడం.

ఉదా: బ్రష్ చేసుకుంటూ టాపుని అలాగే వదిలేసే వారిని నేను చూసాను. కట్టేసి కావలసినప్పుడు వాడుకుంటే నీళ్ళ వాడకమూ తగ్గుతుంది. అలాగే వనరుల వృధా కూడా కాదు.

అలాగే ఇంట్లో ఉన్న టాపులు కొన్ని కారుతూనే ఉంటాయి. వాటిని సరి చేయించాలి.

– ఆఫీసు కాబులు, వాహనాలు వాడడం.

అటు మీకు వాహనం నడిపే శ్రమా తగ్గుతుంది. ఇటు ఇంధనం ఆదా చేసిన వారూ అవుతారు. ఇంటికి సమయానికి చేరతారు.

కుదిరితే కార్ పూలింగు, బైకు షేరింగూ కూడా చెయ్యవచ్చు.

ఆలోచిస్తే ఇలాంటివే ఎన్నో….

మనం చేసే చిన్న చిన్న పనులు ఎంతో ప్రభావం కలిగిస్తాయి. మనకూ, ఇతరులకూ, పర్యావరణానికీ మేలు చేస్తాయి. అంతే కాదు ఈ ఆచరించదగిన పనులు మీకు డబ్బు, శ్రమ వృధా కాకుండా కాపాడతాయి.

ఇక బత్తీ బందు లాంటి కార్యక్రమాలు చెయ్యడం కేవలం జనాలలో జాగృతి తేవడానికే అని గుర్తించాలి. చెయ్యకపోతే వచ్చే నష్టాలు ఏమీ లేవు. మనం చేయదలచుకున్న మంచి పనులను సింబాలిక్ గా చూపించడమే ఇందులోని ఉద్దేశం. అంతే కానీ బలవంతంగా లైట్లు కట్టుకు కూర్చోమని కాదు.

మనకి తెలిసిన విషయాలను నలుగురితోనూ పంచుకుంటే ఒక మంచి పనికి సహాయం చేసామనే తృప్తి కుడా మిగులుతుంది. కాబట్టి సాధ్యమయినంత మంది జనాలకు గ్లోబల్ వార్మింగు గురించి వివరించండి. ఎలా అరికట్టచ్చో తెలియజేయండి. అన్నిటి కన్నా ముఖ్యంగా మీరు ఆచరించి చూపండి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: