• Categories

 • Blog Stats

  • 9,939 hits
 • Advertisements

గ్లోబల్ వార్మింగ్ .. ఒక “వాడి” పరిశీలన

తెలుగు బ్లాగరుల్లో ఆరితేరిన శస్త్రవైద్యులు కొందరున్నారు. వాళ్ళ దృష్టి ఎక్స్రే. వాళ్ళ బుద్ధి పదునైన స్కాల్పెల్. వాళ్ళ మాటలు, రచనలు .. సమాజంలోని అనారోగ్యకర అంశాల్ని కత్తిరించే శస్త్ర చికిత్సలు. వారిలో తెలుగు “వాడి”ని ప్రముఖులు. జాగ్రత్త సుమా, ఈయన పేరే కాదు, మాటలూ వాడే.
*** *** *** ***

ముందుగా ఇక్కడ నేను నాలుగు ముఖ్య విషయాలు ప్రస్తావించదలిచాను :

1. కొత్తపాళీ గారు నన్ను ఈ విషయంపై నా మాటల్లో ఒక టపా రాసి పంపించమని చెప్పిన తరువాత నేను మన తెలుగు బ్లాగుల్లోని టపాలను కానీ మరియు వెబ్ సైట్స్ లో ఉన్న ఆర్టికల్స్ ను గానీ చదవలేదు ఏవో కొన్ని ప్రముఖ వెబ్ సైట్స్ మరియు అమెరికాలో ఉన్న కొన్ని పెద్ద కంపెనీస్ Green Energy కి సంబంధించి చేస్తున్న కార్యక్రమాలను గురించి తెలుసుకోవాలని తప్ప.

2. ఇక్కడ నేను వ్యక్తపరచినవి మీరు మీ టపాలలో చెప్పినవాటికి దగ్గరగానో లేక మక్కీకిమక్కీ కాపీలాగా ఉన్నాయని నన్ను నిందించినా/జోకులేసినా ఫర్వాలేదు కానీ మిమ్మల్ని మీ ఆలోచనలని నేనేదో criticize చేశానని మాత్రం బాధపడకండి … అన్యధా భావించకండి నా ఉద్దేశ్యం అది కాదు… అది కేవలం యాధృచ్చికం/కాకతాళీయం అంతే.

3. నేను మనసు పెట్టి చేసే పనులన్నీ, రాసే రాతలన్నీ సాధ్యమైనంతవరకు generic గా, long term ను దృష్టిలో పెట్టుకుని, వీలైనంతవరకు ఎక్కువ విశ్లేషనాత్మకంగా/వివరంగా చెప్పటానికి. చేయటానికి ప్రయత్నించటం అలవాటైపోయింది కనుక ఇక్కడ నేను చెప్పింది/రాసింది కొంచెం ఎక్కువగా అనిపిస్తే అలవాట్లో పొరపాటు అని వదిలెయ్యండి దయచేసి … అంతే గాని అసలు ఈ కార్యక్రమం మీద అసహ్యాన్ని పెంచుకోకండి.

4. అసలు ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి, ఎందుకు/ఎప్పుడు/ఎలా వచ్చింది, large scale లో ఎలా అరికట్టాలి, ఒకవేళ అరికట్టకపోతే కలిగే పర్యవసానాలు ఏమిటి అనే వాటి గురించి నేను ఇక్కడ చర్చించలేదు ఎందుకంటె వీటికి సంబంధించిన విషయాలు మీకు నెట్/గూగుల్ లో వెతికితే సులభంగా దొరకటం ఒక కారణం అయితే, కొత్తపాళి గారు నేనేమి అనుకుంటున్నానో, నేను చేసే సూచనలు ఏమిటో తెలపమనటం ఇంకొక కారణం

ఈ గ్లోబల్ వార్మింగ్ అనే కాదండి … పర్యావరణానికి లేదా/మరియు సామాజిక స్పృహకు లేదా/మరియు Mass Scale లో చెప్పవలసిన/ఆచరించవలసిన ఆవసరాన్ని గుర్తించిన/సంబంధించిన ఏ విషయాలకైనా ఆ దేశ స్థితిగతులు, ఆలోచనాసరళి, పధ్ధతులను బట్టి వాటియొక్క ఆవశ్యకతను తెలియజెప్పే విధానాలు మారాలి ముఖ్యంగా … అలా కాకుండా ఏదో పాశ్చాత్యదేశాలు వాళ్లు అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా మూర్ఖత్వంగా లేక వేరే దారిలేక ఫాలో అయిపోవటం కాదు.

ఎందుకంటే మన దగ్గర … వీడికేదో లాభం లేకపోతే వీడెందుకుచేస్తాడు ఇది .. దీనివలన నాకేంది అనేదే మొదటి ప్రశ్న … నీకు నచ్చితే నువ్వు చెయ్యి మమ్మల్ని ఎందుకు చంపుతావ్ .. వెళ్లెల్లవయ్యా ఈ మాత్రం మాకు తెలియదా ఏంది పెద్ద పోటుగాడిలా బయలుదేరావు .. ఎదురుగా ఉన్నోడు ఆకలితో చచ్చిపోతుంటే ఒక ముద్ద అన్నం పెట్టటం చేతగాదు గానీ అక్కడెక్కడో మంచుగడ్డలు విరిగిపోతున్నయ్, వడగాల్పులు ఎక్కువ వీస్తున్నయ్ ఇంకో 100/200 (కొన్ని వేల సంవత్సరాలకి) ఏదో అయిపోతుందని వెధవ నస, మనం ఒక్కళ్లం చేస్తే అవుద్దా … ప్రభుత్వం, డబ్బులుండాళ్లు చెయ్యాలి ఇలాంటివన్నీ … అసలు విషయానికన్నా మనం ఇలాంటివాటికి ఎక్కువ సమయం కేటాయించవలసి ఉంటుంది .. కొంతలో కొంత అయినా మన నిజాయితీని, చిత్తశుధ్ధిని నిరూపించుకోవలసి ఉంటుంది … ఎక్కడో ఒకచోట బయలుదేరిన ఇలాంటి ఉద్యమాలు జనబాహుళ్యంలోకి ఎంతబాగా చొచ్చుకుపోయినా కూడా ఇక్కడి ప్రభుత్వాలు, పెద్ద కంపెనీలు కనీసం ప్రోత్సాహించటానికైనా త్వరితగతిన దూకుదామని అనుకోవు.

అదే అక్కడ అయితే ఓపెన్ నెస్స్ ఎక్కువ ఉంటుంది … ఏ వివరాలు కావాలన్నా మీకు క్షణాలలో అందుతుంది .. ఈ రోజు కాకపోతే రేపు అయినా బయటపడితే పడే శిక్షలు/కష్టాలు కూడా కొంచెం భారీగానే ఉంటాయి కనుక అందరూ జాగ్రత్తగానే ఉంటారు .. విషయప్రాధాన్యం ఉన్న ఇలాంటి వాటికైతే ప్రభుత్వాలు, పెద్డ కంపెనీలు, ప్రముఖ వ్యక్తులు, సంస్థలు మొదలగునవి(వారు) వెనువెంటనే రంగంలోకి దూకి విస్కృతమైన ప్రచారం కల్పిస్తారు

ఇంకొక ముఖ్యమైన తేడా ఏమిటి అంటే … ఈ పాశ్చాత్య దేశాలలో చాలా వరకు, నిన్న మొన్నటి వరకు ఎక్కువ మంది self-centered (దీనికి చాలా వరకు ఆయా దేశాలలో కఠినంగా అమలు చేసే నియమాలు, ప్రభుత్వ పధకాలు, పెన్షన్ సౌకర్యాలు, ఆధునిక జీవనశైలి మొదలగునవి అయితే అయ్యుండొచ్చు గాక)అంటే నా అనే భావం తప్ప, మనము అనుకోవటం, సమాజం ఇలాంటివి వీరికి తెలియవు .. ఇప్పుడిప్పుడే వీళ్ల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తూ ఉంది కనుక .. అదీనూ ఇది ప్రాధమిక దశను దాటి టీనేజ్ దశకు ఇప్పుడే వచ్చింది కనుక ఆ ఉత్సాహంతో వీళ్లు ఇలాంటి వాటిపై సహజంగానే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

కానీ మనం అలా కాదే … మనం తి(పు)రోగమనం లో ఉన్నాం (మంచికో, చెడుకో అది కాలమే నిర్ణయిస్తుంది) … నిన్నటిదాకా మన ఊరు/పల్లె/గ్రామం/సమాజం/సంఘం నుంచి … మనము అనేదానిలో నుంచి నా అనే దానికి మాత్రమే పరిమితం అవుదామనే ఆలోచనలతో ఎదుగుతున్నప్పుడు .. ఈ బత్తీబంద్ లాంటివి మనకి పెద్దగా పట్టవు .. అందుకే మన కృషి, ప్రయత్నాలు వేరే విధంగా ఉండవలసిన అవసరం ఉంది …

ఇది ఒక్కటే నివారణ మార్గం అన్నట్టు ప్రచారం చేస్తుంటే, నేనైతే ఈ గంటసేపు బత్తీబంద్ లాంటి వాటికి వ్యతిరేకం ముఖ్యంగా మన ఇండియా లాంటి దేశాలలో .. అలాగని ఇది అసలు ఉపయోగం లేనిదని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు … అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాలలో కరెంట్ పోవటం/లేకపోవటం లేక గంటలగంటలు (4-6 లేక 10-15) కరెంట్ కట్ అంటే ఏమిటో వారికి తెలియదు కాబట్టి వాళ్లకి ఈ గంట కాదు .. మీరు నెలకొకసారి ఇలా గంట ఆపమన్నా వారికి పెద్ద సమస్య ఉండదు పైపెచ్చు వాళ్లు ఏ బార్బిక్యూనో ఏదో .. అదీ కాకపోతే ఒక బర్గర్, బీర్ పట్టుకుని కాలక్షేపం చేస్తారు … ఇంకొకటి ఏమిటి అంటే ఏమాత్రం కొంచెం చిన్న ఫలితం కనిపించినా వాళ్లు ఇలాంటి వాటిని బాగా ప్రోత్సహిస్తారు … అలాగే ఫలితాలను/ప్రయోజనాల వివరాలను అందరికీ చేరేలా రకరకాలైన మార్గాల ద్వారా ప్రయత్నిస్తారు …

ఈ బత్తీబంద్ లాంటి కార్యక్రమాలు ప్రైమ్ టైమ్ లోనే చెయ్యాలి అనే నియమం పెట్టుకోకుండా ఉండాలి .. ఒకవేళ మొదట కొన్ని సార్లు అలా చేసినా, వీలైతే ఇందులో పార్టిసిపేట్ చేయని వారి ద్వారా వారి అయిష్టానికి కారణం ‘సమయమే’ అయితే తరువాత జరిపేటప్పుడు మార్చండి సింపుల్ గా … అలాగే వీరిని ఎంకరేజ్ చేయండి ఈ గంట కాకపోతే ఇంకొక గంట ఆర్పండి అని చెప్పటం ద్వారా … ఈ సమయం గురించి నేను ఇంత ప్రత్యేకంగా చెప్పటానికి కారణం ఏమిటి అంటే, అమెరికా/ఇంగ్లండ్/ఆస్ట్రేలియా లాంటి దేశాలలో లు ఉంటాయి కనుక వారు ఆ కార్యక్రమాలను రికార్డ్ చేసుకుని మరుసటి రోజు లేదా ఆ గంట తరువాత చూసే అవకాశం ఉంటుంది మరియు ఆ టి.వి నెట్ వర్క్ వారు లేదా ఎవరో ఒకరు యూట్యూబ్ లాంటి వెబ్ సైట్స్ లో అవే ఎపిసోడ్స్ అప్ లోడ్ చేస్తారు కనుక వాళ్లు మిస్ అయ్యేది ఏమీ ఉండదు .. కానీ మనకు అలా కాదు కనుక ఈ సమయం గురించి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది .. ఎప్పుడూ పదిగంటలకు లైట్స్ తీసేసే వాళ్ల చేత తొమ్మిది గంటలకే లైట్స్ ఆపించగలిగితే అదే పదివేలు.

మనకి ఎలా ఉంటుంది అంటే … ప్రతి ఒక్కరూ పెద్ద ఫోజులు కొట్టుకుంటూ బత్తీబంద్ చేద్దాం, గాడిద గుడ్డు చేద్దాం అని బాగా ఎగురుతారు … సరే నచ్చిన వాళ్లు ఎవరన్నా నిజంగా ఆచరిస్తే తరువాత వాళ్లని ఎంకరేజ్ చేసే విధంగా ఏదైనా సమాచారం ఉదా : ఈ గంటసేపు ఇలా బత్తీబంద్ చేయటం వలన కలిగిన ప్రయోజనాలు ఇవి (” నేను సైతం …” టైపులో అనే భావన కలిగించటానికి ) … లేదా/మరియు ఉత్సాహం ఉన్న వ్యక్తులు అడిగే, ఎంత మంది పార్టిసిపేట్ చేశారు, మనం ఏమి సాధించాము లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలవారు ఒక్కరు కూడా ఉండరు .. అలాంటి వ్యవస్థ కూడా ఉండదు .. లేదా తయారు చేయటానికి వీళ్లు చేసిన/చేస్తున్న ప్రయత్నాల వివరాలు కూడా వీరివద్ద సిధ్ధంగా ఉండవు … ఇలాంటి కొత్తవాటికి అవటానికి కనీసం కొంత సమయం ఇవ్వవలసిన అవసరం ఉంది .. కాని మొన్నీమధ్యన గుంటూరులో మిర్చి యార్డ్ ధగ్ధం అయిపోతే నష్టం ఎంత అని తేల్చటానికి కొన్ని రోజులు పట్టింది .. ఇది ఆసియాలో అతి పెద్దది కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వ్యాపారం, ఎన్ని క్వింటాళ్ల వ్యాపారం జరుగుతుంది, ఏ రోజు ఎంత, ఏ రకం ఎంత అనే లెక్కలు కూడా అందుబాటులో ఉండవు .. అదీ మన పరిస్థితి.

అదే అక్కడ అయితే కోరుకున్న వెంటనే చాలా విపులమైన వివరాలు/లెక్కలు .. ఎన్ని కుటుంబాలు, కర్మాగారాలు, కార్యాలయాలు మొదలగునవి పార్టిసిపేట్ చేశాయి/రు, ఎంత ఎనర్జీ సేవ్ చేశారు మరియు ఎంత తక్కువ CO2 విడుదల అయ్యింది … అందరికీ అందుబాటులోకి తెస్తారు … అన్ని పత్రికలు, మీడియా ఈ కార్యక్రమాలనే కాదు … వాటి ఫలితాలను కూడా జనాలకు చేరవేయటానికి తమ వంతు బాధ్యతగా కృషి చేస్తాయి.

On March 31 2007, for one hour, Sydney made a powerful statement about the greatest contributor to global warming – coal-fired electricity – by turning off its lights. Over 2.2 million Sydney residents and over 2,100 businesses switched off, leading to a 10.2% energy reduction across the city.

Driving change in Stockholm : http://www.ibm.com/podcasts/howitworks/040207/images/HIW_04022007.pdf

The Results : The road charging system has made a real impact in congestion and overall quality of life for the citizens of Stockholm. By the end of the trial, traffic was down nearly 25 percent. Public transport schedules had to be redesigned
because of the increase in speed from reduced congestion. And even inner-city retailers saw a six percent boost in business.

But the benefits go beyond fewer cars:

l During the spring of 2006, 40,000 more travelers used Stockholm Transport on an ordinary weekday than the year before—an increase of six percent.
l The reduction in traffic during the Stockholm Trial has led to a drop in emissions from road traffic by eight to 14 percent in the inner-city.
l Greenhouse gasses such as carbon dioxide have fallen by 40 percent in the inner-city and by two to three percent in Stockholm County.

The new Swedish government will reintroduce congestion charging in July 2007. And in the US, the federal government has allocated $130 million to implement similar congestion pricing systems.

ఇలాంటి వాటికి సందేహ నివృత్తి చేయకపోవటం అంటే కడివెడు పాలల్లాంటి, మీలాంటి వారందరి కృషికి మీరు స్వయంగా అవతలివారికి ఒక చుక్క విషం చేతుల్లో పెట్టిన చందంగా ఉంటుంది. అందుకే సంయమనం కోల్పోకండి. నిగ్రహంతో వ్యవహరించండి. ఓర్పు ఎంత ముఖ్యమో మీరు కలిసే జనాలు పెరిగేకొద్దీ మీకే బాగా అర్ధమవుతుంది. ప్రభుత్వాలు, స్వఛ్ఛంద సంస్థలు మొదలగునవి కొన్ని వందల వేల కోట్లు ఖర్చుపెట్టినా ఎయిడ్స్ లాంటి విషయాలపై జనసామాన్యంలో ఎంత అవగాహనను కల్పించగలిగాయో మనకందరికి తెలిసిన విషయమే కదా ….

సరే ఇంతకూ నేను ఎందుకు దీనిని సపోర్ట్ చేస్తున్నాను/చేస్తాను అంటే …

ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి … ఇది ఎంత మంచిది, ఉన్నవాటిలో అత్యుత్తమమైనదా కాదా అని విశ్లేషించుకునే బదులు కొద్దిలో కొద్దిగానైనా దీని వలన ఉపయోగం ఉంది అని తెలిసినప్పుడు ముందు ఆచరించటం/ప్రోత్సహించటం ముఖ్యం … ఎందుకంటే సమిష్టి కృషితో దీనినే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దవచ్చు కనుక … ప్రతి పనికీ అన్నిసార్లు అన్నీ అందుబాటులో ఉంచుకొని, అన్నీ ఆలోచించి పని ప్రారంభించాలి అంటే కుదరకపోవచ్చు లేదా అది మంచి పధ్ధతి కాకపోవచ్చు లేదా సమయాభావం అయిపోవచ్చు ..

ఒకచోట గుడి/మసీదు/చర్చ్ కట్టాలి అనుకుంటే, గోతులు తవ్వాలి, పునాదులు లేపాలి, ఇటుకమీద ఇటుక పేర్చాలి … గోడలు కట్టాలి, స్లాబ్ వెయ్యాలి, రంగులు వెయ్యాలి … దేముడి పటాలు/విగ్రహాలు పెట్టాలి.. పూజలు చెయ్యాలి, ప్రార్ధనలు చెయ్యాలి అంటే ఏళ్లు పూళ్లు పట్టొచ్చు .. అందుకే కొన్ని సార్లు Out of the box ఆలోచించాలి .. అంటే సింపుల్ గా ఒక మంచి ప్రదేశం చూసుకొని తెల్లారే సరికల్లా ఒక దేముడి పటం, కొన్ని నిమ్మకాయలు, పసుపు/కుంకుం, శిలువ ఏవైతే అవి పెట్టేసి ఒక నాలుగు ముక్కలు జనాల దగ్గర ఊదాము అంటే … రెండు మూడు సంవత్సరాలలో కావలసింది, నాలుగైదు నెలల్లోనే అయిపోతుంది ..

ముందుగా మన ఇండియా వరకు Web 20 సైట్ ఒకటి తయారు చేయాలి .. అన్ని వివరాలు (కారణాలు, నివారణ మార్గాలు) పొందు పరచాలి … దీనిలో ఒక్క బత్తీబంద్ మాత్రమే కాకుండా ఇలాంటివి ఎన్ని కార్యక్రమాలు అయితే గ్లోబల్ వార్మింగ్ నివారణకు తోడ్పడతాయో అన్నీ చెప్పాలి.. ఉతాహం ఉన్నవాళ్లు వాళ్లకు నచ్చిన కార్యక్రమానికి pledge తీసుకునే సౌకర్యం కల్పించాలి .. ఇలాంటి కార్యక్రమాలకు ముందు, తరువాత సాధ్యమైనంత ఎక్కువ వివరాలతో ఈ సైట్ ను అప్-డేట్ చేస్తూ ఉండాలి … డొనేషన్స్ ఇచ్చే, gift షాప్ లో వీటికి సంబంధించిన వస్తువులు కొనుక్కునే సౌకర్యం ఉండాలి … ప్రతి కాలనీ, పల్లె, నగరం, రాష్ట్రం, కాలేజి, ఆఫీస్, కర్మాగారం … ఇలా వీలైనంత వైవిధ్యమైన గ్రూప్స్ తయారు చేసుకుని, సభ్యులను చేర్చుకుని, వాళ్లకు నచ్చిన నివారణమార్గాలకు ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం కల్పించాలి – ముఖ్యంగా ఏ కుటుంబాలు, కాలనీలు, పల్లెలు, నగరాలు, రాష్ట్రాలు మొదలగునవి(వారు) అయితే దీనికి ఎనలేని కృషి చేశారో, ప్రోత్సాహించారో ఇచ్చారో వారి(టి) గురించి ఎక్కువగా ప్రచారం చేయాలి – సాధించిన ప్రగతి, రాబోయే రోజుల్లో జరపబోయే కార్యక్రమాల గురించి SMS/Email subscription వివరాలను పొందటానికి అవకాశం కల్పించాలి – ఉన్న అన్ని నివారణ మార్గాలలో మంచివి ఎన్నుకోవటానికి Digg లాంటి suggestion/recommendation engine ఒకటి ఈ సైట్ లో పొందు పరచాలి.

Location / People based activities :

అందరికీ అన్నిచోట్ల ఒకే కార్యక్రమం అని చెప్పే/బలవంత పెట్టే బదులు మనం ఆయా ప్రాంత, జనాలను బట్టి, వాళ్ల అలవాట్లను బట్టి, చూ(చే)సే కార్యక్రమాలను బట్టి వారికి సరిపోయే లేదా తేలికగా ఆచరించగలిగిన వాటిని మొదటలో చెపితే నిదానంగా కొంచెం కష్టమైనవి ఉన్నా కూడా ఆచరించే అవకాశం ఎక్కువ ఉంది .. ఇలా ఏదో ఒక రోజు ఒక కార్యక్రమం అనే బదులు … ఒక వారం రోజుల పాటు లేదా ఒకే రోజు వివిధ కార్యక్రమాలు అనే విధంగా ఉండాలి … ఇదొక్కటే చెయ్యాలి అంటే ఇదొక్కటి నావల్ల కాదు అంటారు మనవాళ్లు … అలాగని కాకుండా ఎక్కువ ఛాయిస్ ఉంటే వాళ్లకి ఏది నచ్చితే లేక ఏది చెయ్యగలిగితే అదే చేస్తారు … వాళ్లకు కూడా స్వేచ్ఛ ఇచ్చినట్టు ఉంటుంది/అనిపిస్తుంది … అలాగే వాళ్లకి ఒకటికి మించి ఎక్కువ మార్గాలు చెప్పాము కాబట్టి ‘నో’ అని చెప్పకుండా ఏదో ఒకటి సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంది .. ఇదేమీ తగలబడుతున్న ఇల్లు లేదా గడ్డివాము కాదు కదా … అందరూ ఒకేసారి తలా ఒక చెంబు నీళ్లు పోసి వెంటనే ఆర్పకపోతే చుట్టుపక్కల ఇళ్లన్నీ తగలబడతాయి అనుకోవటానికి … అలాంటప్పుడు ఈ మూకుమ్మడి కార్యక్రమాలకే ఎందుకు ప్రాధాన్యం ఇవ్వటం? ఒక్కసారి ఆలోచించండి … ఎవరంతట వారు .. ఎవరిళ్లల్లో వాళ్లు చేసుకునే కన్నా కలసి కట్టుగా చేస్తే మరికొంతమందికి మనం ప్రభావితం చేసినవాళ్లమవుతాము … అదీ పెద్ద ప్రయోజనం ఇక్కడ … దీని కోసం మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి .. సందేహమే లేదు ..

అలాగే మన తెలుగు (మిగతా భాషల్లో కూడా ఇలానే ఉందిలేండి పరిస్థితి) టీ.వీ లలో వచ్చే ‘రోడ్’ మీద, ‘కాలనీ’ లలో, ‘కాలేజ్’ కాంపస్ లలో మొదలగు ప్రదేశాలలో జరిపే ‘రకరకాల’ కార్యక్రమాలను ఈ బత్తీ బంద్ పాటించే పల్లెల్లో, కాలనీలలో, కాలేజీల్లో ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది కదా .. అన్ని కుటుంబాలల్లో విద్యుత్ ఆదా .. అలాగే ఇదే టీ.వీ కార్యక్రమాలలో ఫోన్ కాల్స్ మీద ఆదారపడిన వాటిని ఆ కాలనీలో ఏదో ఒక ప్రదేశం/ఇంటిలో నుంచి మాత్రమే చేసుకునే అవకాశం ఉండేటట్టుగా చేసి, ఆ ఇంటినుంచే లైవ్ కవరేజ్ చేస్తే కూడా ఉపయోగంగానే ఉంటుంది…ఇలా చేస్తాము అంటే వద్దనే వారు ఎవరన్నా ఉంటారా … సెట్టింగ్ ఖర్చు కూడా ఉండదు 🙂

ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మొత్తానికి ప్రత్యేక లేక అధిక మొత్తంలో పోలీస్ కాపలా అంటే వాళ్లు కూడా ఏమీ చెయ్యలేక పోవచ్చు .. అలాగని వాళ్లని తప్పు పట్టటానికి కూడా ఏమీ ఉండదు … అందుకే నగరాలలో (ఏదైనా ఒకటి లేక రెండు కాలనీలలో) ఇలాంటి కార్యక్రమాలు జరిపేటప్పుడు దొంగల బెడద లాంటిది లేకుండా ఏ కాలనీకి సంబంధించి ఆ కాలనీ వరకు ఔత్సాహవంతులైన యువకలను వినియోగించుకొని కొంతవరకు ప్రయోజనం పొందవచ్చు .. వారికి కూడా ఇలాంటివి కొత్తే కాబట్టి కొంచెం థ్రిల్లింగ్ గా కూడా ఉండే అవకాశం ఉంది .. తరువాతి రోజులలో వీరి గురించి నలుగురికీ తెలిసేలా (వీరికి ఇష్టమైతేనే సుమా) చేస్తే మరికొంత మంది ఇలాంటి కార్యక్రమాలలో పాలుపంచుకునే అవకాశం ఉంది. చెడు విషయాలకు సంబంధించి (ఉదా : ఈ దొంగతనాలు, అల్లర్లు మొదలగునవి) ఒక్కటి జరిగినా కుడా తరువాత మనం కాదు అని గ్యారెంటీ ఏమిటి అని ఆలోచించగలిగిన జనం, మంచి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ఒక్కరు/మొదటివారు వారే ఎందుకు కాకూడదు అని ఆలోచించరు … అది మానవుల ప్రస్తుత నైజం … దీని గురించి ఎక్కువ ఆలోచించి మన అసలు సమస్యనుంచి దృష్టి మరల్చుకునే బదులు వారిని ఆందోళనకు గురిచేయని లేదా సరైన సమాధానాలతోనే ముందుకు వెళదాం.

విషయం ఒకటే అయినప్పుడు అందుకు కృషి చేసే వాళ్లు/సంస్థలు కొన్ని వందల్లో ఉండటం తప్పులేదు అలాగే ఎవరికి తోచిన రీతిలో వాళ్లు ప్రయత్నించటంలో తప్పులేదు .. కాకపోతే ఇది ఒక రోజో, నెలో, 10 సంవత్సరాలలో పరిష్కారం అయ్యేలా అనిపించటం లేదు కనుక, వీళ్లందరిని, ఈ సంస్థలన్నింటినీ ఒకే త్రాటిపైకి తీసుకురావలసిన అవసరం ఉంది .. అలాగే ఇది ఈ ఉద్యమం మొదటిలో జరిగితే అంతకు మించి ప్రయోజనం ఉండబోదు.

ఈ కార్యక్రమాలలో తమ వంతు సాయం చేసే అందరికీ (ముఖ్యంగా కొంచెం ఎక్కువగా కృషి చేసేవారికి) ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక చోట వారి పేర్లు కూడా నలుగురికీ తెలిసేలా చేయండి .. ఎప్పుడు చూసినా/చదివినా ఆ పైన ఉన్న పది, పదిహేను మంది పేర్లు/ఫొటోలు మాత్రమే వచ్చేలా చేయకండి .. అవకాశం వచ్చినప్పుడల్లా కొంత మంది కొత్తవారిని పరిచయం చేసుకుంటూ, వారి గురించి నాలుగు మంచి ముక్కలు చెపుతూ ముందుకు సాగిపోండి. అలాగని అందరికీ అవకాశం ఇవ్వాలంటే కష్టమే అనుకోండి
ఒక్కరిగా, కుటుంబంగా :

ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య గురించి ఆలోచిస్తే ముందుగా మనకి తోచేది … విద్యుత్ గృహోపకరణాలు వాడకం తగ్గించాలి, రాత్రి పడుకోబోయే సమయంలో ఆఫ్ చేసి పడుకోవాలి, కారు పక్కన పెట్టి బైక్ తీయాలి, దగ్గరలో ఉన్నవాటికి నడిచి వెళ్లాలి, నీళ్ల వాడకం తగ్గించాలి, ఇలా చాలా పెద్ద లిస్టే అవుతుంది … వీటి వలన ఖచ్చితంగా ఉపయోగం ఉంది .. సందేహమే లేదు … కాకపోతే ఇలా చేసిన వా(టి)రికి నేను ఇచ్చేది 3/10 అంతే … అలా కాకుండా వీటిలో ఏ ఒక్కదానికైనా మీరు ఇంకొకరిని ప్రభావితం చేసి వారిని కూడా ఆచరించేలా చేయగలిగిన వారికి 10/10. మీ స్నేహితులిద్దరూ చెరొక బైక్ మీద ఆఫీస్ కు రావటం కాదండీ ఇక్కడ కావలిసింది (ప్రయోజనం లేదని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు సుమా) ఇద్దరూ కలిసి ఒకే బైక్ మీద రావటం … అదీ ఈ ఉద్యమానికి నిజమైన విజయమంటే.

ఇంట్లో నుంచి మీరు రెండు చెంబుల నీళ్లతో స్నానం చేసి బయటకు వస్తే ఇంటి బయట మీ శ్రీవారు ఇరవై బకెట్లతో తన కార్ వాష్ చేస్తూ కనబడటం … మీరు పడుకోబోయే ముందు ఓపికగా షట్ డౌన్ చేసి మీ ల్యాప్ టాప్ ను తెల్లారి ఆన్ చేస్తూ ఉంటే, మీ శ్రీమతి రాత్రి తన డెస్క్ టాప్ లో పెట్టిన ‘అత్తాకోడళ్ల కుస్తీ’ అనే తెలుగు ధారావాహిక 189 భాగాలు విజయవంతంగా డౌన్ లోడ్ అయ్యింది అని గెంతులేసుకుంటూ చెప్పటం … ఇవి నివారించగలిగితే ఈ కార్యక్రమానికి ఒక కుటుంబంగా మీ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసినట్టే

మన రెండు చేతులతో మనం చప్పట్లు కొట్టి శబ్ధం సృష్టించటం బాగానే ఉంది, మంచిది కూడా .. కాకపోతే ఇక్కడ మనం చేయవలసింది మన రెండు చేతుల్లోకి మరో రెండు చేతులు కలుపుకోగలిగేలా ప్రయత్నించాలి .. ఆ రెండు కొత్త చేతుల్లోకి మరో రెండు ఇలా ఇది నిరంతరంగా, నిర్విఘ్నంగా సాగిపోయేలా మన ప్రతి అడుగూ/చేత ఉండేలా చూసుకోవాలి …

ఒకవేళ మీ శ్రీమతి/శ్రీవారు ఎంతో ఓ(నే)ర్పుతో ఈ గ్లోబల్ వార్మింగ్ నివారణకు తన వంతు కృషిలో భాగంగా చేసిన మా(చే)ర్పుల వలన మీ మేజర్ బిల్స్ లో తేడా కనిపిస్తే .. ఆ తేడాలో సొగం (అది $10 కావచ్చు అయినా కూడా) తనకు ఇవ్వండి. ఇంకా మీరు దయార్ద్రహృదయులు అయ్యుంటే అదే $10 ఇదే విషయంపై పనిచేస్తున్న స్వచ్చంద సంస్థకు విరాళంగా ఇవ్వండి .. ప్రతి నెలా కాకపోయిన కనీసం సంవత్సరంలో ఒక్కసారి అయినా .. It will make a lot of difference as a whole in a family and also to the society.

ముందు ఏదైనా మనం ఆచరిస్తే, మన ఇంటి నుంచి ప్రారంభిస్తే పక్క వాడికి చెప్పే అర్హతతో పాటు అందులోని సాధ్యాసాధ్యాలు, కష్టనష్టాలు, లాభాలు సులభంగా వివరించగలుగుతాం. కానీ అవతలివారికి వీటి గురించి తెలిసేదెలా మరియు మనం చెపుతున్న/ఆచరిస్తున్న నివారణా మార్గాలు నిజంగా ఫలితాలను అందిస్తున్నాయని అవతలి వారికి నమ్మకం కలిగించేదెలా … ఇండియా లాంటి దేశాలలో అవతలి వారిపై ఈ ‘నమ్మకం’ అనేదే చాలా వాటిల్లో ప్రాధాన్యత సంతరించుకుంటుంది కనుక దీనిని మనం అంత తేలికగా తీసుకోలేము(కూడదు కూడా) .. అందుకే కొంత మందివైనా లేక వాళ్ల అపార్ట్-మెంట్ మొత్తం యొక్క గ్యాస్/ఎలెక్ట్రిక్/పెట్రోల్ బిల్స్ కొన్ని నెలలవి చూపించేలా ప్రయత్నించాలి .. అలాగే కంపెనీలు, ఆఫీసులు, కర్మాగారాలు మొదలగునవి కూడా ఇలా చేసేలా ప్రోత్సహించాలి .. ఎప్పుడో ఒకప్పుడు ప్రభుత్వాలు కూడా ఇందులోకి దూకి తమ వంతు పాత్రగా పూర్తి వివరాలతో కూడిన ఈ statistics ను సామాన్య జనాలందరికీ అందుబాటులోకి తీసుకువస్తే అప్పుడు వారిలో పెరిగిన నమ్మకం ఈ కార్యక్రమాలను సాధ్యమైనంత వేగంగా విజయవంతమయ్యేలా చేస్తాయి..అలాగని అందరూ చెయ్యాలని అనుకోవటం అవివేకమే అవుతుంది … కొంత మంది, కొన్ని గ్రూపులు, కొన్ని సంస్థలు చేసినా చాలు

ఒక ఉద్యోగిగా, వినియోగదారుడిగా :

ఒక ఉద్యోగిగా, వినియోగదారుడిగా :

మీరు పని చేసే కంపెని, ఆఫీసు, ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడి ఒప్పించి వాళ్లని దీనిలో భాగం చేయండి … అందులో పని చేసే ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఎనర్జీ బిల్ లో తగ్గుదల చూపిస్తామని … సగం కంపెని వాళ్ళు ఉంచుకునేటట్టుగా మిగతా సగం ఏదైనా స్వఛ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చేలా చేయండి .. కంపెని ఇలాంటి విషయాలని కొంచెం సీరియస్ గా తీసుకునేది అయితే వాళ్లకు మిగిలిన వాటా కూడా విరాళంగా ఇచ్చే అవకాశం ఉంటుంది … ఇలాంటి వాటివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది …

ఏ కంపెనీస్, షాప్స్, మాల్స్ మొదలగునవి అయితే ఈ గ్లోబల్ వార్మింగ్ నివారణకు తమ వంతు కృషి చేస్తున్నాయో అందరమూ వాటి యొక్క ప్రోడక్ట్స్ కొనటానికి ఒక ఓత్ లాగా తీసుకోవాలి .. అలా తీసుకుంటున్నామని నలుగురికీ ముఖ్యంగా ఆ కంపెనీస్/ప్స్/మాల్స్ కు తెలిసేలా చేయాలి తద్వారా మిగతా వారు లేదా వీరే ఇంకా ఎక్కువ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేలా చేసినవారమవుతామేమో ..

ఉదా : ఏ వాషింగ్ మెషీన్ అయితే తక్కువ నీళ్లతో మంచిగా(compare to others) ఉతుకుందో అలాంటి వాటి గురించి పైన చెప్పిన సైట్ లో ప్రచారం చెయ్యాలి. అలాగే ఏదైనా సూపర్ మార్కెట్ లేదా వేరే షాప్ వాళ్లు ప్లాస్టిక్ బాగ్స్ కాకుండా పర్యావరణానికి హాని చేయని సంచులను ఇస్తుంటే అక్కడే మన నిత్యావసర వస్తువులను కొనాలి … వీళ్ల గురించి నలుగురికీ చెప్పాలి … అలాగే డ్వాక్రా మహిళా సంఘాలలో నుంచి వచ్చే ఉత్పత్తులలో కొన్ని అయినా ఇలాంటివి ఉండే అవకాశం ఉంది కదా వాళ్లకు/వాటికి కూడా ప్రచారం కల్పించాలి. అలాగే ఏదైనా కంపెనీ తక్కువ విద్యుత్ వాడే బల్బులను తయారు చేస్తూ ఈ పర్యావరణా రక్షణకు కృషి చేస్తుందో మనం వాటినే కొనటం .. మిగతా వాళ్లను కూడా ఇవే కొనేలా ప్రోత్సహించటం.

తెలుగు బ్లాగర్స్ గా :

ప్రతి మూడు/ఆరు/పన్నెండు నెలల కొకసారి ఒక రెండురోజుల(వీకెండ్) పాటు మన తెలుగు బ్లాగ్ ఎగ్రిగేటర్స్ అయిన కూడలి, తేనెగూడు, జల్లెడ మొదలగు వాటిని షట్-డౌన్ చేయండి … అదే సమయంలో మన సొంత బ్లాగులను కూడా అదే రోజులలో ఎవరికీ అందుబాటులో లేకుండా చేద్దాం ie making them private….అలాగే తెలుగు బ్లాగర్స్ అందరూ కలసికట్టుగా సంవత్సరంలో కొన్ని రోజులో లేక ఒక వారమో ఎలాంటి టపాలు ప్రచురించకుండా నిర్ణయం తీసుకోండి లేదా గత కొన్ని నెలలుగా మీ బ్లాగుల్లో రాసిన సగటు టపాల సంఖ్యను తెలుసుకుని, రాబోయే నెలలో దానిలో సగం మాత్రమే అంటే మీకు అత్యంత ఇష్టమైన విషయాలపై మాత్రమే రాయండి.

అన్నిటికన్నా ముఖ్యమైనది:

అలాగే ఈ కార్యక్రమాల అమలు మరియు వాటి ఫలితాలు అనేవి ఉపవాసం మరుసటి రోజు తిండిలా అంటే .. ముందు రోజుది ఈ రోజుది కలిపి మొత్తం ఒక రోజే తినెయ్యటం లాగా ఉండకూడదు … అలా కాకుండా ఉన్నాయి అని చెప్పటానికి ఆధారాలు, అలా కాకుండా చేసేటందుకు ఉన్న మార్గాలు మనం సామాన్య జనానికి అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిధ్ధం చేసుకోవాలి లేదా కనీసం సిధ్ధం చేసుకోవటానికి సమాయత్తం అవుతున్నామన్న భావన/నమ్మకం ఏ జనాలు అయితే మనల్ని నమ్మి మనం చెప్పిన వాటిని ఆచరణలో పెట్టారో వాళ్లల్లో కలగజేయాలి …

ప్రచారం :

ఇలాంటి విషయాలపై జనాలలో అవగాహనను కలిగించాలి అంటే సీరియస్ గానో లేక అంతా టెక్నికల్ గానో చెప్పటానికి అసలు ప్రయత్నం చేయకూడదు … దీని గురించి మాట్లాడేవాళ్లు, ప్రచారం కల్పించేవాళ్లు వీటిని అర్ధం చేసుకుంటే చాలు అంతే గానీ వీరు చెప్పేది వినటానికి దొరికిన వాళ్లను కూడా వీరి స్థాయిలో ఎడ్యుకేట్ చేయటానికి ప్రయత్నించటం మంచిది కాదు …

ఎయిడ్స్ గురించి మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ‘పులిరాజా’ ప్రకటన ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో గుర్తుండే ఉంటుంది కదా …

వివిధ రకాల నివారణ మార్గాలపై .. సాధ్యమైనన్ని వైవిధ్యమైన కార్టూన్స్, కవితలు, వీడియో-ఆడియోలు, ప్రకటనలు, కొటేషన్స్, పాటలు, పజిల్స్, గేమ్స్(http://www.powerupthegame.org/), క్విజ్ ప్రోగ్రామ్స్ మొదలగునవి తయారు చేసి వీటికి విస్కృతమైన ప్రచారం కల్పించాలి … ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఒకే దానిలో అంతా చెప్పకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం.

అసలు ఈ గ్లోబల్ వార్మింగ్ అనే ప్రక్రియకు కారణాలు మరియు నివారణా మార్గాలన్నింటినీ సంపూర్తిగా సేకరించి వాటిని అందరికీ అర్ధమయ్యే రీతిలో సాధ్యమైనంత చిన్న వాక్యాలలోకి కుదించి ఒక చిన్న డేటాబేస్ లా తయారు చేయాలి .. అప్పుడు వాటిని ‘రోజు/వారానికో తెలుగు పదం’ లా లేక ‘A quotation a day’ లా వీలైనన్ని సైట్స్, ఫోరమ్స్ మరియు బ్లాగుల్లో విడ్జెట్/ఇమేజ్ రూపంలో చూపించే అవకాశం కల్పించాలి.

అలాగే గూగుల్ వారు కనిపెట్టిన దీని చూడండి/ఆచరించేలా ప్రోత్సహించండి.

[ మా భాష నాశనం అయిపోతుంది .. అర్ధం కానంతగా మార్పులకు లోనవుతుంది అని బాధ పడేవాళ్లు ఉంటారు .. ఎవరి ప్రాధామ్యాలను బట్టి వారు ఎవరికి తోచిన సైడ్ వాళ్లు తీసుకోవటంలో తప్పేమీ లేదు ]
every character (byte) we send in a message results in about 0.0000000000000000034 metric tons* of CO2 being released into the atmosphere!

For example, if we want to say:
As far as I’m concerned, you can give me the twenty dollars you owe me when I see you later.

You could save more than 50% in wasted characters by saying:
AFAIC, U can gve me the 20 $$ YOM whn I CUL8R.

చివరిగా :

Take a look at how fast the companies in USA try to adopt and/or jump in to this kind of programs : For ex: IBM and Google.

IBM : http://www.ibm.com/ibm/green/
Google : http://www.google.com/corporate/green/energy/

If you have info on Indian companies and the campiagns under taken by them, please share it with the rest of us here.

వీళ్లెవరో గానీ ఏదో చేస్తున్నారు మొత్తానికి ఇదే విషయంపై .. కాకపోతే దీని గురించి మనకి అసలు ఏమీ అర్ధం కాలేదు గానీ ఏదో బాగానే చేస్తున్నారు అనిపించింది :

http://www.cdproject.net/index.asp

దీంట్లో మన ఇండియా పార్టిసిపేషన్ కూడా ఉంది చూడండి :

http://www.cdproject.net/partnerindia.asp

Advertisements

16 Responses

 1. బాపురే! ఎంత విశదీకరణ. తెలుగు ‘వాడి ‘ ని గారు మీకు మీరే సాటి. ఎంతో వాడిగా, సూటీగా, నిక్కచ్ఛిగా( కొంచం నిర్దయగా కూడా, డాక్టర్ కదా)చెప్పారు. నాకెందుకొ మీరొక్కరు చాలు, ప్రచారానికి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకూ రాసిన అన్ని గొంతులు ఏకమై “పదండి ముందుకు” అని చెప్పినట్లుగా వుంది సాంతం చదివాక.

 2. చాలా బాగా చెప్పారండి. ఏ పని గురించి ఇతరులకు చెప్పేముందు అది మన ఇంటి నుండి మొదలెట్టడమే ముఖ్యం. ఇంట గెలిచి రచ్చ గెలవమని పెద్దలు ఎప్పుడో చెప్పారుగా…
  ధన్యవాదాలు ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు…

 3. తెలుగు బ్లాగర్స్ చెయగలిగింది కూడా చెయ్యాలి…జూన్ 15 న ఆ అరవై నిముషాలు సిస్టంస్‌ని “ఆర్పేస్తే” అదే పదివేలు.

  తెలుగు బ్లాగర్స్ చెయగలిగింది కూడా చెయ్యాలి..జూన్ 15 న ఆ అరవై నిముషాలు సిస్టంస్‌ని “ఆర్పేస్తే” అదే పదివేలు.

  ఇక వీరన్నట్టు (“”every character (byte) we send in a message results in about 0.0000000000000000034 metric tons* of CO2 being released into the atmosphere! స్ఫూర్తితో ) ఆ అరవై నిముషాలూ మనమందరం షట్‌డవున్ చేయ్యడం మూలంగా – కలగబోయే లాభాలను, మనలో ఎవరైనా ఉజ్జయింపుగా నన్నా లెక్ఖగడితే, మన బ్లాగులో “నేను సైతం..ఇంత తగ్గించాను”, “మీరూ కూడా కలిస్తే ఇంత తగ్గించవచ్చు” అని చెప్పడానికి అవతలివారిని ప్రోత్సహించడానికి కూడా బావుంటుంది. 15వ తారిఖూ ఆ అరవై నిముషాలే కాక దానిని ఇంకా ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఆలోచించండి. ఇవన్ని ఆచరణకు సాధ్యాలే.,అసాధ్యాలు కాదు. మన చేతిలోవే!
  కదం తొక్కండి మరి ముందుకు!

 4. excellent analysis.
  you post almost clarifies everything on battibandh. i dont think there will be any body among us to know further on this topic.

  bollojubaba

 5. బాగుంది వ్యాసం. సమాచార భరితంగా విశ్లేషణ చక్కగా ఉంది.

  ఇక పోతే మీరు భారతంలో దీని గురించి కంపెనీలు ఏం చేస్తున్నాయో అని అడిగారు.

  ఏమీ చేయటం లేదు అనుకోవడం తప్పు. కొంత మంది భారతంలో అవగాహన సరిగా లేదని కూడా అన్నారు. అది కూడా కొంత వరకే నిజం.

  ఇప్పుడు కంపెనీలు చాలా సోషల్ రెస్పాంసిబిలిటీ కలిగి ఉంటున్నాయి. పర్యావరణం, కాలుష్యం, మొదలయినవాటి మీద అవగాహన కలిగిస్తున్నాయి.

  నాకు తెలిసి మా కంపెనీలో మిగతా వాటిలో చేస్తున్న కొన్ని కార్యక్రమాలు:

  ౧. రీసైక్లింగు కోసం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించడం. మనకు పనికి రాని సామాన్లని సేఫుగా డిస్పోస్ చేయడానికి బిన్ లు ఏర్పాటు చేయడం.

  ౨. నీటిని రీసైకిల్ చేయడం. రెస్టు రూముల్లో ఫ్లష్ చేయడానికి ఉపయోగించే నీరు రీసైకిల్డు నీరు.

  ౩. ఉద్యోగులకు పర్యావరణం మీద అవగాహన కలిగిస్తూ మెయిళ్ళు పంపడం.

  ౪. వాహనాలకి పొల్యూషను చెక్ చేయించుకోవడానికి వీలుగా కంపెనీలోనే ఏర్పాట్లు చెయ్యడం.

  ౫. కంపెనీలో ప్లాస్టిక్ మినరల్ వాటర్ బాటిల్సుని వృధా చేయకుండా వినియోగించమని ఉద్యోగులని అభ్యర్థించడం. అరలీటరు కాకుండా లీటరు బాటిళ్ళని ఏర్పాటు చెయ్యడం.

  ౬. దేనికి దానికి విడిగా పేపరు, కోక్ వగయిరా టిన్లు, ప్లాస్టిక్ కి విడిగా బిన్ లు ఏర్పాటు చెయ్యడం. వాటిని తగిన రీతిలో డిస్పోస్ చేయించడం, లేదా రీసైకిల్ చేయించడం.

  ౭. కంపెనీలో అన్ని చోట్లా పర్యావరణం గురించి వివరిస్తూ, మనమెలా సహాయం చెయ్యాలో, హాని కలుగకుండా ఎలా అరికట్టచ్చో పోస్టర్లు అతికించి ప్రచారం చెయ్యడం.

  ౮. ఆటోమేటిగ్గా కాన్ఫరెంసు రూముల్లో లైట్లు ఆగిపోయేలా ఏర్పాట్లు చెయ్యడం. అలాగే రెస్టు రూముల్లో కూడా.
  రాత్రిళ్ళు జనాలు పని చేస్తున్న క్యూబికళ్ళలో మాత్రమే లైట్లు వేసి ఉంచుతారు.

  ఇవి మచ్చుకి కొన్ని. ఇలాంటివి ఎన్నో చేస్తున్నాయి. ప్రోత్సాహిస్తున్నాయి.

 6. పారిశ్రామికీకరణ లేక ముందు కూడా చాలా సార్లు (వేల ఏళ్ల క్రితమే) గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులు నెలకొన్నాయి కదా (అగ్ని పర్వతాల పేలుళ్లు, అడవుల్లో ఏళ్ల తరబడి కొనసాగే కార్చిచ్చులు మొదలైన వాటిదారా) హిమ యుగాలు రావటం, పోవటం ఒక నిరంతర ప్రక్రియ. సముద్ర మట్టం పెరగటమనేది భూమి కింది మార్పుల (corechanges) వల్లనే కానీ వాతావరణం వేడెక్కటం వల్ల కాదని రిపోర్టులున్నాయి. గత పదేళ్లలోనిజానికి భూమి మీద average temperatures తగ్గాయని కూడా రిపోర్టులున్నాయి. సహజ సంఘటనవల్ల వాతావరణంలో కలిగే మార్పులతో పోలిస్తే మానవుల కారణంగా కలిగేవి మరీ ఎక్కువకాదేమో. ఉదాహరణకి, క్యాలిఫోర్నియాలో ప్రతి ఏటా వేసవిలో కార్చిచ్చులు చెలరేగి వేలాది ఎకరాల అటవీ ప్రాంతం దగ్ధమైపోతుంది. అప్పుడు వెలువడే బొగ్గుపులుసు వాయువు ఎన్ని కార్లు, కంప్యూటర్లు విడుదల చేసే గ్రీన్ హౌస్ వాయువుకి సమానం?

  బత్తీబంద్ లాంటివాటికి నేను వ్యతిరేకం కాదు. గ్లోబల్ వార్మింగ్ పేరుతోనన్నా పర్యావరణమ్మీద ఎక్కువమందికి ఆసక్తి కలిగితే మంచిదే. గ్లోబల్ వార్మింగ్ ని మనం మరీ ఎక్కువ చేసి చూపుతున్నామా అనేది మాత్రమే నా ప్రశ్న?

 7. ఒక చిన్న అడుగైనా గొప్పదే..as long as you are in the right direction.
  గ్రీన్, గ్లోబల్ వార్మింగ్ ఒక ఫ్యాషన్ మాత్రమే!! భారతానికి కావలసింది దీపాలార్పడం కాదు. దీపాలు వెలిగించడం. both literally and metaphorically. వేల గ్రామాలు ఇంకా విద్యుద్దీపాలు చూడని దేశంలో నిజంగానే దీపాలు కావాలి. ఇరవై నాలుగ్గంటలు నియాన్ లైట్ల క్రింద కూచ్చునే వాడికి ఒక గంట ఆర్పేసు కూచ్చోవటం నావెల్టి. :౦)
  ఇంత పూనకమొచ్చినట్టు ఏదైనా చెయ్యాలనుకుంటే అక్షరదీపాలు వెలిగించడం గురించి ఎందుకు ఉద్యమించరు?
  ఇలాంటి బత్తీబందుల్లాంటి సత్కార్యాలు నిర్వహించడానికి పాశ్చాత్యప్రపంచంలో చాలామంది ఉన్నారు (కావాలంటే వీళ్ళ ఎస్యూవీలు తోసుకొని మరీ తిరుగుతారు). అల్ గోర్ అనే వాతావరణ శాస్త్రజ్ఞుడు, మహాజ్ఞాని చెప్పినట్టు నిజానికి భూమి మునిగిపోయే పరిస్థితే వస్తే, అందుకు సిగ్గుపడటానికి, దాన్ని నివారించటానికి బడా ఆసాములు చాలామందే ఉన్నారు..India..FOCUS
  (వామ్మో!! ఇంతకీ నా వ్యాఖ్యను ప్రచురిస్తారో లేదో)

 8. చాలా బాగా రాశారు. నేను ఒకప్పుడు global warming మీద ఒక టపా రాసినప్పుడు, ‘చెప్పడానికేగాని చెయ్యడానికి కాదు’ అని నా స్నేహితుడే నన్నడిగిన క్షణం గుర్తొ్చ్చింది, ఇది చదువుతుంటే. ప్రవీణ్ గారు చెప్పినవి కూడా బావున్నాయి.

 9. రవి గారు..
  మీరు చెప్పింది బాగానే ఉంది. కాని, అదీ ఇంకో సమస్యే కానీ, ఈ సమస్య కున్న పరిష్కారానికి అడ్డు కాదు. Reliance, Wipro వగైరా వగైరా వంటి వాళ్ళు వీటి కోసం కృషి చేయడానికి మీరు చెప్పిన కారణాలు అడ్డు కాదు కదా? అలాగే బాగా బాగుపడ్డ (మామూలు భాషలో ‘బలిసిన’) తెగకి చెందిన వారు ఇలాంటివి చేపట్టటానికి కూడా మీరు చెప్పినవి అడ్డు కాదు, కాకూడదు. మనకి చెయడానికి వీలున్నప్పుడు, చేస్తే మంచి జరుగుతున్నప్ప్పుడు, చెయ్యాలి కదా?

 10. రవి వైజాసత్య గారు, beg to differ with your view – “గ్రీన్, గ్లోబల్ వార్మింగ్ ఒక ఫ్యాషన్ మాత్రమే!!” Sorry, did not expect that statement from you!

  ఆ రోజున వీధి దీపాల క్రింద కూర్చున్న వారి మూలంగానే మీ ఈ భారతదేశం ఈ మాత్రం ముందుకు వచ్చింది. ఈ రోజున బ్లాగుల్లో అనేక విశయాలు చర్చకి వస్తున్నవి. ఒక కొత్తపాళీ లాంటి వారు – ఒక బత్తిబంద్ బ్లాగు ఉద్యమం లాగా నడపడానికి అవకాశం వచ్చింది. కాబట్టి నియాన్ దీపాల క్రింద కూర్చున్న వారిని చులకన గా చూడడం కాదు. ఆల్ గోర్ మహశయౌడన్నట్టు కడవలకొద్ది కన్నీరు విడవడానికి భాగ్యవంతులు ఉండవచ్చు. కాని భాగ్యంతో (మేధ) కానివ్వండీ, పరపతితో కానివ్వండి, వారు మిగతవారికి ఇలాంటి విశయాలు విశదీకరించగలిగి వారిని కూడా చైతన్యవంతులని చెయ్యగలగాలి.

  అక్షర దీపాలు వెలిగించడానికి ఎవరూ కూడా ఉద్యమించడంలేదని ఎవరన్నారు? అనేక సందర్భాలలో, ఈ బ్లాగు ప్రపంచంలో బ్లాగుల్లో నెటిజన్ వాఖ్యలు చదవండి. ఎవరి స్థాయిలో వారు చేస్తునే ఉన్నారు. భారతదేశం పెద్దది కాబట్టి మనకి అవసరాలు ఎక్కువ. చెయ్యడానికి అవకాశలూ కూడా ఎక్కువే. తెలుగు దినపత్రికలు చూడండి. దశాబ్దం నాటికంటే ఈ రోజున దాతలు, ఆర్ధిక వసతిలేని విద్యార్ధులకు సహాయ సహకారాలు చాలా ఉదారంగా విరళాల రూపంలో ఇవ్వడానికి ముందుకి వస్తున్నారు.

  అవును, శ్రీకాకుళంలో “చీకటి”ని” పారద్రోలాలి. అలాగే, భాగ్యనగరంలో సీ ఎఫ్ ఎల్ దీపాల క్రింద “వెనుక”బడ్డ వారికోసం మెధో -సంపత్తులు ఉన్నవారు శ్రమించాలి. రిక్షా తొక్కేవాడే కాదు కార్మికుడు. కంప్యుటర్ మీద పనిచేసే వాడు కూడా కార్మీకుడే!

 11. రవి వైజాసత్య గారు, నేటి ఈనాడులో http://eenadu.net/district/districtshow1.asp?dis=hyderabad#17
  మీ – అక్షర దీపాలు వెలిగించమని – ఎవరు ముందుకు వస్తారో ?

 12. Abracadabra .. I am reading up on this issue .. of natural phenomena vs. human endeavor causes of global warming. Will write more soon.

  Vyzasatya – yes, there is every need to see that the basic needs of the people are being met. Actually, if you think about it, these two ideas are not mutually exclusive. As was repeatedly said on this forum as well as all forums on “Lights out campaigns” – the purpose is not merely to turn off lights .. but to inform people that this is a problem . and that the can and should do something about it.

 13. నా పిచుకల వేట:

  అల్ గోర్ మన almost president మాజీ ఉపాధ్యక్షుడు కదా. శాస్త్రవేత్త ఎప్పుడయ్యాడూ!?!

  రాజకీయాలనుండి తప్పుకున్నాక పర్యారణమ్మీద తెగ కృషి చేసేసి నోబెల్ ప్రైజు కొట్టేశాడనుకోండి. ఆస్కార్ కూడా కొట్టేశాడనుకుంటా, An Inconvinient Truth డాక్యుమెంటరీకి. వీలయితే చూడండి, చాలా మంచి లఘుచిత్రం.

 14. I meant పిడకల వేట 🙂

 15. గోపాల్ గారూ,
  పైన FOCUS అన్నది అందుకే. ఎంతటి యువశక్తి అయినా చెల్లాచెదురు చెస్తే చుట్టుకాల్చుకోవటానికి కూడా పనికిరాదు. దానిమీద కూడా పనిచేస్తున్నారు. దీనిమీద కూడా పనిచేయటంలో తప్పేం లేదు అంటారు..ఒప్పుకుంటాను కానీ భారత ప్రాథమ్యాలలో ఈ గ్లోబల్ వార్మింగు చాలా క్రింద ఉండవలసిన విషయం అని నా నిశ్చితాభిప్రాయం .

  నెటిజన్ గారూ,
  పర్యావరణం సీరియస్ విషయమే కానీ గ్రీన్..గ్లోబల్ వార్మింగు ఫ్యాషనే ..అందుకు చాలా ఉదాహరణలు ఇవ్వగలను. ఎంటప్రెన్యూరియల్ స్ప్రిరిట్ ఉన్నవాళ్లకి మంచి అవకాశం కూడా. (మచ్చుకు ఈ వ్యాసం చదవండి http://trendwatching.com/briefing/). చరిత్రలో ఇలాంటివి చాలా ఫ్యాషన్లు ఎలా వచ్చివెళ్ళాయో మరెప్పుడైనా వ్రాస్తాను.

  మాష్టారూ, నేను పైన ఒక బాధ్యతగల పౌరుడు వనరుల సదుపయోగం గురించి ఎం చెయ్యాలో ఇక్కడ చర్చిస్తున్నారో దాదాపు చాలామటుకు చేస్తూనే ఉన్నాను. ప్రశాంతి గారి మీద మిగిలిన క్రియాశీలక సభ్యులమీద నాకు అమిత గౌరవముంది కానీ అనవసర విషయం మీద శ్రమ వృధా చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఇరవై యేళ్ళ తర్వాత..ఊప్స్ మేమనుకున్నట్టు గ్లోబల్ వార్మింగ్ జరగలేదు అంటే సమయం తిరిగిరాదు కదా. we don’t need to spend so much time on unpredictable futuristic probabilities. nature is too complex and powerful for humans to handle

  అబ్రకదబ్ర గారూ,
  నిజంగా నాకు ఈ విషయం గురించి అంత సమయం వెచ్చించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే పరిశోధనా వ్యాసాలే చదివేవాన్ని. ఒక రాజకీయ లాయరు (aka scientist) గోరంతను కొండంతలు చేసి తీసిన భయోత్పాతక డాక్యుమెంటరీ చూడవలసిన అవసరం లేదు. సైన్సులో పరిశోధనా ఫలితాలు అంత డ్రమాటిగ్గా ఉంటే ఎంత బావున్నో 🙂

 16. hi everybady!!!! first sentence is 100% real
  webdhunia your four points are real and power full
  and ever parson see this movies —avatar—-
  —-WALL-E—- to realy change to the people
  to change the world and this give the message both are movies see and undastood the movies……..(ardhmchesukowali )
  to send with print media to the every parson in the world educated & uneducated .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: