• Categories

 • Blog Stats

  • 9,939 hits
 • Advertisements

కారులో షికారుకెళ్ళే

చాలా మంది జీవితాల్లో కార్లు నిత్య భాగమైపోయినాయి.

అమెరికాలో, అందునా డెట్రాయిట్ లాంటి పబ్లిక్ ట్రన్స్పోర్టు లేని ప్రాంతాల్లో కారు లేక పోతే కాళ్ళు లేనట్టే.

చమురు ధరలు, తద్వారా పెట్రోలు ధరలు కనీ వినీ ఎరుగని గరిష్ఠ స్థాయిలో తచ్చట్లాడుతుంటే, చాలామంది కొనుగోలు దారులు హెచ్చు ఎఫిషియెన్సీ తో నడిచే ఖార్ల కోసం వెతుకుతున్నారు. హైబ్రిడ్ ఇంజన్లతో నడిచే కార్లమీద మోజు చూపిస్తున్నారు.

ఐతే అందరికీ ఉన్నపళంగా కొత్త కారు కొనుక్కోవడం సాధ్యం కాదు.
ఉన్నంతలో, మన డ్రవింగ్ అలవాట్లని కొద్దిగా మార్చుకోవడం ద్వారా, మన కారు యొక్క ఎఫిషియెన్సీని పెంచవచ్చు.

కొన్ని సూచనలు:

 • కారులో అనవసరమైన బరువు ఉంచుకుని తిరగవద్దు.
 • మీ కారుకి అత్యధిక ఎఫిషియెన్సీ వచ్చే వేగ పరిమితి ఏమిటో తెలుసుకొని ఆ పరిమిత్లో నడపడానికి ప్రయత్నించండి. పెట్రోలుతో నడిచే చాలా కార్లు 45 – 60 mph స్పీడులో అత్యధిక ఎఫిషియెన్సీ కలిగి ఉంటాయి. 60 మైళ్ళ స్పీడు దాటిన కొద్దీ ప్రతి 5 మైళ్ళ ఎక్కువ స్పీడుకీ ఎఫిషియెన్సీ 5 % తగ్గుతుందని అంచనా.
 • ఒక సారి ఇంట్లో బయలు దేరినాక ఒకటి కన్నా ఎక్కువ పనులు చేసుకుని రావడానికి ప్రయత్నించండి. 4 పనులు చేసుకు రావడానికి వేర్వేరు ట్రిప్పులు వేస్తే, ప్రతి సారీ ఇంజను స్టార్ట్ చెయ్యడంలో కొంత ఇంధనం వృధా అవుతుంది.
 • హైవే మీద వెళ్తున్నప్పుడు క్రూయిజ్ కంట్రోలు (cruise control) ఉపయోగించండి.</
 • li>

 • అకస్మాత్తుగా వేగం పెంచడం, బ్రేకు వెయ్యడం చెయ్య వద్దు. సాధ్యమైనంత వరకూ ఒకే స్పీడులో వెళ్ళడం మంచిది.</
 • ul>

  మరిన్ని వివరాలు ఇక్కడ.

  Advertisements

4 Responses

 1. మీరు చెప్పిన సూచనల్లో మొదిటిది పాటిస్తున్నాను. అప్పట్నుంచీ మా ఆవిడ నాతో మాట్లాడ్డం మానేసింది. దీనికి తగిన పరిష్కారం వెంటనే సూచించగలరు.

  మే బ్లాగ్సూచనకై ఎదురు చూస్తూ,

 2. Kanth garu ,
  Kullu joke baga vesaru

 3. కాంత్ మహాశయా .. మీ ముందు రెండు పరిష్కారాలు ఉన్నై. మీకు తగింది ఎంచుకోండి. ఒకటి .. వెంటనే మీ ఆవిడ కాళ్ళ మీద పడి (పర్లేదు, సృఇకృష్ణుడంతటి వాడు చేశాడు), ఆమె ఏడు మల్లె పూలకంటే లేశమైనా బరువెక్కువకాదని నమ్మ బలకండి. ఇది ఫలిస్తుందా లేదా అన్నది మీ నటనా కౌశలం మీదా, ంఇరు అబద్ధాలు ఎంత బాగా చెప్పగలరు అన్నదాని మీదా, మీ ఆవిడ దయాగుణం మీదా ఆధార పడి ఉంటుంది.
  రెండో మార్గం .. భౌతిక కాయం లేకుండా కేవలం ఆత్మగా బతిఖే ఇంకో భార్యని వెతుక్కోండి!
  నాకు తోచింది చెప్పాను. ఇహ మీ ఇష్టం!!

 4. స్వర్గంలోనూ కష్టాలు మొదలయ్యాయన్నమాట.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: