సిద్ధా, బుద్ధా మరియూ బత్తీబంధా!

తెలుగు బ్లాగ్లోకంలో ఎదురు లేని కామెడీ కింగు విహారి. అది నేనిచ్చిన బిరుదు కాదు, బ్లాగ్లోక వాసులే ఎప్పుడో ఆ పట్టం కట్టేశారు. ఈ మధ్యన చాలా మంది మంచి కామెడీలూ, సెటైరులూ రాస్తున్నా, ఎక్కడా అపశ్రుతి దొర్లకుండా, ఎప్పుడూ క్వాలిటీ తగ్గకుండా అనేక రాజకీయ సామాజిక సాంస్కృతిక విషయాల మీద వ్యాఖ్యా బాణాలూ, వ్యంగ్యాస్త్రాలూ, సెటైరు ఆటం బాంబులూ కురిపిస్తూ పాఠకులకి నవ్వుల పూలగుత్తులు అందించే విహారి దృష్టి ఈసారి బత్తీ బందు సమస్య మీదకి పాకింది.
*** *** ***
“అయ్యగారూ! ఏంటీ బత్తి బంద్?”

“దీపాలు ఆర్పి వుంచడం. దీపాలొకటే కాదు విద్యుత్తును వాడే ఏ సాధనాన్నయినా వాడకపోవటం. అది టి.వి కావచ్చు, ఫ్రిజ్ కావచ్చు, ఏ.సి. కావచ్చు. విద్యుత్తుతో నడిచే ఏ యంత్రాన్నైనా వాడకపోవటం. ”

“ఏంత సేపు? ”

“ఓ గంట సేపు. ”

“ఆర్పితే ఏమవుతుందట? నేనొక్కర్ని చేస్తే సరిపోతుందా? అసలెందుకు ఆర్పాలంట? ”

“ఆర్పితే ఎనర్జీ ఆదా అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగాఎ ఎన్నో చోట్ల ఎంతో మంది ఈ బత్తి బంద్ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు ఇంకా పాలు పంచుకుంటున్నారు. నువ్వు కూడా ఈ చారిత్రాత్మక ఘట్టం లో చేయి కలిపితే బావుంటుంది. ఏన్నో లక్షల మంది చేస్తున్న మంచి పని ఇది. దీనికి ఎంతో ప్రచారం అవసరం. ”

“అయ్య గారో నాకో భేషైన అవిడియా వచ్చింది. ”

“ముందు చెప్పు తరువాత అది భేషో ట్ర్యాషో చెబుతా. ”

“ఏ పనైనా విజయవంతం కావాలంటే మంచి పబ్లిసిటీ కావాలి కదా”

“అవును గాంధీ ఉప్పు సత్యాగ్రహం కూడా నోటి మాటతో మంచి ఊపందుకుంది. ”

“ఇప్పుడు ఇలా చెప్పగానే అలా చేసెయ్యడానికి గాంధీలు లేరు, అనుచరులు లేరు కదా అందుకనే ఎవరైనా సెలెబ్రిటీని పట్టుకొచ్చి ప్రచారం చేయిస్తే అందరికీ గుర్తుంటుంది. ”

“దశావతారం ఆడియోకు పది కోట్లిచ్చి జాకీ చాన్ ను తెచ్చినట్టు ఇప్పుడు టాం హ్యాంక్సునో, జాన్ ట్రవోల్టానో తెప్పించమంటావేంటి. ”

“మీ కెప్పుడూ వేళా కోళమే. అంత పెద్దోళ్ళను భరించే శక్తి వాళ్ళకుందేమోకానీ, ఈ ధరిత్రి కోసం పాటు పడే ఇలాంటి ప్రచారకులకు లేదు.

“సో ఏం చెయ్యమంటావ్? ”

“నాకు కొంచెం ధారి ఖర్చులకు ఇస్తే నేను కొంత మందితో పెద్దోళ్ళతో మాట్లాడి వాళ్ళను ఇందులో పాల్గొనమని అడిగి వస్తా. అప్పుడు దీనికి భారీ ప్రచారం వస్తుంది. ”

“నిజంగానే భేషైన అవిడియా. సరే కానీ. రేపే బయలు దేరు. ”
******

“వై.ఎస్. గారూ నమస్కారమండీ”

“ఆ.. ఆ… సిద్ధా నువ్వా? రా… రా… ఏవిటి ఇలా వచ్చావ్. మీ బుధ్ధ నా దగ్గర్నుండి ఏవైనా కాన్సెప్టు కోసం పంపించాడా? ”

“అబ్బే మీరు మైకు పట్టుకుని రెండు మాటలు మాట్లాడితే అదే మాకు పెద్ద కాన్సెప్టు. నేను దాని కోసం రాలేదు. ”

“మరి దేనికొచ్చావో చెప్పు.”

“ఏమీ లేదండీ! మీరు జూన్ 15 తేదీన ఓ గంట సేపు లేట్లార్పేయాలండి. ”

“లేట్లార్పేసి కొవ్వొత్తులు వెలిగించుకోవాలా? ”

“అవునండి.”

“అదెంత పని అసలే ఉప ఎన్నికల్లో గెలిచినందుకు నేను హ్యాప్పీ. మేడం కూడా హ్యాప్పీ.. ఆ రోజు క్యెండిల్ లైట్ డిన్నర్ చేసుకుంటా. సూరీడూ?.. సూరీడూ? … ఎక్కడున్నావయ్యా ఇలా రా. ”

“చెప్పన్నా”

“ఇదిగో సిధ్ధా ఏదో చెబుతున్నాడు మన కేలండర్ లో ఆ రోజు గుర్తుపెట్టుకొని లైట్లూ, టి.వి.లు అన్నీ ఆర్పెయ్. ”

“అలాగే అన్నా. ”

“సిధ్ధా. నీకు ఓకేనా. ”

“చాలా మంచిదండి. అలాగే మీరు ఈ విషయం సాక్షిలో వచ్చేట్టు చెయ్యండి. ఇంకా బొత్సా కు, ఎమ్మెస్ కు చెప్పే బాధ్యత కూడా మీదే. మారెప్పకు మాత్రం చెప్పకండి. ”

“సాక్షి వరకు ఈజీ పనే. కావాలంటే మనకనుకూలంగా వున్న హరీష్ రావ్కి చెప్పమంటే చెబుతా. మిగతా పనే కష్టం. ”

“అయితే ఒద్దు లెండి. సాక్షి లో వచ్చేట్టు చెయ్యండి. మీరు మారెప్పకు చెబితే ప్రతి రోజూ బత్తి బంద్ అంటాడు. ”
****

“చంద్ర బాబు గారు! నమస్కారమండి. ”

“నమస్కారం. ప్రజలు మా పక్షాన వున్నారు. చూశారా ఉప ఎన్నికల్లో మా ప్రతాపం. వచ్చేది మా ప్రభుత్వమే. నో డౌట్ అబౌట్ ఇట్. ”

“అవచ్చేమో. మీరు అలా రెండు వేళ్ళూ పెట్టి నా కళ్ళలో పొడిచెయ్యకండి. నాకున్నవి రెండు కళ్ళే”

“సరే .. సరే.. ‘మీ కోసం’ కోసం మాట్లాడి మాట్లాడి ఇలా అయిపోయా. విషయం చెప్పండి. ”

“మీరు మీ కోసం అన్నారు కదా. అలాగే మా కోసం ఓ పని చేసి పెట్టండి. ”

“ఏమి చెయ్యాలి? నేను ముఖ్యమంత్రయ్యాక ఏదడిగితే అది చేసి పెడతా. ”

“అయిన తరువాత చూద్దాం కానీ. ఇప్పుడు మాత్రం మీరు ఓ గంట పాటు కరంటు వాడకూడదు. ”

“ఏఁ నేనెక్కడికెళితే అక్కడ కరంటు పీకేస్తున్నారు కదా. మళ్ళీ నేను పీకడమెందుకు. ”

“అది కాదు బత్తీ బందు కోసం జూన్ 15 న ఓ గంట పాటు దీపాలార్పితే బావుండు నని. ”

“ఓస్ అదెంత సేపు. హరికృష్ణా?…హరికృష్ణా?.. ”

“ఏం బావా? ”

“జూన్ 15 తేదీ సాయంత్రం ఏడున్నర గంటలకు పులివెందుల్లో మీ కోసం ప్రోగ్రాం వుండేట్టు చూడు. అక్కడయితే చాలా కరంటు ఆదా అవుతుంది. అక్కడ చాలా ఇళ్ళకు ఏ.సి. వుందట. ”

“అలాగే బావా. జూను 15…. నేనెవ్వరి బల్బూ చూడను. ”

“సిధ్ధా! ఇంకా ఏమన్నా కావాలా? ”

“చాలండి. మీరు ఆ రెండు వేళ్ళు కిందకనుకుంటే నే వెళ్ళొస్తా. ”
***

“చిరంజీవి గారూ! నమస్కారమండి”

“అరే సిధ్దా. నువ్వేమిటి ఇక్కడ. నమస్తే అనకుండా నమస్కారం అని అచ్చ తెనుగులో అంటున్నావ్. ఏంటి నేను పెట్టబోయే పార్టీ టికెట్టు కానీ కావాలా. నో ప్రాబ్లెం. వెళ్ళి బావ అరవిందు ముఖారవిందాన్ని ప్రసన్నం చేసుకో. ”

“అబ్బే నాకన్ని ఆసలు లేవండీ. మీరు బ్లడ్డు బ్యాంకూ, కన్ను బ్యాంకూ పెట్టారు గదా. అలాంటి సేవే ఒకటి ఇప్పుడు చేయాలండి.

“ఓస్ అంతేనా. తమ్ముడు నాగ బాబును రమ్మని చెప్పనా. ”

“ఒద్దండి. ఆపద మొక్కుల వాడు సినిమా చూసేశా. ఇప్పుడు మీరు ఒ గంట పాటు కరంటు వాడకుండా వుండాలండి. ఆదీ జూను 15 న. మీ మెగా అభిమానులందరికీ కూడా చెప్పాలండి. ”

“తప్పకుండా తమ్ముడూ. అదెంత పని నా అభిమానులున్నదే సమాజ సేవ చెయ్యడానికి. నేనున్నది ప్రజా సేవ చెయ్యడానికి. తప్పకుండా చేస్తా. ఇప్పుడే మా ఆంధ్రజ్యోతి వాళ్ళను, టి.వి.9 వాళ్ళను పిలిచి ఓ ప్రకటన కూడా ఇస్తా. ఎందుకైనా మంచిది అరవిందును ఓ సారి కలిసి పో. ”

“నేను మంచి రైల్లోనే వచ్చానండి. ఆయన దగ్గరికెళ్తే రైలెక్కమంటాడు. ఆదెక్కితే నాకు స్టాండిగే గతి. నే వెళ్ళొస్తా. ”

“వెళ్ళిరా. మళ్ళీ ఆగస్టు 15న తప్పకుండా రా.”
***

“కేసీఆరన్న వుండాడా? ”

“ఏఁ ఎందుకు. అన్న మాకే మొఖం చూపిస్తలే నువ్వెవడ్బే. బయటికి బో. ”

“లేదన్నా కొంచెం బత్తీ బందు గురించి చెబుదామని. ”

“చల్..నోర్మూసుకుని బో. ఇప్పుడు అన్నకు అందరూ అగర్ బత్తిలు ఎలిగించి పెడ్తుండ్రు. వాటిని ఆర్పేస్తావా. చల్. ”

*******************

Advertisements

8 Responses

 1. అమోఘం, అద్భుతం, అద్వితీయం,
  సరి రారు మీకేవరు ఈ బ్లాగ్ప్రపంచంలో
  హాస్య రసరాజా, బ్లాగ్విహారి,
  బ్లాగ్రాజా, బ్లాగు ప్రచండ, బ్లాగు మార్తండ,
  బ్లాగ్విజయీభవ, బ్లాగ్విజయీభవ

 2. suparooooooooo super.

 3. “సూటిగా…సుత్తు కొట్టకుండా”… బాగుంది.

 4. చాలా బాగుంది.
  బొల్లోజు బాబా

 5. This is very hilarious.

 6. బాగు బాగు విహారి గారు ,
  చివరన కె సి ఆర్ వద్దకు వెళ్ళటం, ‘అగర్ బత్తిలు’ , కడుపుబ్బ నవ్వాం, ఆది కాస్తా పగిలేలా ఉంది.
  ఐనా పర్వాలేదులెండి రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ .. (క్షమించాలి, దీని పేరు ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ నో, ‘ఇందిరా ఆరోగ్యశ్రీ’ నో ఉంది. గుర్తుకు రావటం లేదు. ఖచ్చితం గా ఇందులో ఒకటి మాత్రం ఖాయం) ఉందనే ఉంది కదా పగిలిన కడుపుకి కుట్లు వేయించుకోవటానికి.
  ఇక్కడ నాకు రెండు సందేహాలండి
  1. మా జిల్లా లో ఈ పధకం ప్రవేశ పెట్టారా లేదా?
  2. ఇలా నవ్వి నవ్వి కడుపు పగిలితే ఆ పధకం లో కుట్లు వేస్తారా లేదా?
  ఇవన్ని కాక పోతే రెడ్డి గారికి సిద్దా చేత సిఫార్సు చేయించు కొంటా , రెడ్డి గారు మన అనుకొంటె చాలు కదా 1000 ఎకరాలు ప్రభుత్వస్థలం అమ్మి ఐనా సరే నా పగిలిన కడుపుకి కుట్లు వేయిస్తారు కదా..

  ఇక్కడో తప్పు జరిగింది ఆండీ ఉట్టి బత్తీ బంధ్ అని కాకుండా ‘రాజీవ్ బత్తీ బంధ్’ అని పెడితే బాగుండేది. రెడ్డి గారు ,మేడమ్ గారు ఎంతో సంతోషించే వాళ్ళు. ఏమంటారు విహారి గారు?

 7. స్పందించిన అందరికి నెనర్లు.

  — విహారి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: