• Categories

 • Blog Stats

  • 9,939 hits
 • Advertisements

భూతాపం

బ్లాగు సామ్రాజ్యంలో సృజనాత్మకతకి పట్టం కట్టి తన సోంత కథల్నీ, అనువాద కథల్నీ మనతో పంచుకుంటున్న వర్ధమాన రచయిత కొల్లూరి సోమశంకర్ గారి ఆలోచనలు విందాం.
*** *** ***

భూతాపం
ప్రస్తుతం మానవాళి ఎదుర్కుంటున్న పెను సవాలు గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం. మనం విడుదల చేస్తున్న హానికారక వాయువుల వల్ల వాతావరణం లోని ఓజోన్ పొర క్షీణించి, ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోడాన్ని భూతాపం అని అనొచ్చు. దీనివల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. కొన్ని చోట్ల అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయితే, ఇంకొన్ని చోట్ల విపరీతమైన వానలు కురుస్తాయి. ఎండ కానీ వాన కానీ అసాధారణ స్థాయిలో ఉంటాయి.

సాధారణంగా ఏవి భూతాపానికి కారణమవుతాయో పరిశీలిస్తే కనిపించే ప్రధాన కారణాలు – ఎయిర్ కండీషనర్లు, రెఫ్రిజిరేటర్లు వంటి శీతలీకరణ సాధనలు విడుదల చేసే క్లోరోఫోరోకార్బన్లు. తర్వాతి స్థానంలో పరిశ్రమలు విడుదల చేసే వ్యర్ధ వాయువులు ఉంటాయి. మనం ఉపయోగించే మోటరు కార్లు, బైకులు వంటి పెట్రోలు – డీజిల్ ఆధారంగా నడిచే వాహనాలు విదిల్చే పొగ కూడా భూతాపానికి కారణమవుతుంది.

సమస్యకి ఎవరు కారణమైన ఇప్పుడు పరిస్థితి చేజారి పోయిందని గ్రహించాలి. ‘నా ఒక్కడి వల్లే భూతాపం పెరుగుతోందా? నేనొక్కడిని నివారణచర్యలు తీసుకున్నంత మాత్రాన భూతాపం తగ్గిపోతుందా?’ లాంటి వ్యర్ధ ప్రశ్నలని వేయడం ఆపి మనవంతు బాధ్యతగా వ్యక్తిగతంగా మనమేం చేయగలమో చూద్దాం.

ఇందులో భాగంగానే నేను ఈ క్రింది చర్యలను చేపట్టదలచాను.

 • వేసవి కాలం తర్వాత, ఫ్రిజ్ వాడకాన్ని కనీస స్థాయికి తగ్గించడం
 • అవసరం లేనప్పుడు విద్యుత్ వాడకాన్ని నిలిపివేయడం
 • నాలుగంతస్తులు లేదా అంతకంటే తక్కువ అంతస్తుల భవనాలలో లిఫ్ఠ్ ఉపయోగించకపోడం
 • రెండు మూడు కిలోమీటర్ల దూరం కోసం బైక్‌ని వాడకపోడం
 • భూతాపం గురించి తెలియనివాళ్ళకి తెలియజేసి, అవగాహనని పెంచడం
 • బత్తీబంద్ వంటి కార్యక్రమాలకు మద్దతునివ్వడం
 • వీటన్నింటిని సాధ్యమైనంత నిజాయితీగా ప్రయత్నించడం
Advertisements

6 Responses

 1. Good idea, manavantu krshi adi. All the best kolluri somasankar gaaru.

 2. మీ ఇంటెన్షన్లు (సమయానికి తెలుగుపదం గుర్తుకురాలేదు) హర్షణీయమైనవే..however you should recognize that activity and productivity are two entirely different things.

  వ్యర్ధప్రశ్నలనే మీరే నిర్ణయించేశాక..ఇంక చర్చ ఎందుకు?
  ప్రశ్నించడం కాదు కానీ నీవంతు ఏంచేసావో చెప్పు అని అడుగుతారని తెలుసు ..రోజూ రెండు వందలమైళ్ళకు పైగా ప్రయాణించే నేను ఇప్పుడు ప్రయాణదూరం తగ్గించి ట్రెయిన్లో వెళ్తున్నా, ఇంట్లో బల్బులు మార్చా, ప్లాస్టిక్ బాటిల్లు, డబ్బాలు వాడటం మానేశా, వీలైనంత విద్యుఛ్ఛక్తి ఆదా చేస్తున్నా..కానీ ఇవన్నీ భూమాతను రక్షిస్తాయా?? ఏమో

 3. vijay…..e-mail:vk.kumar38@gmail.com

  all the bes kollrue somasankar gaaru
  and ramani gaaru వ్యర్ధప్రశ్నలనే మీరే నిర్ణయించేశాక..ఇంక చర్చ ఎందుకు?
  ప్రశ్నించడం కాదు కానీ నీవంతు ఏంచేసావో చెప్పు అని అడుగుతారని తెలుసు ..రోజూ రెండు వందలమైళ్ళకు పైగా ప్రయాణించే నేను ఇప్పుడు ప్రయాణదూరం తగ్గించి ట్రెయిన్లో వెళ్తున్నా, ఇంట్లో బల్బులు మార్చా, ప్లాస్టిక్ బాటిల్లు, డబ్బాలు వాడటం మానేశా, వీలైనంత విద్యుఛ్ఛక్తి ఆదా చేస్తున్నా..కానీ ఇవన్నీ భూమాతను రక్షిస్తాయా?? ఏమో

  and pani chyadm mana andari kartavyam adi sapalamkava daniki pryatnichali gods is there in the world

  save the nature save the world give to the feature to the child

 4. hi

 5. this is good idea idi oka manchi plan

 6. a very good idea we can follow it

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: