• Categories

 • Blog Stats

  • 9,939 hits
 • Advertisements

‘నేను సైతం’

మానస వీణని శ్రుతి చేసి మధురరాగాలు పలికిస్తూ అనంత సౌరభాలు వెదజల్లే నిషిగంధ ఈ గ్లోబోళ జంభపై తనదైన శైలిలో యుద్ధం ప్రకటిస్తున్నారు చూడండి.
*** *** ***

అదొక బద్దకపు వారాంతపు సాయంకాలం..
చెయ్యాల్సిన పనులెన్నో ఉన్నా .. అసలు ఉండాల్సిన మూడ్ లేక, లాప్ టాప్ ముందేసుకుని యూట్యూబ్ లో ఏవేవో పాటల కోసం వెతుకుతున్నా..
అనుకోకుండా నాకు చాలా ఇష్టమైన ‘అమృత’ తమిళ్ సినిమాలో సత్తెన ననైదదు
ఆ వీడియో చూస్తూ ఎక్సైట్ అయిపోయి, పక్కనే టివి చూస్తున్న మావారిని ఒక పోటు పొడిచి “చూడండి మీరు అచ్చు ఇలానే మీ అక్క ముందు నన్ను..” అంటుండగానే శంకరాభరణం శాస్త్రి గారు “శారదా” అని అరిచినట్లు “ష్ష్ ష్ష్” అని గట్టిగా విసుక్కున్నారు. అంత ముఖ్యమైన ప్రోగ్రాం టివిలో ఏమొస్తోందా అని నేనూ తల తిప్పి చూశాను. National Geographic channel లో గ్రీన్ లాండ్ లో ఉన్న ఐస్ ఇదివరికటి కంటే వేగంగా కరిగిపోతుందని, కారణం గ్లోబల్ వార్మింగ్ అనీ చూపిస్తున్నారు.

ఎంత కోపమొచ్చిందనీ!! ‘ఎక్కడో ఐస్ ముక్కలవుతుందని పక్కనే ఉన్న నన్ను కసురుకుంటారా.. కాసేపట్లో “డిన్నర్ ఏంటోయ్” అని కొంగు పట్టుకుంటారుగా అప్పుడు చెప్తాను ‘ అని కచ్చిగా అనుకున్నా.

కానీ, ఒక్క క్షణం పాటే చూసినా, టివిలోని దృశ్యం నన్ను నిలువనీయలేదు. నేనూ వెళ్ళి టివి చూడటం మొదలుపెట్టాను. మైళ్ళకి మైళ్ళు విస్తరించి ఉన్న ఐస్ పెళ్ళలు పెళ్ళలుగా విరిగి సముద్రంలో కలిసిపోతుంది.. ఇంత వేగంగా కరగడం వలన సముద్రంలో నీటిమట్టం అనూహ్యంగా పెరిగిపోతుందని చెప్తున్నాడు.

ప్రోగ్రాం అవ్వగానే ప్చ్ అని పెద్దగా నిట్టూర్చడంతో నా కర్తవ్యం ముగించి ఇంకో ఛానెల్ కి మార్చుకున్నాను.

మనలో చాలా మందికి ఇలాంటి పర్యావరణ సమస్యల మీద పెద్ద అవగాహన ఉండదు. ఉన్నా దాని తీవ్రతని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించం. కారణం మన దైనందిన కార్యక్రమాలు. ఏదో తప్పనిసరై ఈ సమస్యల గురించి వినాల్సి వస్తే వెంటనే బాధేస్తుంది.. ఆ క్షణంలో నవనాగరిక పౌరులుగా ఈ సమస్యా నివారణకి మనం కూడా ఏదో చేయాలి అన్న ఆవేశం వస్తుంది.. వెంటనే ఎప్పటినించో వాయిదా వేస్తున్న పని ఒకటి ఠక్కున గుర్తుకొస్తుంది.. ఉన్నట్టుండి అదెంతో ముఖ్యమనిపిస్తుంది.. ముందది పూర్తి చేసేసి తర్వాత మనసంతా పూర్తిగా ఈ సమస్య మీద పెడదాం’ అనుకుని ఆ పనివైపుకి మళ్ళుతాం! అలాగే అన్నం తింటాం, పడుకుంటాం.. లేచేసరికి ఆవేశం పోతుంది.. ‘ఆ మన ఒక్కళ్ళం ఎంత చేసి ఏం ప్రయోజనం.. జరగాల్సింది జరగక మానదు.. అయినా ఎప్పుడో జరగబోయేదానికి మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు.. అప్పటికి మనం ఉండొచ్చామా.. చూడొచ్చామా!!’ వేదాంత ధోరణి.. నేనూ ఇంతే! ఎప్పటినించో తెలుసు ఉష్ణోగ్రతలలో పెరుగుదల, వాతావరణంలో జరుగుతున్న అవాంఛిత మార్పులు.. అయినా ఆ సమస్యపై దృష్టి పెట్టింది లేదు!

టివి లో ప్రోగ్రాం చూస్తున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఆ రాత్రి పడుకునేప్పుడు, కరిగి నీరవుతూ సముద్రంలో కలిసిపోతున్న మంచు గురించి ఆలోచిస్తుంటే మన వెండి కొండలు హిమాలయాలు గుర్తొచ్చాయి. భవిష్యత్తులో మన తరువాతి తరాలవారు పైనించీ కిందవరకూ మాస్క్ లు ధరించి (ఆదిత్య 369 చివర్లో చూపించినట్లుగా) ఆ పర్వతాల వైపు చూస్తూ ‘ఒకప్పుడు ఇవి మంచుతో కప్పబడి ఉండేవంటా!’ అని మనం ఇప్పుడు గుప్తుల స్వర్ణయుగం గురించి మాట్లాడుకున్నట్లు అనుకుంటారేమో అనిపించింది! వెంటనే అదో రకమైన భయం!! పచ్చదనం, సెలయేర్లు ఇవన్నీ కేవలం పుస్తకాల్లో మాత్రమే చూసే రోజు రాదు కదా!! ఇంకా భయం వేసింది!! అప్పుడు మొదలుపెట్టింది నా మనసు సరిగ్గా ఆలోచించడం..

ఈ పర్యావరణ సమస్య మీద మన వాళ్ళకి, మన చుట్టూ ఉన్నవాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవాలి.. వారికి సమస్య తీవ్రతని తెలియజేయాలి.. దానికి ‘బత్తీ బంద్ ‘ లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి.. అప్పుడు కూడా ఊరికే దీపాలార్పేసి కూర్చోకుండా పిల్లలకి, తెలియని వాళ్ళకి ‘గ్రీన్ హౌస్ వాయువులు’ లాంటి విషయాల గురించి చెప్తూ చర్చ చేయాలి. మొన్నొకరోజు వర్క్ లో మా గ్రూప్ అంతా లంచ్ కి వెళ్ళినప్పుడు ఈ సమస్యకి వాళ్ళే విధంగా స్పందిస్తున్నారని అడిగాను. ప్రతి ఒక్కళ్ళూ నీళ్ళు నమిలినవాళ్ళే! నెమ్మదిగానే అయినా, ఉత్సాహంగా మా ఇంట్లో మా దైనందిన చర్యలో చేసిన చిన్న చిన్న మార్పుల గురించి చెప్పాను. Energy efficient బల్బులు వాడటం, ఇంట్లో ఉన్న అనవసరమైన ఎలెక్ట్రికల్ వస్తువులను (ఉదాహరణకి టేబుల్ టాప్ వాటర్ ఫౌంటైన్, సీనరీ ఛేంజ్ అయ్యే వాల్ ఫ్రేం, లాంటివి) తీసివేయడం, మావారు 3, 4 పాటలు పాడుకుని గానీ పూర్తిచేయని స్నానాన్ని ఒక్క పాటతో అవజేయడం, టైం సేవ్ చేద్దామంటూ చిన్న చిన్న పనులకు కూడా చెరో కార్లో వెళ్ళడం ఆపేసి ఇద్దరం కలిసి వెళ్ళడం, గార్డెన్ లో మామూలు ఎలెక్టిక్ లైట్స్ తీసేసి సోలార్ లైట్స్ పెట్టడం ఇలా చిన్న చిన్న మార్పులే అయినా మనసులో ‘నేను సైతం’ అన్న సంతృప్తి!! నేను అమ్మకి చెప్పాను ‘లక్ష్మీదేవి తిరుగుతుందని ఇల్లంతా లైట్లు వేసుకుని కూర్చోకూ’ అని. వచ్చే నెలలో హైదరాబాద్ లో జరగబోయే బత్తీబంద్ గురించి చెప్పి మీ అపార్ట్ మెంట్లో కూడా అలాంటివి జరిగేటట్లు చూడమని చెప్పాను.

ఈ సమస్యని ఎదుర్కోవడం ఎప్పుడో కాదు ఇప్పటి నించే, ఎక్కడినించో కాదు ముందు నా ఇంటినించే అని ప్రతి ఒక్కరూ అనుకునే రోజు, అదీ వీలైనంత తొందరగా రావాలి. మంచినీళ్ళు కొనుక్కుని తాగడం మా అమ్మమ్మకి ఇప్పటికీ మింగుడుపడని విషయం. మన ముందు తరాల వారు గాలిని కొనుక్కునే రోజుల్ని మన కళ్ళతోనే చూసే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను.

కొసమెరుపు: నేను ఎంతో ఉత్సాహంగా చూపించబోయిన పాటని ‘ష్ష్’ అని చిరాకుపడుతూ ఆపేసిన మావారికి ఆ తర్వాత నా నించి ఎన్ని ‘ఊహూ’ లు వచ్చుంటాయో ఊహించమని ప్రార్ధన. మరి గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పేటప్పుడు చల్లగా చెప్పాలి కానీ అలా మండిపడితే పనులవుతాయా!!

Advertisements

10 Responses

 1. చాలా బాగా రాసారు నిషిగంధ గారు. చెప్పాల్సినవన్నీ చాలా చక్కగా చెప్పారు .

 2. బాగుందండి. చాలా బాగా ప్రెజెంట్ చేసారు.

 3. గ్లోబల్ వార్మింగ్ గురించి ఇతర బ్లాగరుల నుంచి వ్యాసాలను ప్రచురించడం మంచి ఉపాయం.
  కొన్ని చక్కని టపాలు ప్రచురించబడ్డాయి. నిషిగంధ గారు రాసిన తీరు బాగుంది.

 4. @ నిషిగంధ గారు
  ఎక్కడినుండి ఎక్కడికి తీసుకెళ్ళారు… హత్తుకునేట్టు చెప్పడం మీకు వెన్నతో పెట్టిన విద్య… ఇంట్లో అందరు నిద్రపోతున్నా వెలుగుతున్న దీపాలు ఆర్పేసి వచ్చాను ఇది చదివిన తరవాత…

 5. నెనరులు రమణి గారు, శ్రీవిద్య గారు, ప్రవీణ్ గారు, మరియు దీపు..

 6. హేయ్..

  మీకు పెళ్ళైపోయిందా.. అంటే మీరు సంతూర్ వాడుతున్నారన్న మాట. ఏది ఏమైనా.. ఇవ్వాళ నా గుండె రెండు వక్కలైంది. ఇంటికి వెళ్ళి నా భార్య చేత వెళ్డింగ్ చేయించుకోవాలి.

  ఇలాంటి విషయాలు కొంచం ముందుగానే ఎందుకు తెలియవో అర్దం కావటం లేదు.. ఏం చేస్తాం

 7. manchi post:)

 8. చక్రవర్తి గారూ, సరిగ్గా మావారు కూడా ఇలానే బాధపడ్డారు సిమ్రన్ కి పెళ్ళై పోయిందని తెలిసాక.. కాకపోతే ఆయనకి సినిమా పరిజ్ఞానం బహుతక్కువ కాబట్టి అది నిజంగానే సిమ్రన్ పెళ్ళి వీడియో అనుకున్నారు!!

  నెనరులు వంశీ గారు 🙂

 9. madam,

  Ur poetry is excellent and expected to improve ur poetry.

  Bye.

 10. బాగుంది…. కానీ మీనుంచి ఎన్ని “ఊహూ”లు వెల్లయొ చెప్పలేదు 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: