• Categories

 • Blog Stats

  • 9,939 hits
 • Advertisements

ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మీకూ, నాకూ జరిగే నష్టం ఏముంది?

తెనాలి రాముడే స్ఫూర్తి అంటున్న మన న్యూజెర్సీ వికటకవి గ్లోబల్ వార్మింగ్ పూర్వాపరాల్ని విచారిస్తున్నారు.
***

గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్…. ప్రస్తుతం దీనిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే అసలంటూ ఇదొకటుందనీ, దాని వల్ల మనకు కోలుకోలేని నష్టం జరగబోతోందని తెలిసింది కొద్దిమందికే. విద్యావంతుడు, విషయ పరిజ్ఞానము ఉన్న వాడు, ఆ ఇది నా ఒక్కడి వల్ల తీరే సమస్య కాదని అలసత్వం చూపిస్తుంటే, దీని గూర్చి ఏమీ తెలియని పేదవాడికి ఇదొక పనికిరాని ఘోష.
ఏమాటకామాటే, ఈ పాపంలో అసలు అలాంటి బక్క ప్రాణుల పాత్ర చాలా పరిమితమే, అసలు పాపమంతా పారిశ్రామికీకరణ, వివిధ కారణాల పేరుతో కొనసాగుతున్న అడవుల ఆక్రమణల ఫలితమే.

అయితే ఇదేదో ఇప్పటికిప్పుడు భయపడాల్సిన సమస్య కాదు, ఎప్పుడో 50 ఏళ్ళ తరువాత జరిగే ఉపద్రవానికి మనం ఇప్పటినుంచే భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. విషయమేమిటంటే 25 లేదా 50 ఏళ్ళ తరువాతే గనక మనము కళ్ళు తెరిస్తే, చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశము కూడా లేని స్థితిలో ఉంటాము. ఈ రోజున్న పరిస్థితిలో మనకి ఇంకా ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం చాలా ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన విషయం.

ఇంతకీ అసలు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మీకూ, నాకూ జరిగే నష్టం ఏముంది అన్న ప్రశ్న మనం వేసుకున్నట్లైతే, రెండు ప్రధానమైన, కఠోర సత్యాలు అగుపడతాయి.

మొట్టమొదటిది నీరు.

గ్లోబల్ వార్మింగ్ మంచుని త్వరితంగా కరిగించేస్తోంది. మన దేశాన్నే తీసుకుంటే, ఓ క్రమ పద్ధతిలో కరగాల్సిన మంచు పర్వతాలయిన హిమాలయాలు ఈ వేడి వల్ల ముందుగానే కరిగిపోతే, మనం జీవనదిగా పిలుచుకొనే గంగ కూడా అదృశ్యమయ్యే రోజు ఎంతో దూరంలో ఉండదు. తిండి లేకపోయినా కొద్ది రోజులు బ్రతకొచ్చేమోగానీ, నీరు లేకుండా ఒక్క రోజు కూడా బ్రతకలేము కదా. ఆ మాటకొస్తే అసలు నీరులేకుండా తిండి తయారు చేయలేము. మన ఊళ్ళలో సంగతే చూస్తే, పదేళ్ళ కిందట 100 అడుగుల లోతులో నీరు పడ్డచోట, ఈనాడు 500 అడుగుల లోతుకి వెళ్ళినా నీరు దొరకని పరిస్థితి. నీరు కొనగలిగే శక్తి ఉన్నా సృష్టించే శక్తి మనకి లేనప్పుడు ఎంత డబ్బు ఉండీ ఏమి ప్రయోజనం?

రెండోది విద్యుత్తు.

గ్లోబల్ వార్మింగ్ వాతావరణాన్ని మరింత వేడి చేయటం వల్ల, మనం చల్లదనం కోసం విద్యుత్తు వాడకాన్ని అత్యధిక స్థాయిలో వినియోగిస్తున్నాము. కానీ దీనివల్ల నిజంగా జరుగుతున్నదేమంటే, ఈ విద్యుదుపకరణాలు చల్లదనాన్ని మనకు ఇస్తూ దానితో పాటుగా మరింత ఎక్కువ మోతాదులో తిరిగి వాతావరణం లోకి వేడిని, కాలుష్యాన్ని కార్బన్ డై ఆక్సైడు రూపంలో పంపుతూ బయటి వేడిని మరింత పెంచుతున్నాయి. ఇదొక విషవలయం. కాబట్టి వేడిని తట్టుకోవటం కోసం చల్లదనాన్ని సృష్టించటం కన్నా, వేడిని తగ్గించటం ద్వారా చల్లదనం పొందగలగటం అన్నది వివేకవంతమయిన పని.

ఒక వ్యక్తిగా పై రెండూ నాకు చాలా పెద్ద సవాళ్ళూ, సమస్యలే. ఈ దిశగా బాధ్యతాయుత పౌరులుగా మన వంతుగా వచ్చే నెల 15 న చేయ తలపెట్టిన బత్తిబంద్ ఉద్యమాన్ని వీలైనంత ఎక్కువ మంది ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేయటం ద్వారా ప్రజల్లో గ్లోబల్ వార్మింగ్ పైన ఒక సామాజిక స్పృహ కలిగించినట్లైతే, మనం ఈ ప్రయత్నంలో సఫలమయినట్లే.

ఇతరుల్లో స్పృహ కలిగించటం అన్నదొక పెద్ద సవాలే. అందుకే ముందుగా కనీసం మన మన ఇళ్ళల్లో ఈ స్పృహని కలిగిద్దాం. ఆ ఒక్క గంట పాటు మనం విద్యుత్తు వాడకం ఆపగలిగితే కలిగే అసలు ప్రయోజనం, తగ్గిన విద్యుత్తు ఖర్చు కన్నా కొన్ని రెట్లు ఎక్కువ విలువ. ఆ ఊపుతో ఈ కార్యక్రమం విజయవంతం చేయటానికి ప్రయత్నిద్దాము.

ఈ కార్యక్రమము హైదరాబాదులోనే తలపెట్టినా, అసలు సమస్య ప్రభావం విశ్వవ్యాప్తం కాబట్టి ప్రపంచంలోని నలుమూలల్లో ఈ సమస్య తీవ్రతను అర్ధంచేసుకొన్నవారు, ఆ రోజు మన మన ప్రదేశాలలో మనకు వీలైన విధంగా బత్తీ బంద్ ఆచరిద్దాం. నేను ఇక్కడ న్యూజెర్సీ నుంచి సరే అంటున్నాను, మరి మీరో?

Advertisements

6 Responses

 1. గ్లోబల్ వార్మింగ్ గురించి నాకు మరీ ఎక్కువగా ఏమీ తెలీదు కానీ, కొన్ని సందేహాలున్నాయి. ఈ పారిశ్రామికీకరణం లేక ముందు కూడా (వేల ఏళ్ల క్రితమే) అడవుల్లో కార్చిచ్చులు, అగ్ని పర్వతాల పేలుళ్లు, మొదలయిన వాటి వల్ల వచ్చిన Co2, ఇతర వాయువుల వల్ల అనేక సార్లు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. రక రకాల కారణాల వల్ల చాలా సార్లు హిమ యుగాలొచ్చి పోయాయి. ఇప్పుడు కూడా స్వాభావికంగా సంభవించే ఉత్పాతాల వల్ల కలిగే వాతావరణ నష్టంతో పోలిస్తే పారిశ్రామికీకరణం వల్ల కలిగేది ఎక్కువయ్యుంటుందా?

  గ్లోబల్ వార్మింగ్ ని ఆపటానికి మనమేమీ చేయొద్దని నా ఉద్దేశం కాదు. దాని గురించి మరీ ఎక్కువగా భయపెడుతున్నారా అనేది నా ప్రశ్న.

  http://anilroyal.wordpress.com

 2. j p takkuva tinnada margadarsi vyavaharam lo atanokkadea balenced gaa matladataadanu konna,

  akkada ayana kooda romaji patla etv lo panichesina “swami baktini”,

  k.c.r,c.b.n,ragavalu laaga “kula bakthi” ni chaatu kontu matladadu.

  margadarsi tappu la gurinchi matlada kunda ituvanti charyala valla indian econamy “atalaakutalam” ayipoddi annattu matlaadadu

  evadaina okatea kotta paarty la valla neeti vantamaina paalana raaddu

  manam raajakeeya naayakulanu ennukonea tappu du

  pancayati member stayi nunti manchi vaalanu ennukovatamea ee samasyaku pariskaaram.

 3. శ్రీను గారి వ్యాఖ్య వెరే టపాకి ఉద్దేసించినది, ఇందులో పొరబాటుగా పంపినట్లున్నారు. ఈ వ్యాఖ్యకు global warming కు ఎలాంటి సంబంధం లేదు.

 4. అబ్రకదబ్ర గారు,
  ఈ విషయములో మనం స్వంతగా పరిశోధనలు చేసి నిజమా కాదా అని నిర్ణయించలేము. శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోధనల మీదే ఆధారపడుతున్నాము. గ్లోబల్ వార్మింగ్ విషయంలో మాత్రం అందరిదీ ఒకే మాట. ఈ వేడి హద్దులు దాటుతోందనీ అది ప్రకృతి సహజం కానిదీ, స్వయంకృతమేననీ. ఈ కార్యక్రమాల వల్ల ఏదో మార్పులు ఉన్న ఫళాన తీసుకొచ్చేస్తాం అన్న భ్రమ నిర్వాహకులకి గానీ, నాకు గానీ లేవు. కాకపోతే, ఈ యాత్రింక జీవనంలో ఒక్క క్షణం ఆగి ఓహో ఇలా జరుగుతోందా అని తెలుసుకొని, వారి వారి స్వత: నిర్ణయాలతో ఎవరయినా ఓ చిన్ని మార్పుకు శ్రీకారం చుడితే అదే పదివేలు.(ఉదా: నా మటుకు నేను మా ఇంట్లో ఖచ్చితంగా రీ సైక్లబుల్ వ్యర్ధాలు మిగతా చెత్త నుంచి వేరు చేస్తూనే ఉంటాను).

 5. hello sir,
  good morning

  my name is vijay. I am fine arts student. i not fluent in English language. that’s why i write in Telugu language. e global warming prathi okkarilo chityanam tisukuravali ela antara swardm vaddili.
  kontha samayani nature and rabovu thatala variki manm andiche chiru kanuka kavali. edi andari vala sadhum. ela antara . to electronic media, print media , cell phones, to send this message to every parson.

  on this andaru chaduvkuna varu undar e present generation lo kuda villages lo city lo chaduvukuna vaaru manchiga alochincy vaaru kondari ki avagaha leka vuna varu kontha time ni anga holidays low chatlu natadam
  pakavari to dinigurinchi mataladadm vala varilo avagahana peruguthundi “e mata nenu kadu vemana kuda ede teliya chesaru.

  one more message when you send this message to cell phones and translate the languages .this message sent every parson in the world save to the feature.

 6. Save the nature
  Save the trees
  save the animals
  save the small small cretures
  save the birdes
  Save the earth
  to give to the feature to the our humanlife and child this message send every porson to the world send to cellphones or electonicmedia, print media, enternet media .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: