• Categories

  • Blog Stats

    • 9,939 hits
  • Advertisements

ఎన్నెం కతలు – దీపాలార్పు దినం

నిడదవోలు మాలతి గారి తెలుగు తూలిక బ్లాగు వనవాసులందరికీ చిరపరిచితమే. వారి ఎన్నెం కతల్లో ఒక చీకటి కోణాన్ని విష్కరిస్తున్నారు

ఊసుపోక – దీపాలార్పు దినం

(ఎన్నెం కతలు 9)

హైదరాబాదులో జూన్ 15న దీపాలార్పుకోండని జనులకి జనులు తాఖీదులిచ్చుకుంటున్నారు. ఇది ఎవరికి వారే ఆర్పుకునే దీపం కనక తప్పులేదు సరికదా ఒప్పూ, మెప్పూను. ఎలా అంటారా, ఓపూట భోజనం మానేసినట్టే ఓగంటసేపు దేశం మొత్తం దీపాలుపవాసం వుంటే, మీపిల్లల భవిష్యత్తుకీ, ఆరోగ్యానికీ మంచిది. మీబిల్లులో ఆదా. ఒక్కో ఇంటికి విడివిడిగాగా కనిపించకపోవచ్చు కానీ మొత్తం లాభం చూస్తే విస్మయపోతారు మీరే.

చెప్పడం సుళువే కాని చెయ్యడంలోనే తిప్పలన్నీ .. నేనూ ఒప్పుకుంటాను. అంతెందుకూ, తిండి మానేసిన రోజున చూడండీ – ఆరోజే పొరిగింట్లో భారీ ఎత్తు వంటకాల మషాలాల ఘుమఘుమలు మూడిళ్లవతలికి విస్తరిస్తాయి. “ఊరికే చూడాలనిపించింది, నీకిష్టం కదా అని పూర్ణంబూరెలు తీసుకొచ్చాను” అంటూ సాక్షాత్కరిస్తారు అమ్మమ్మగారు బూరెలబుట్టతో. సరిగ్గా అప్పుడే వంటా-వార్పుల ఛానెల్లో నోరూరించే వంటకాలు పరిచయం చేయబడతాయి. జ్యోతిగారు పుణుకులు విసురుతారు నసాళానికంటేలా.

ఆఁ అన్నట్టు విద్యుత్ వాడకంగురించి కదూ మొదలెట్టేను. మనం ఈవిద్యుత్తు శక్తిని మంచినీళ్లలా వాడి పారేస్తున్నాం. (హైదరాబాదు చెన్నై లాంటి నగరాల్లో కొంచెం మంచినీళ్ళే ఇంకా పొదుపుగా వాడుతారేమో!) తాగుడు తరవాత అంతటి వ్యసనం అయిపోయింది ఇదేనేమో. లేక ఇదే ఫస్టూ, తాగుడు రెండోదీనేమో కూడా.

ఎలెట్రీ దీపాలు లేని వూళ్లో నేను ఒకయేడు గడిపేను నా హైస్కూలు రోజుల్లో. ఇప్పుడు ఎలెక్ట్రిక్ దీపాలు లేని పల్లె లేదేమో నాకు తెలీదు కానీ నామటుకు నాకు ఈ మాయవెలుగు అంటే ఇప్పటికీ చిరాకే. మాయింట్లో ఎనిమిది గంటల తరవాత దీపం వుండదు, ఇంటికెవరైనా వస్తే తప్ప. కారు వీధికెక్కడం కూడా తక్కువే. వారానికోమారు బజారు, రెండో మూడో నెలలకోమారు లైబ్రరీ. అంతే. ఇదివరకు కార్లో నాలుగు టేపులు పడేసుకుని పల్లె దారులంట రెండుగంటలసేపు తిరిగేదాన్ని కాని ఇప్పుడు అలా వెళ్లడం లేదు. ఇంతకంటె నేను చెయ్యగల పొదుపు ఏంవుందీ? మీకెవరికీ జీవితం ఇంత నిస్సారం కాదని ఒప్పేసుకుంటాను. కానీ …

సమస్త ప్రపంచానికీ నేను గట్టిగా చెప్పుకోవలనుకున్నది ఒకటుంది. నాకు మహచిరాకు కలిగించే బాధ ప్రకటనలపేరుతో వచ్చే చెత్త. ముఖ్యంగా మూడుమణుగుల ఎత్తుగల టెలిఫోనుబుక్కులు. ఇందులో గ్లోబల్ వార్మింగేముంది అనకండి. అడవిలో చెట్లు మాగుమ్మంలో చెత్తగా అవతరించడానికి చాల ప్రాసెసింగ్‌ వుంది. దానికి బోలెడు ఎనెర్జీ ఖర్చవుతుంది. ఆకంపెనీలవారు ప్రతి వాకిటా వదిలేసే బుక్కులు ఎన్ని నేరుగా చెత్తబుట్టలోకి వెళ్లిపోతున్నాయో చూసుకుంటే, వారే సిగ్గుపడాలి. దానికి ఎంత ఎనర్జీ, ఎండ్ నేచురల్ రిసోర్సులు తగలేస్తున్నారో! పూర్వం పాతకాగితాలు పకోడీలు పొట్లాలు కట్టుకోడానకీ, పొయ్యి అంటించుకోడానికీ వాడేవాళ్లం. ఇప్పుడు అమెరికాలో రిసైకిలింగు అంటారు కానీ అది కూడా ఓ వ్యాపారమే. నిజంగా దానివల్ల ఎంత ఆదా, ఎవరికి ఆదాయం అన్నవిషయం మీద చర్చలు ఇంకా జరుగుతూనే వున్నాయి.

నేనిలా అన్నానని మరోలా అనుకోకండి. ఈయేడాదికోమారు “తత్‌దినాలు” బాగానే వున్నాయి. అయితే ఈసింబాలిక్ దినాలతో ఆపేయక, మన రోజువారీ పనుల్లో ఏది తగ్గించుకోగలం అన్న దృష్టి అలవర్చుకుంటే ఫలప్రదం. టీవీ, కంప్యూటరూ, బద్ధకించో మళ్లీ ఇటొస్తాను కదా అనో ఆర్పేయని దీపాలూ, , … చూడండి ఎక్కడ వృథా అవుతోందో, ఎక్కడ కాస్త కట్ చేసుకుని మొత్తం లోకానికే మేలు చెయ్యగలరో…

చుక్క చుక్క నీరు చెరువు నిండు
రెప్పపాటు తరుగు రేపటి వెలుగు.

—-

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: