• Categories

  • Blog Stats

    • 9,939 hits
  • Advertisements

చీకటిలోనే వెన్నెల వెలుగులు

హలో హలో హలో. మీ అందరికి సుపరిచితురాలినే నా బ్లాగు ద్వారా. నా బ్లాగు పేరు మనలో మన మాట, నా మనసులో మాట.  నా పేరు రమణి .

ఎప్పటికప్పుడు ఏదో చెప్పాలి, చెప్పాలి అని టపాలు రాసేస్తూ ఉంటాను కాని, ఏమి చెప్పలేకపొతున్నాను అనే అనిపిస్తుంది, అదిగో అందుకే అలా గుండే గొంతుకలోన కొట్టాడుతోంది, గొంతు దాటి అది రానంటోంది అనుకొంటూ ఉంటాను. ఈమధ్యె నా బ్లాగు 365 రోజులు పూర్తి చేసుకొన్న సంధర్భంగా నన్ను ప్రొత్సహించిన, సహకరించిన  అందరికి ధన్యవాదాలు చెప్పి కొంత విరామం తీసుకొందాము అని అనుకొంటున్న  సమయంలో, అదృష్టం నా బ్లాగు తలుపు తట్టింది.

“దురదృష్టం వెన్నంటే ఉంటుందిట, అదృష్టం అప్పుడప్పుడు అవకాశమిస్తుందిట”.

మరి ఆ అదృష్టం ఇచ్చిన అవకాశం ద్వారా, అక్కడ నా బ్లాగులో తంతే ఇక్కడ ఈ బత్తిబందులో  పడ్డాను. మరి మీరు ఓ సారి అటువైపు వస్తారా,  కాసేపు మాట్లాడేసుకొందాము. 

చీకటిలోనే వెన్నెల వెలుగులు

వచ్చేసారా! చెప్పానుగా,  అదృష్టం నా తలుపు తట్టగానే ఇదిగో ఇక్కడొకొచ్చి పడ్డాను అని. చూస్తే ఏముంది ఇక్కడ?
అంతా కారు చీకటి
చీకటిలోనే చీకటి.

ఏంటిది, నేనేమి చెయ్యాలి అని చుట్టూ చూసాను. ఏమి కనపడలేదు.

కాసేపు ఆగి నా కళ్ళు కాస్త చీకటి కి అలవాటు పడ్డాక, మళ్ళీ చూసాను – అప్పుడు వెలిగింది నా బుర్రలో కొవ్వొత్తి – ఇది బత్తీ బంద్ బ్లాగు కదా, అందుకే .. విద్యుద్దీపాలన్నీ ఆర్పేశారన్న మాట.

వెంటనే గుర్తొచ్చింది, టి.వి 9 లో ఆ మధ్య గ్లోబల్  వార్మింగ్ గురించి చెప్తూ 1 గంట విద్యుత్ కి సంభందించిన ఏ పరికరాల్ని ఉపయోగించకుండా ఉంటే మరి మన పుడమి తల్లిని కాపాడుకోగలమట. ఎంతయినా మనల్ని కన్న ఈ అవని గురించి ఆమాత్రం శ్రద్ధ తీసుకోపోతే ఎలా అనిపించింది.

మీరు రండి! నాతో పాటు, నేను సైతం అని ఓ అడుగు ముందుకి వేసి, రోజు ఓ గంట విధ్యుత్ వాడకాన్ని నిలిపివేద్దాము. “పుణ్య భూమి ఈ భూగోళం నమో నమామి, ధన్య మైన నా భూమాత సదా స్మరామి” అని గర్వంగా చెప్పుకోవాలంటే, ఈ బత్తిబంద్ కి మనందరం చేతులు కలుపుదాము, నడుములు బిగిద్దాము.

“అంచెలంచేలు లేని మోక్షం చాలా కష్టం భామిని,
కష్టమైనా ఇష్టమేనని కోరి ఆర్పితి చినముని.”

నిజమే మనకి మోక్షం కావాలి, అంచెలంచేలు గా ఎదగాలి, ఎదుగుదలకి మనకి సాంకేతిక పరికరాలు కావాలి, మన పెద్దవాళ్ళకి టి.వి లు కావాలి, కాని మన కష్టాలు కూడా అవే, కరెంటు, రెంటు, ఎక్సెట్రా  మన కష్టాలు. 

వీటీన్నిటికి ఒక్కటే మార్గం – కష్టమైనా, ఇష్టంగా కోరి చేయగలగాలి మనము.

మనము చెయడమే కాక నలుగురికి చెప్పాలి, ఒక్క గంట విద్యుత్ పరికారలు ఏవి వాడవద్దని, లైట్స్ తో  సహా. 

దీని వల్ల సామాజికంగానే కాక, వ్యక్తిగతంగా కూడా చాలా ప్రయోజనాలున్నాయి. టి వి సీరియల్స్ ఎడతెరిపి లేకుండా చూడడం వల్ల వచ్చే శారీరక, మానసిక బాధలనుండి ఉపశమనం పొందవచ్చు.
ఇహ! బార్య భర్తలయితే  హాయిగా  వెన్నెలలోనే వేడిమెలనో, వేడిమిలోనే చల్లనేలనో అని, నిండు జాబిల్లి సాక్షిగా ఊసులాడుకొవచ్చు. దీనివల్ల వారిరువురి అనుభందం ఇంకాస్త గట్టిపడే అవకాశం ఉంది(మొన్నీమధ్యే అనుకొంట ఏదో పేపర్లో న్యూస్ చదివాను, ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ అయిన బార్య భర్త లిరువురికి అసలు మాట్లాడుకోడానికి కూడా సమయం చిక్కడం లేదు, ఇంట్లో కూడా కంప్యూటర్ పని, లేదా టి వి సీరియల్స్)

సో!  మనకై మనము ఇంటి ఫ్యూజ్  ఓ గంట పాటు పీకేస్తే .. ఆలోచన బాగుంది కదా.

ష్!  బ్రహ్మండమైనా రోటి పచ్చడులు, గట్రా కూడా చేసుకోవచ్చు. ఎమంటారు? మరి ఇక ఆలస్యమెందుకు?

పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం, పోదాం  ఓ గంట విద్యుత్ పరికారాలు నిలపడానికి .. 

ఇట్లు
మీ
రమణి

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: