ఎందుకు బత్తీబంద్

గ్లోబల్ వార్మింగ్ ప్రమాదాన్ని గురించీ, ఇంధనాల కొరత గురించీ సాధారణ ప్రజల్లో ఆలోచన రగిలించి అవగాహన పెంపొందించడానికి మొదలైన ఉద్యమం ఇది.

మనందరం పట్టించుకోవాలి.

ప్రతి ఒక్కరమూ కొంచెమైనా దీన్ని గురించి ఆలోచించాలి.

వీరు వారని లేక, చేతనైనంత మేరకు కార్యాచరణకి పూనుకోవాలి.

ఇలా ఒక రోజు ఒక్క గంట లైట్లార్పి ఏం సాధిస్తాం?

లైట్లు ఆర్పడం, లేదా విద్యుత్ వాడకుండా ఉండటం ఉద్యమానికి ఒక ప్రతీక మాత్రమే.

It is symbolic.

ఈ చర్య ద్వారా సాధారణ ప్రజల దృష్టిని ఈ సమస్య మీదికి తిప్పడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
నిన్నటికి నిన్న అసలు ఇలాంటీ సమస్య ఒకటి ఉన్నదనే ఎరుగని వారు ఒక పది మందైనా ఈ రోజున దీన్ని సమస్యగా గుర్తిస్తే మా ధ్యేయం నెరవేరినట్టే.

అలాగని విద్యుత్ వాడకం మీదా, పర్యావరణం మీదా దీని ప్రభావం మరీ అంత తీసి పారెయ్య వలసింది కాదు.

కొన్ని లెక్కలు

ఒక 100W బల్బు ఒక గంట వెలిగితే వాడిన విద్యుత్ 100 వాట్-అవర్లు.
ఇటువంటి బల్బులు ఒక పది వెలిగితే వాడిన విద్యుత్ 1000 వాట్-అవర్లు, లేదా 1 కిలో వాట్ అవర్.
దీన్నే మనం ముద్దుగా 1 యూనిట్ అని పిల్చుకుంటాం. మనం కరంటు బిల్లులు కట్టేప్పుడూ ఆ నెలకి ఎన్ని యూనిట్లు వాడాం అన్న లెక్కని బట్టి ముడుపు చెల్లిస్తాం.
విద్యుత్తుని వాడే మిగతా పరికరాల సంగతి పక్కన పెట్టండి.
సాయంత్రం 7 – 8 మధ్యలో, ఇల్లాళ్ళకి వంటలు చేసుకునే సమయం, విద్యార్ధులకి చదువుల సమయం – ఇలా ఒక సగటు మధ్య తరగతి ఇంట్లో కనీసం 4 లైట్లు వెలుగుతుంటాయి అనుకోవచ్చు.
మాట వరసకి ఒక లక్ష కుటుంబాలు ఒక గంట సేపు తమ ఇళ్ళల్లో లైట్లు ఆర్పేశారు అనుకుందాం.
100x4x100000 (/) 1000 = 40,000 యూనిట్ల విద్యుత్ ఆదా.
ఒక కిలో వాట్టు (kW) విద్యుత్ ఉత్పత్తికి సగటున 0.66 కిలోల కార్బన్ డయాక్సైడు వాయువు వాతావరణంలో తయారవుతోందని అంచనా.
అంటే ..
40000kW x 0.66 kg/kW = 26,363 kg
26 వేల కిలోల కార్బన్ డయాక్సైడు వాయువు కొత్తగా వాతావరణంలోకి ప్రవేశించకుండా ఆపగలిగామన్న మాట .. ఇది ఒక లక్ష కుటుంబాలు ఒక్క గంట సేపు లైట్లు వెయ్యకుండా ఉంటే.
హైదరాబాదు నగరంలో ఎన్ని లక్షల కుటుంబాలున్నాయి?
రాష్ట్రం మొత్తమ్మీద ఎన్ని లక్షల కుటుంబాలున్నాయి?
వీళ్లందరూ ఒక్క గంట సేపు స్వఛ్ఛందంగా విద్యుత్ వాడకుండా ఉంటే?

ఆలోచించండి!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: