• Categories

 • Blog Stats

  • 9,939 hits
 • Advertisements

రాబోతున్న ఎనర్జీ కొరత

(ఆచార్య కట్టా గోపాలకృష్ణమూర్తిగారు మిషిగన్‌ విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆపరేషన్స్ రీసెర్చి ఆచార్యులు, ఆ సబ్జక్టుపై ఎన్నో పుస్తకాలు రాశారు. తెలుగు భాషన్నా, సాహిత్యమన్నా ఎంతో మక్కువ. తీరిక వేళల్లో పర్యావరణాన్ని గురించీ, ముఖ్యంగా ఎనర్జీ వాడకాన్ని గురించీ విశ్లేషణలు చేస్తుంటారు. కోరిన వెంటనే మన్నించి ఈ వ్యాసాన్ని అందించిన వారికి బత్తీబంద్ బృందం తరపున ధన్యవాదాలు విన్నవించుకుంటున్నాము.)
బొగ్గు, క్రూడ్ ఆయిలు, నేచురల్ గాసులను ఫాసిల్ ఫ్యూయల్సు అంటారు. గత 4 బిలియన్ల సంవత్సరాలకాలంలో వృక్షజాతులు  వీటిని చాలా పెద్ద మొత్తాలలో తయారుచేశి భూమి లోపల గుప్తంగా దాచిపెట్టి ఉంచాయి. మానవుడు వీటిని చూచినప్పటినుంచీ తన జీవిత  సౌఖ్యానికీ, తన జనాభా పెంచుకోడానికీ  వాడడం మొదలుపెట్టాడు.
 
 బొగ్గు వాడకం బహుశా 120,000 సంవత్సరాల క్రితమే స్టొను ఏజిలో మొదలయ్యి ఉండవచ్చని తెలుస్తోంది. డ్రిల్లు చేసీ పంపుచేసిన క్రూడాయిలు వాడకం 1850-ల్లో మొదలయ్యింది, నేచురల్ గాసు వాడకంకూడా సుమారు అప్పుడే మొదలయ్యింది.
 
ఇప్పుడు మానవ జనాభా సుమారు 7 బిలియన్లు. ఫాసిల్ ఫ్యూయల్సన్నిటినీ చాలా విరివిగా మన జీవన విధానానికి అవసరమైన ఎనర్జీనివ్వడానికి వాడేస్తున్నాం ఇప్పుడు. ప్రపంచమంతటా కలిపి 6.2 బిలియన్ టన్నుల బొగ్గూ, 32 బిలియన్ పీపాల క్రూడ్ ఆయిలూ, 20 మిలియన్ పీపాల క్రూడ్ ఆయిల్ కి  సరితూగే నేచురల్ గాసూ ప్రతి సంవత్సరం కాల్చేస్తున్నాం. వృక్షజాతులకు తయారుచెయ్యడానికి ఎన్నో మిలియన్ల సంవత్సరాలు పట్టిన ఈ గుప్తసంపద, ఇలానే వాడుతుంటే, ఇంకొక 200 సంవత్సరాలలో పూర్తిగా అడుగంటి పోతుంది. అంతకాలం ఆగఖ్ఖర్లేదు, ఇంకొక 40 సంవత్సరాలలోపే మనకు చాలా క్లిష్టమైన ఎనర్జీ కొరత ఏర్పడుతుంది.  
 
రాబోయే ఈ ఎనర్జీ కొరత తీర్చడానికి క్రింది పద్ధతులమీద రిసెర్చి ఉధృతంగా జరుగుతోంది.  
 
1. బయోఫ్యూయల్సు: మొక్కజొన్నలూ (కార్ను), వాటి కండెలూ; మేపాళం మొక్క గింజలూ;  చెరుకు రసం;  కొన్ని రకాల గడ్డి; మొదలైన వాటినుంచి బయో డీసెల్ మొదలైన ఫ్యూయల్సు చెయ్యడం. ఇవిచేశే కంపనీలు ఇప్పుడే చాలా వెలిశాయి. ఈ కంపెనీలు తెరిచాక, వాటి ఫలితంగా, మొక్కజొన్నలూ, గోధుమా మొదలైన ధాన్యాల ధరలు చాలా పెరిగిపోయాయి. నా అభిప్రాయంలో, ఈ బయోఫ్యూయల్సు మన ఎనర్జీ కొరతను తీర్చలేవు, ఇంత పెద్ద జనాభా ఇప్పటిరీతిలో నివసించడానికి కావల్సిన పరిమాణంలో తయారు చెయ్యలేవు. కారణమేమిటంటే,  అంత ఎనర్జీ బయోఫ్యూయల్సుతో తయారు చెయ్యడానికి వ్యవసాయ భూభాగాన్నంతా వీటి సాగుకు వాడాలి. అప్పుడు తిండికి కొరత ఏర్పడుతుంది. తిండి పెంచడానికి భూమి, నీరు ఎక్కడనుంచి తెస్తాము?  
 
2. సూర్యరశ్మి: సోలార్ కలెక్టర్లతో సూర్యరశ్మినుంచి విద్యుత్ పుట్టించడం. ఇలాంటివి ఇప్పుడే చాలా ఉన్నాయి. కానీ సోలర్ కలెక్టర్లతో మనం ఇప్పుడు వాడుతున్నంత  ఎనర్జీ ఉత్పత్తి చెయ్యడానికి చాలా భూమిని కలెక్టర్లతో నింపెయ్యాలి. పైలాగానే భూభాగం కొరత సమస్య వస్తుంది. చెట్లకూ, అడవులకూ ఏమీ మిగలదు. 
 
3. న్యూక్లియర్ ఎనర్జీ: ఇప్పుడే ఈ టెక్నాలజీ బాగా అభివృద్ధిలోకి వచ్చింది, అప్పుడే చాలా ప్లాంట్లు ఉన్నాయి. కానీ ఫిషన్ ప్లాంట్లతో అంత ఎనర్జీ చెయ్యాలంటే, దానివల్ల ఉద్భవించే పొలూషన్ (వాడేసిన న్యూక్లియర్ చెత్త) పెట్టడానికి చోటు ఉండదు. 

ఫ్యూజన్ నూక్లియర్ ఎనర్జీ ఇంకొక రకంది. దీనిమీద చాలా వ్యయంతో ఉధృతంగా రిసెర్చి జరుగుతోంది. ఆ రిసెర్చి సఫలమైతే దీనితో ఎనర్జీ ఉత్పత్తి చెయ్యవచ్చునేమో? కానీ ఇంతవరకూ ఫ్యూజన్ ని ఎవరూ కంట్రోల్ చెయ్యలేకపొయ్యారు. అది చేశాకగానీ దానివల్ల వచ్చే పొల్యూషన్ ని గురించి తెలియదు. 
 
4. జియో ధర్మల్: భూమిలోపల తగిలే వేడితో  పవరు ఉత్పత్తి చెయ్యడం. కొన్ని ప్రాంతాల్లో ఈ వేడి తక్కువ లోతులోనే తగుల్తుంది. ఐసులాండు లాంటి చిన్నదేశాలు, ఇప్పుడే జియో ధర్మల్ ఎనర్జీ మీద ఆధారపడి హాయిగా నివసిస్తున్నాయి. కానీ ఆ అదృష్టం అన్నిచోట్లా ఉన్నట్లు లేదు. దీన్ని వాడి మనందరికీ కావలిసినంత ఎనర్జీ చెయ్యగలమని ఎవరూ అంచనా వెయ్య లేదు.  
 
5. సముద్ర కెరటాలు: వీటినుంచి ఎనర్జీ తీశే యంత్రాలు తయారు అవుతున్నాయి. పది సంవత్సరాల్లో, ఇవి ప్రపంచమంతటా సముద్రతీరపు ప్రకృతి సౌందర్యాన్ని తినేస్తాయి చూసుకోండి. కానీ దీని వల్ల వచ్చే ఎనర్జీ మన కొరతలో చిన్ని భాగాం కంటే ఎక్కువ తీర్చలేవు.
 
6. విండు ఎనర్జీ: ఇప్పటికే చాలాచోట్ల వెలశాయి ఇవి. కానీ ఇవి కొరతలో చిన్ని భాగాన్నే తీర్చ గలవు.
 
7. హైడ్రోజన్, ఫ్యూయల్ సెల్సు: తరచూ పెపర్లలో వీటిని గురించి చదివి ఉంటారు. భూమి మీద హైడ్రొజన్ సహజంగా లభించదు. ఇంకొక పద్ధతితో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేశి, దానితో నీటిని చేదించి హైడ్రొజన్ తయారు చెయ్యాలి. ప్యూయల్ సెల్లు అనేది ఇలా తయారైన హైడ్రొజన్ ఇంధనంగా కార్లు, బస్సులూ, విమానాలూ నడపడానికి వాడగల పరికరం.

మేధమాటిక్సులో కొన్ని ప్రాబ్లంసుకు సొల్యూషన్లు ఉండవు అని ఋజువు చెయ్యవచ్చు. రాబోయే ఎనర్జీ కొరత కూడా అలాంటిదే అని నాకు గట్టి అభిప్రాయం కల్గుతోంది. “భూమి మీద 7 బిలియల్ల మనుషుయులు ఇప్పటి రీతి జీవితం గడపడానికి అవసరమైన ఎనర్జీ, ఫాసిల్ ఫ్యూయల్సు అయిపొయ్యాక, మనం ఎంత రిసెర్చి చేసినా లభించదు” అని నేను అనుకుంటున్నాను.
 
ఈ విషయం నా స్నేహితులకు చెబితే వాళ్ళంతా “మూర్తీ, ఇంతవరకూ మానవ జనాభా పెరుగుదలకూ, మానవ సౌఖ్యానికీ ఎన్నో అడ్డంకులు వచ్చాయిగదా. ప్రతిసారీ మానవుడు తన వివేకంతో అంతకుముందు ఊహించనలవికాని విధంగా వాటిని అధిగ మించగలిగాడు గదా. ఈ ఎనర్జీ కొరత అడ్డంకినికూడా అలానే తన వివేకంతో పారద్రోలి తన జనాభానీ, సుఖాన్నీ పెంపోందించగలడని అనుకోడానికి గట్టి  సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు ఏమీ వర్రీ అవమాక” అంటూ నన్ను మందలిస్తుంటారు.
 
కట్టా మూర్తి.

Advertisements

6 Responses

 1. ఆచార్య మూర్తి గారితో ఏకిభవించడం కష్టం, వారి మిత్రులతో ఏకిభవించడం సులభం. మీరు పెట్టిన టైటిల్ పక్కనే ఉన్న సీ.ఎఫ్.ఎల్ లాంపులు వరకు ఎదిగిన మానవుడు రాపిడితో వెలుతురుని తన చీకటిని పారద్రోలడానికి కనుగొన్నాడు. ఆశావాది.
  ఆశ లేనిదే జీవి లేడు కదా.
  కాని క్లుప్తంగా, సూక్షంగా నైనా సరే ఎనర్జి – దాని కోసం దేశదేశాలు చేస్తున్న ప్రయోగాత్మకమైన రిసర్చ్ వాటి ప్రక్రియలు – పరిణామాలు ఈ చిన్ని వ్యాసంలో చక్కగా విశదీకరించారు. అందుకు వారికి ధన్యవాదలు తెలియజేయగలరు.
  “బత్తీబంద్” గురించి తెలుయజేయగలరు.

 2. బయో ఫ్యూయెల్సు : ప్రస్తుతం వ్యవసాయానికి అణువైన భూమిలో అత్యధిక శాతం భూమిని మనం సరిగా ఉపయోగించుకోవట్లేదు. ఉత్పాదకతలో కేవలం 40% మాత్రమే ఉపయోగించుకొంటున్నాం అన్నమాట. అంటే, ఎకరా భూమికి అమెరికాలో వచ్చే దిగుబడిలో కేవలం సగం మాత్రమే మనం తెచ్చుకోగలుగుతున్నాం భారతదేశంలో. ఆఫ్రికా ఖండంలో దీనికి మరింత తక్కువ. వీటికి కారణాలు పదివేలు. ముఖ్య కారణం వ్యవసాయ రంగంలో సరైన పెట్టుబడి పెట్టకపోవడం. వ్యవసాయ ఉత్పత్తులు పశ్చిమ దేశాలకు ఎగుమతిచేసే అవకాశం లేకపోవడం.

  వ్యవసాయంలో పెట్టుబడులు బాగా పెరిగితే, ప్రపంచంలో జనాలకి సరిపడా ఆహారమే కాక, 20% అవసరాలు తీర్చగలిగే ఇంధనం కూడా బయో ఫ్యూయెల్స్ తో తెచ్చుకోగలం.

  న్యూక్లియర్ ఎనర్జీ : మన భూమిలో నిక్షిప్తమైన న్యూక్లియర్ ఎనర్జీ ఖనిజాల నిల్వలు 2500 ZJ (జిలియన్ జౌల్సు) . అదే బొగ్గు, పెట్రోలు నిల్వలు కేవలం 300 జిలియన్ జౌల్సు. న్యూక్లియర్ ఎనర్జీ వల్ల రాబోయే 1000 సంవత్సరాలకు సరిపడా ఇంధనం మన దగ్గరనే ఉంది. ఈ సమయంలోగా మన శాస్త్రవేత్తలు ఖచ్చితంగా ఒక మార్గం కనిపెడతారు.

  ఇంధన ఉత్పత్తిలో విడుదలయ్యే న్యూక్లియర్ చెత్త ప్రమాదకరమైనదే. కానీ, శాస్త్రబద్ధంగా దీనిని నిల్వ చేసేందుకు బోలెడు పద్ధతులు ఉన్నాయి ఇప్పటికే. ఒకప్పుడు, న్యూక్లియర్ ఎనర్జీ ఫ్యాక్టరీలు చాలా ప్రమాదంతో కూడి ఉండేవి (చెర్నోబిల్) ప్రస్తుతం ఇవి చాలా ఇంప్రూవు అయ్యాయి.

  దీనిని బట్టి, మనం ఇంధన కొరత గురించి మరీ భయపడనవసరం లేదు. నా బ్లాగులో ఈ విషయం పై మరింత వివరంగా టపా రాస్తాను. చదివి సూచనలు రాయండి.

 3. 🙂

 4. మూర్తి గారు : ఒకదానికొకటి complement గా అనిపించే ఈ రోజే ప్రచురించబడిన కిరణ్ గారి బ్లాగ్ లో ఉన్న

  ఇంధన భవిష్యత్తు

  లంకెను చూడండి.

 5. ఎంత చక్కని వ్యాసం. ఎంతో బాగా చెప్పారు. నాకు మాత్రం మనం వ్యక్తిగతంగా ప్రకృతి నియమాలు పాటిస్తూ ప్రకృతికి అణుగుణంగా జీవిస్తూ ఉంటే కొంతలో కొంత నయం అని అనిపిస్తుంది. మన చేతిలో ఉన్నదేదో అది చేయడం మొదలుపెడితే, భవిష్యత్తుని కాపాడుకోవడం చేయిదాటిపోదు అనే నమ్ముతున్నాను.

  త్వరలో నాకు ఎంతో నచ్చిన గాలోస్ అనే ఆంగ్ల కవితని ‘అలై పొంగెరా’ విభాగంలో ఉంచుతాను. తెలుగులోకి స్వేఛ్ఛానువాదం చేయడానికి ప్రయత్నిస్తాను. వీలు కానీ పక్షంలో అర్థం వ్రాస్తాను.

 6. నెటిజన్ గారు,

  బత్తీ బంద్ గురించి ఈ బ్లాగు మొద(ఇం)టి పేజీలోనే ఉంది చూడండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: