Posted on May 30, 2008 by battibandh
మానస వీణని శ్రుతి చేసి మధురరాగాలు పలికిస్తూ అనంత సౌరభాలు వెదజల్లే నిషిగంధ ఈ గ్లోబోళ జంభపై తనదైన శైలిలో యుద్ధం ప్రకటిస్తున్నారు చూడండి.
*** *** ***
అదొక బద్దకపు వారాంతపు సాయంకాలం..
చెయ్యాల్సిన పనులెన్నో ఉన్నా .. అసలు ఉండాల్సిన మూడ్ లేక, లాప్ టాప్ ముందేసుకుని యూట్యూబ్ లో ఏవేవో పాటల కోసం వెతుకుతున్నా..
అనుకోకుండా నాకు చాలా ఇష్టమైన ‘అమృత’ తమిళ్ సినిమాలో సత్తెన [...]
Filed under: అతిథి, అలై పొంగెరా, నేను సైతం మన కోసం | 9 Comments »
Posted on May 20, 2008 by battibandh
కేంద్రపాలిత ప్రాంతం యానాం నించి ఈ మధ్యనే బ్లాగువనంలో తనకవితా గళం విప్పిన కోకిల బొల్లోజు అహ్మదలీ బాబా గారు .. ఈ అవని ఏమన్నదో వినమంటున్నారు.
అవని ఏమంది?
చిల్లులు పడిన ఒజోను దుప్పటిని కప్పుకుని
పీలికలైన పచ్చని చీరను చుట్టుకొని
నీళ్లలో తడిచి ఒరిసి పోయిన పాదాలతో
తీవ్రమైన జ్వరంతో వణుకుతున్న
అవని ఏమంది?
కుచించుకుపోతున్న అడవులు
వాహనాలు వెదచిమ్ముతున్న విషాలు
ఎడారులయ్యే పంటభూములు
తీరాలను ముంచెత్తే సాగరాలు
వ్రణాలు పడుతున్న పర్యావరణం…….
బిడ్డా ……. కళ్లుతెరు…. కళ్లుతెరు అంది.
అవని ఏమంది?
సూర్య, పవన, జలశక్తులను మచ్చిక చేసుకొని
రాక్షసబొగ్గు రాక్షసత్వానికి [...]
Filed under: అతిథి, అలై పొంగెరా | 3 Comments »
Posted on April 8, 2008 by battibandh
(తన కథని ఈ బత్తీ బంద్ కి చెందిన బ్లాగులో ఉంచేందుకు అనుమతినిచ్చిన చావా కిరణ్ గారికి కృతజ్ణ్జతలు:)
టైం: అద్దమ రేయి పదకొండు గంటల నలబై అయిదు నిమిషాలు: జూన్ ఇరవై అయిదు: యుద్ధం తరువాత నూటనలబయ్యో సంవత్సరం
మరొక్కసారి డిజీగ్రాఫ్ చూసుకున్నాడు. తనకు ఈ థీమ్ బాగా నచ్చినది.
రేపే చివరి రోజు ఈ అసైన్మెంటు సబ్మిట్ చేయడానికి. మరొకసారి చదవసాగినాడు.
== మానవీయ కోణంలో సాంకేతికాభివృద్ధి. ==
సాంకేతికాభివృద్ధి మొదటి నుండి పొగడ్తలు, విమర్శలు సమానంగా అనుభవించినది తిట్టేవాళ్ళు మొదటి [...]
Filed under: అలై పొంగెరా | Leave a Comment »
Posted on March 31, 2008 by battibandh
కరెంటు కోత కరెంటు కోత అని వెతలు పడిపోతారు
కల్లబొల్లి కబురులెన్నో చెప్తారు
నాకు మాత్రం కరెంటు కోత
కావాలి రోజూ ఓ పూట
ప్రకృతి చెప్పే సంగతులన్నీ
వినగలిగేది ఈ ప్రశాంత సాయంసంధ్యలోనే
Filed under: అలై పొంగెరా | Leave a Comment »