గ్లోబల్ వార్మింగ్ – మన వంతు కృషిగా ఏమి చేస్తే బాగుంటది?

జోరుగా హుషారుగా ఈలేసుకుంటూ ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో నగర వీధుల్ని కొలుస్తున్న శ్రీకాంత్ ఒక్క నిమిషం ఆగి ఏంటి ఈ గ్లోబల్ వార్మింగ్ గొడవ అని ఆలోచనలో పడ్డారు.
***

గ్లోబల్ వార్మింగ్ గురించి ఏమి చెప్పాలా అని అలోచిస్తున్నాను.

అసలు గ్లోబల్ వార్మింగ్ అంటె ఏమిటి? దాని వల్ల మనకి జరిగే నష్టం ఏమిటి? మన వంతు కృషిగా ఏమి చేస్తే బాగుంటది?

౧. గ్లోబల్ వార్మింగ్ పదంలోనే అర్థం ఉంది. అసలు ఏమి జరుగుతుందంటే, మన భూమి ఉపరితళం మీద సామాన్య ఉష్ణోగ్రతలు మెల్లగా పెరుగుతున్నాయి. మన సుఖం కోసం మనం కనుక్కున్న కార్లు , ఫ్రిజ్జులు వగైరాలు వదిలే విష వాయువుల వల్ల మన వాతావరణం అంతా కలుషితమయ్యింది. అవి కాక మన పరిశ్రమలు వదిలే అనవసరపు వాయువులు కూడా దీనికి కారణం.

౨. ఉష్ణోగ్రతలు పెరిగితే అసలేమవుతుంది? అది కరెక్ట్ గా చెప్పలేము. ఏన్నొ జరగవచ్చు. ఉపరితలం లో ఉష్ణము ఎక్కువయ్యి ఉత్తర దక్షిణ ద్రువాలలొ మంచు కరిగి, సముద్ర మట్టం పెరిగి ఉన్న భూమంతా నీళ్ళ మయం అవ్వవచ్చు. లేదా, ఉష్ణము పెరిగి నీరంతా ఆవిరైపోయి తీవ్ర క్షామం ఏర్పడవచ్చు. ఏది జరిగినా మానవ జాతికి బాగా నష్టం వాటిల్లుతుంది. చాలా ప్రాణికోటి అంతరించిపోతుంది. భావి తరాలు పురోగమనానికి మనం ఎంతగానో అడ్డు పడుతున్నాం.

౩. మన వంతు కృషిగా ఏమిచెయ్యొచ్చో ఆలోచిస్తే, గ్లోబల్ వార్మింగ్ కి ముఖ్య కారణం ప్రయాణ సాధనాలని నేననుకుంటాను. ౧-౨ కిలోమీటర్ల దూరంలో ఉంటె ఎంచక్కా నడిచి వెళ్ళొచ్చు కదా!! ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. కాలుష్యము తగ్గుతుంది. ఇంక కాస్త ఎక్కువ దూరాలకయితె ఎంచక్కా సైకిల్ మీద వెళ్ళొచ్చు. మళ్ళి ఆరోగ్యం. ప్రపంచంలో చాలా మంది అధిక బరువుతో భాద పడుతున్నారు. వాళ్ళకి ఈ సలహా సూపర్ గా పని చేస్తుంది.

విద్యుచ్చక్తి తయారిలో కూడా చాలా కాలుష్యం ఉంది. అదే విద్యుత్ ఆదా చేసామనుకోండి, డబ్బుకి డబ్బు మిగులుతుంది. ప్రపంచానికి మంచి చేసిన వాళ్ళమవుతాము. అనవసరంగా ఆలస్యంగా పడుకోని లేటుగా లెగవడం కంటె, త్వరగా పడుకొని త్వరగా లేచామంటె ఎంత విద్యుత్ ఆదా అవుతుంది. వెలుతురులోనె అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. ఇంకా ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నొ పనుల వలన విద్యుత్ ఆదా చెయ్యవచ్చు.

2 Responses

  1. చాలా బాగుందండీ శ్రీకాంత్ గారు , గ్లోబల్ వార్మింగ్ గురించి మనమేమి చెయ్యాలో చెప్తూ, చక్కటి ఆరోగ్య సూత్రాలని కూడా చెప్పారు.

  2. చెప్పిన సలహాలు చాలా చిన్నవి, తప్పక ఆచరింప తగ్గవి. ఆచరిస్తే తప్కక ఆ గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టిన వాళ్లమవుతాం.

Leave a Reply