అవని ఏమంది?

కేంద్రపాలిత ప్రాంతం యానాం నించి ఈ మధ్యనే బ్లాగువనంలో తనకవితా గళం విప్పిన కోకిల బొల్లోజు అహ్మదలీ బాబా గారు .. ఈ అవని ఏమన్నదో వినమంటున్నారు.
అవని ఏమంది?
చిల్లులు పడిన ఒజోను దుప్పటిని కప్పుకుని
పీలికలైన పచ్చని చీరను చుట్టుకొని
నీళ్లలో తడిచి ఒరిసి పోయిన పాదాలతో
తీవ్రమైన జ్వరంతో వణుకుతున్న
అవని ఏమంది?
కుచించుకుపోతున్న అడవులు
వాహనాలు వెదచిమ్ముతున్న విషాలు
ఎడారులయ్యే పంటభూములు
తీరాలను ముంచెత్తే సాగరాలు
వ్రణాలు పడుతున్న పర్యావరణం…….
బిడ్డా ……. కళ్లుతెరు…. కళ్లుతెరు అంది.
అవని ఏమంది?
సూర్య, పవన, జలశక్తులను మచ్చిక చేసుకొని
రాక్షసబొగ్గు రాక్షసత్వానికి [...]

ప్రపంచ వ్యాప్తంగా బత్తీబంద్ బ్లాగులు

కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రాచార్యులు మేథ్యూ కాహ్న్ గారి ఆలోచనలు

ఒక అల్లరి పిల్ల చెప్తోంది లైట్లార్పమని

ఆకు పచ్చ ఇప్పటి స్టైలంట! మెగ్ మాట వినండి

సిడ్నీ చీకటిని చూసి ఉత్తేజం పొందిన అమెరికన్ టూరిస్ట్

ఇంగ్లండులో మెలనీ పుట్టిన రోజున ప్రపంచమంతా ఆమెకి హేపీ బర్త్ డే చెప్పిందిట!