ఓ గంట సేపు లైట్లార్పితే, ప్రపంచం వేడెక్కకుండా ఆగిపోతుందా?

బ్లాగువనంలో ఒక ముచ్చటైన పర్ణశాల వేసుకుని, “సూతుడు శౌనకాది మునులకు ..” టైపులో తన కాలేజీ పురాణాన్నీ, సినిమాల గురించి తన ఆలోచనల్నీ, పనిలో పనిగా మరెన్నో కబుర్లనీ రసవత్తరంగా చెబుతున్న కత్తి మహేష్ కుమార్ .. ఉవాచ:

ఓ గంట సేపు లైట్లార్పితే, ప్రపంచం వేడెక్కకుండా ఆగిపోతుందా?
ఖచ్చితం గా కాదు.

మరి ఈ మాత్రానికే ఈ తాపత్రయం ఎందుకు! అన్నదే అసలు ప్రశ్న.

ఊదాహరణకి, జనగణమన వినిపించినా మనం లేచి నిల్చోకుంటే, మన దేశభక్తి తగ్గిపోతుందా?
లేక భారతమాత చిన్నబోతుందా?
అస్సలు కాదు.
ఐనా మనం జాతీయగీతం నిలబడే పాడుతాం.
జెండా వందనం మనసు నిండి పొర్లిపోతున్న గర్వానందంతో చేస్తాం.

ఎందుకంటే అవి మన జాతికి చిహ్నాలు.

ఇదీ అంతే

ఈ ‘గ్లోబల్ వార్మింగ్’ ఇలాగే సాగితే ప్రపంచం లో మనుషుల జీవితాలే కాదు, సకల జీవ జాలమూ అతలాకుతలం అయిపోతాయి. కాబట్టి వారికోసం, మనకోసం, మన భూమి కోసం ఒక్క గంట, చీకటిని చూస్తూ ఇలా జరగకూడదని కోరుకుందాం. ఈ చీకటిని ఒక బలమైన చిహ్నంగా చేసి, తెలియని వాళ్ళకి దీనిగురించి తెలియచెబుదాం.

ఇలాంటి చిహ్నాలకి …
అనుభూతుల్ని పంచే శక్తి ఉంటుంది ..
ఆశల్ని రేకెత్తించే గుణం ఉంటుంది ..
ఆలోచన పుట్టించే చేవ వుంటుంది
ఉద్యమాల్ని రగిలించే కసి ఉంటుంది.

ప్రపంచం, పాడైపోతోందని ఎప్పుడూ వాపోయే మనకు మనపరిధిలో బాగుచేసే అవకాశం వచ్చింది.
ప్రయత్నిద్దాం!
కనీసం లైట్లార్పేసి ప్రార్థిద్దాం!!

2 Responses to “ఓ గంట సేపు లైట్లార్పితే, ప్రపంచం వేడెక్కకుండా ఆగిపోతుందా?”

  1. i will agree with you.

  2. నిజమె మీరుచెప్పింది. ఆగదు కానీ ఈ మెసేజ్ ని చేరవెయ్యటానికి ఇంతకన్న మరోదారి లేదు.
    మంచి కారణానికై మంచి మార్గాన్ని ఎన్నుకునన్న మీకందరకూ అభినందనలు.
    బొల్లొజు బాబా

Leave a Reply