బత్తీ బంద్
గ్లోబల్ వార్మింగ్ కి వ్యతిరేకంగా మనందరం మన కర్తవ్యం నిర్వర్తించాల్సిన బాధ్యత ఎంతో ఉంది. విచిత్రమేమిటంటే ఎంతగా మనం నివారణ చర్యలు పాటిస్తే అన్ని రకాలుగా మనం ఆర్థికంగా, హార్దికంగాను బాగు పడతాము.
బత్తీ బంద్ అంటే ఒక గంట పాటు స్వచ్ఛందంగా విద్యుత్తు వాడకాన్ని ఆపివేయడం. దీని వల్ల కలిగే నిజమైన మార్పు ఎంత పర్యావరణానికి అన్నది ముఖాంశం కాదు. ఇది మనం చేయాల్సిన అనేక క్రియల్లో ఒకటి మాత్రమే. ఐతే దీని ద్వారా మనం గమనించే తేడా మన జీవిత విధానమేమిటో, ఎక్కడ లోపముందో తెలియచెప్తుంది.
ఇది ఒక్కరి బ్లాగు కాదు. గ్లోబల్ వార్మింగ్ కి వ్యతిరేకంగా, ప్రకృతి పట్ల ప్రేమ ఉన్నవారందరికీ ఈ బ్లాగు చెందుతుంది.
గ్లోబల్ వార్మింగ్ అన్న పదాన్ని మీరు మొదటి సారి ఎప్పుడు విన్నారు, విన్నాక మీ అనుభూతులేమిటి?
గ్లోబల్ వార్మింగ్ మీద మీ ప్రశ్నలు ఏమిటి?
బత్తీ బంద్ చేసినప్పుడు మీ ఆలోచనలు.
మీ ద్వారా ఉత్తేజం పొంది చేసిన వారి అనుభవాలు.
ప్రాంతాలవారీ సభ్యత్వం
ఐడియాలు. మనం ఎంత బాగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళచ్చు. ఏమి చేస్తే అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటారు.
ప్రస్తుతానికి ఇవి విభాగాలు. మీ అందరి సహకారంతో మరిన్ని అర్థవంతమైన విభాగాలను చేరుస్తాము.